అధ్యాయం - 19
అనంత తేజోలింగ ఆవిర్భావం
•••••••••••••••••••••••••••••••••••
పూర్వం దేవకల్ప ఆది ప్రారంభంలో పరమాత్మ కాస్త నిరాకార తత్వముతో…. ఎలాంటి సంకల్పము లేకుండా నిర్వికల్పుడై పూర్ణ శూన్యముగా ఉన్నాడు. ఒకసారి ఈయనకి సృష్టి చేయాలని తొలి సంకల్పం మొదలయ్యింది. అప్పుడు ఈయన కాస్త నిరాకార తత్వము నుండి ఆకార తత్వమైన ఏకపాద రుద్ర మూర్తిగా అవతరించాడు. అప్పుడు ఈయన కాస్త సమస్త విశ్వము భావన చేశాడు. దీనికి సృష్టికర్తను, స్థితికర్తను సృష్టించాలని అనుకుని….తన కుడి భాగము నుండి చతుర్ముఖ బ్రహ్మను ఎరుపు రంగు శరీరముతో రజోగుణముతో సృష్టించి ఈయనకి సృష్టి బాధ్యతను అప్పగించడం జరిగింది. ఆ తరువాత ఎడమ భాగము నుండి విష్ణుమూర్తిని, తెల్లని శరీరముతో సత్వ గుణముతో బ్రహ్మ సృష్టికి స్థితికారకుడిగా బాధ్యతను అప్పగించడం జరిగింది. బ్రహ్మ కాస్తా తన సృష్టికర్త కార్యాన్ని ఆరంభించాడు. అనగా తన మనసునుండి మరీచి మొదలైన పదిమందిని సృష్టించాడు . ఆ తర్వాత తన కుడి కాలి బొటనవేలు నుండి దక్షుని సృష్టించి…. సమస్త లోకాలను సృష్టించమని ఇతనికి అనుజ్ఞ ఇవ్వటం జరిగింది. ఆ తరువాత బ్రహ్మ ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు సృష్టించడం జరిగింది. ఆ తర్వాత మరీచి పుత్రుడైన కశ్యప మహర్షి నుండి దేవదానవులు, మరుత్గణములు, సర్పాలు, గరుడ పక్షులు, గంధర్వులు, అప్సరసలు జన్మించారు. మనువు నుండి మానవులు జన్మించారు. అత్రి మహర్షి నుండి ఈ మానవులలో బ్రాహ్మణ, క్షత్రియ కులాలు ఉద్భవించాయి. పులస్త్య, పులహుల నుండి యక్ష, రాక్షసులు జన్మించారు. అంగీరసునికి ఉతద్యుడు, బృహస్పతి ఇలా గ్రహ దేవతలు జన్మించారు. భృగు మహర్షికి అగ్ని, చ్యవనుడు అనే పంచభూత తత్వ ఋషులు జన్మించారు. వశిష్టునకు మహర్షులు జన్మించారు. ఇలా వీరందరిలో దేవతలు, దానవులు, మానవులు జంతువులు, పక్షులు, వృక్షాలు, నవగ్రహాలు, పంచభూతాలు, కాలము, మున్నగువాటితో విశ్వజగత్తు కాస్త బ్రహ్మ సృష్టితో నిండిపోయింది. దీనిని మనం ఒక వరుస క్రమంలో చెప్పాలంటే బ్రహ్మా నుంచి రెండు రూపాలు ఉద్భవించాయి. వారు స్వయంభువ మనువు మరియు శతరూప అయ్యారు. వీరి నుంచి ప్రజా సృష్టి జరగాలని బ్రహ్మ సంకల్పించాడు. ఈ శతరూప మరియు స్వయంభువ మనువుకు ప్రియ వ్రతుడు, ఉత్తనాపాదుడు, అను పుత్రులు…. ఆకూతి, దేవాహుతి ప్రసూతి అను పుత్రికలు జన్మించారు. అయితే అకూతిని రుచికి ఇచ్చి వివాహం చేయగా….. దేవహుతిని కర్థమునికి ఇచ్చి వివాహం చేయగా….. ప్రసూతిని దక్షునికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఇలా దక్షుడికి మరియు ప్రసూతికి 16 మంది పుత్రికలు జన్మించారు. ఇందులో 13 మందిని యమధర్మరాజుకి…. ఒకరిని అగ్నిదేవునికి…. ఒకరిని పితృగణానికి…. మరియొకరిని సతి దేవిని శివుడికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే శివద్వేషిగా ఉన్న దక్షుడు వీరభద్రునివల్ల శిరస్సు చేధనకు గురి అయ్యాడు. ఆ తర్వాత తప్పును తెలుసుకోవడంతో….మేక శిరస్సుతో మళ్ళీ బ్రతికాడు. ఆ తర్వాత దక్షుడు ఆ దేహాన్ని కూడా విడిచిపెట్టి ….. ప్రచేతసుల వలన మరీచి మరీచునికి జన్మించాడు. తిరిగి అతను దక్షునిగానే జన్మించి….. పంచజనని గర్భంలో పదివేల మంది పుత్రులను పొందారు. కానీ వారందరూ నారద ఉపదేశంతో భక్తి మార్గాన్ని చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ దక్షుడు 1000 మంది పుత్రులను కన్నాడు. వారు కూడా భక్తి మార్గంలోనే యోగాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత దక్షుడు 60 మంది కూతుళ్ళకి జన్మనిచ్చాడు. స్త్రీలు సన్యాసానికి అనర్హులు కాబట్టి….. వారికి భక్తి మార్గాన్ని ఉపదేశం చేయకూడదనే…. అప్పటి ప్రబోధనగా ఉండేది. అప్పుడు ఈ దక్షుడు పదిమందిని యమధర్మరాజుకి….. 13 మంది కశ్యపునికి…. 27 మంది చంద్రునికి…. మిగిలిన పదిమందిలో నలుగురిని మళ్లీ తిరిగి కశ్యపునికి……తర్వాత ఇద్దరినీ భూతునకు…. ఇద్దరినీ అంగీరసునికి…. మరొక ఇద్దరినీ పృషస్వనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ 60 మంది దక్షపుత్రికల వలనే 84 లక్షల జీవజాతులు ఉద్భవించాయి. అందులో ముఖ్యంగా తిమికి జలాచరాలు…. వినతకు గరుడుడు…. కద్రువకి నాగులు…. కాష్టకు అశ్వాలు, సురాసకు రాక్షసులు…. మునికి అప్సరసలు….. తామరకి గ్రద్దలు, రాబందులు… శరమకు సింహ, వ్యాఘ్రము వంటి జంతువులు…. పతాంగినికి పక్షులు…. యామనికి సలాభములు… దితికి హిరణ్యాక్ష,హిరణ్యకశిపులు…. అరిష్టకు గంధర్వులు… ఇలకు వృక్షములు…. పదవసకు దంధాలుకము అనే సర్పములు…. సురభికి గోవులు ,మహిషాములు…. స్వరూపకు ఏకాదశరుద్రులు జన్మించారు. మనవు నుంచి రావటం వలన మానవులం అయ్యామని…. ఇలా బ్రహ్మ సృష్టి చేయాలనే సంకల్పంతో స్వాయంభువ మనవు మరియు శతరూప వద్ద నుంచి 84 లక్షల జీవజాతులు ఉద్భవించాలని…. శ్రీమద్భాగవతంలోని షష్ఠమ స్కందంలో చెప్పడం జరిగింది.
ఇలా జగత్తును సృష్టించిన బ్రహ్మ కాస్త సరస్వతిని వివాహం చేసుకొని…. శివమోహమాయ అయిన అహంకార మాయలో పడి…. తనని సృష్టించిన తండ్రియగు పరమేశ్వరుని మర్చిపోవడం జరిగింది. ఇది ఇలా ఉంటే స్థితికారకుడైన విష్ణుమూర్తి కాస్త భృగు పుత్రిక అయిన మహాలక్ష్మి దేవిని వివాహం చేసుకొని…. స్థితికార కార్యముల కోసం పలు అవతారాలు అనగా…. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, శ్రీకృష్ణ, బుద్దావతారాలు…. వీటిని ఒక వరుస క్రమంలో చెప్పాలంటే శ్రీహరి నుంచి బ్రహ్మ…. బ్రహ్మా నుంచి మరీచి ….మరీచి నుంచి కశ్యప ….కస్యపుడి నుంచి సూర్యుడు…. సూర్యుడు నుంచి మనువు ,….. మనువు నుంచి ఇక్ష్వాకువు…. ఇక్ష్వాకు నుంచి కుక్షి….. కుక్షీ నుంచి వికుక్షి ….. ఇతని నుంచి బాణ…. బాణ నుంచి అనారణ్య…. ఇతని నుంచి ప్రుధువూ…. పృదువు నుంచి త్రి శంకువు…. ఇతని నుంచి దుందుమారుడు…. దుందుమారుడు నుంచి మాంధాత….. మాంధాత నుంచి సుసంది….. సుసంధి నుంచి దృవసంధి…..ఇతని నుంచి భరతుడు…. భరతుడి నుంచి అశితుడు…. అసితుడు నుంచి సగరుడు…. సగరుని నుంచి అసమంజనుడు….ఇతని నుంచి అంశుమంతుడు…. అంశుమంతుని నుంచి దిలీపుడు….. దిలీపుడి నుంచి భగీరథుడు…. భగీరథుడు నుంచి కుకుత్సుడు….ఇతని నుంచి రఘువు….. రఘువు నుంచి ప్రబుద్ధుడు… ప్రబుద్ధుడి నుంచి శసంకుడు….ఇతని నుంచి సుదర్శనుడు…. సుదర్శనుడు నుంచి అగ్ని వర్ణుడు అగ్ని వర్ణుడు నుంచి శీఘ్రవేధుడు…. శీఘ్రవేదుని నుంచి మరు…. ఇతని నుంచి ప్రశేషకుడు ….ఇతని నుంచి అంబరీష్యుడు…. అంబరీషుని నుంచి యయాతి….ఇతని నుంచి నబాగుడు….ఇతని నుంచి అజుడు….. అజుడు నుంచి దశరధుడు…. నుంచి శ్రీరాముడు ఇలా ఎన్నో జన్మలు ఎత్తుతూ….. తన జన్మ కారకుడైన తండ్రియగు పరమేశ్వరుడిని మర్చిపోవడం జరిగింది. ఇలా బ్రహ్మ కాస్త సృష్టి ప్రదాత అనే అధికారం వలన….. అలాగే విష్ణుమూర్తికి స్థితి ప్రదాత అనే అధికారం వలన అహంకారం మొదలైంది. ఎందుకంటే అధికారం అనేది అహంకారమును పెంచుట సహజమే కదా
బ్రహ్మ - విష్ణుమూర్తికి మధ్య కలహము
నేను ప్రభువు అని బ్రహ్మకి మరియు నేనే సమర్థుడను అని విష్ణువుకి…. గర్వ అహంకార శివమోహమాయ పరవశులై…. వీరిద్దరికీ పరస్పర స్పర్ధ చేత కలహం ఏర్పడింది. దానితో బ్రహ్మ దేవుడికి రజోగుణము ఎక్కువైపోయి….ఈయన శరీరం కాస్త ఎరుపు రంగు కాస్త నలుపు రంగులోకి మారి విష్ణువుతో “ఓరి! విష్ణువా! నీకు ఎందుకు ఈ గర్వాహంకారాలు…. కేవలం నువ్వు నాకు తండ్రి అయినంత మాత్రాన నాకంటే ఎలా అధికుడవి అవుతావు? నేను సకల లోకాలకి… సృష్టి పితామహుడిని. నీ నుండి పుట్టిన మధుకైటభులు అను రాక్షసులను సంహరించి… దైత్యారి అని బిరుదును పొంది పొంగిపోవడం హాస్యాస్పదము కాదా? నిన్ను సృష్టించిన నా చేతులకు ఇంకా అలసట తీరనేలేదు. నా శ్రమ చేత సృష్టించబడిన సముద్రంలో మునిగి…. న్యగ్రోధ (మర్రి) వృక్షమును నేను సృష్టించకపోతే, నీకు నిలుచుటకు ఆధారమే ఉండేది కాదు కదా! నేను సృష్టించిన క్షీరసాగరములో…. నేను సృష్టించిన అనంత మహా సర్పమును శయ్యముగా చేసుకొని కులుకుతున్నావు…! రాక్షసులకి భయపడి నిద్రలో మునిగి స్థిరమై నా ఆధీనంలో ఉన్న జగత్తునే మరచిన నీవు…. ఎలా జగత్తుని కాపాడుతున్నావు ! నా నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలు ఉద్భవించాయి… నా భార్య సరస్వతి చైతన్య స్వరూపిణి మరియు జ్ఞాన స్వరూపిణి కావడం చేత, స్థిరముగా ఉండే ఈ జగత్తు కాస్త కదిలే ప్రాణులు ఉన్న జగత్తుగా మా ఇద్దరి వలన జరుగుతోంది. ఈ జగత్తు అంతా కూడా నా పుత్రులైన మనువులైన …. ఇంద్రాది దేవతలు, మహర్షుల చేత రక్షించబడుతోంది. అంతెందుకు….నీ బొడ్డులో పుట్టిన పద్మము నా ఆసనం అని ….అందుచేత నాకంటే నీవు అధికుడవని… నీవు ప్రగల్భములు చెప్పుకోవటం ఎంతో వింతగాను,ఆశ్చర్యంగానూ ఉంది. నిజానికి నీలో తమోగుణం ఉంటే… నీకు సత్వగుణం ఉన్నదని అనటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏ లెక్కన చూసినా కూడా నువ్వు నాకన్నా ఎలా అధికుడవి అవుతావో చెప్పు అనగానే… నారాయణుడు కాస్త, బ్రహ్మ ప్రగల్భములకి నవ్వి….. తాను కూడా ఆవేశముతో ఓ బ్రహ్మ! వృధా మాటలు ఎందుకు? నీ జన్మ నా నాభి మధ్యము నుండే జరిగింది కదా! మధు కైటభులు నిన్ను బాధించగా ….నేను యోగ నిద్ర నుండి మేల్కొని వారిని వధించకుంటే నీ ఉనికి ఉండేది కాదు కదా! అంతెందుకు….. సోమకాసురుడు మొదలగు రాక్షసులను నా దశావతారాలైన మత్స్య మొదలుగా అవతారాలు ఎత్తి వారిని సంహరించి…. ఈ జగత్తుని రక్షించకపోతే, నీ సృష్టి ఏమై ఉండేదో ఒకసారి ఆలోచించు. విషయం నీకే అర్థమవుతుంది . రజోగుణముతో ఉన్న నీకు గర్వ,మద, అహంకార గుణములతో నీ కన్నులు మూసుకున్న నీకు…. అవి ఎలా గుర్తుంటాయి.? పద్మవాసి అయిన నా సతీమణి మహాలక్ష్మి దేవి అనుగ్రహం చేతనే ఈ జగత్తులు వర్ధిల్లుతున్నాయి. పంచభూతాలు కాలము నేనే కదా! నీవు కూడా నేనే కదా! అందుచేత నేను లేకపోతే విశ్వజగత్తులోని సర్వలోకాలు లేవు. నేను లేకపోతే ముల్లోకాలు లేవు…. ద్వాదశ ఆదిత్యులు, అష్ట దిక్పాలకులు అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, అష్టమనువులు నేనే కదా! భూమి, పాతాళ, స్వర్గలోకాలు అనే ఈ త్రిలోకాలు నా ఆధీనంలోనే ఉంటాయి కదా! నీవు చేసే సృష్టి అంతా కూడా నా ఆజ్ఞకు లోబడి ఉందని మర్చిపోతున్నావు! ఈ విధంగా త్రిలోకానాధుడైన నాకన్నా నీవు ఎలా అధికుడవి అవుతావు!నాతో నువ్వు ఎలా సమానుడివి అవుతావు? ఏమి నీ అవివేకము….” అని విష్ణుమూర్తి అనేసరికి ఇలా వీరిద్దరి మధ్య కలహము తగ్గకపోగా….అంతకు అంతా పెరుగుతూ …పరస్పరం ఒకరినొకరు దూషించుకుంటూ…. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. వారి కలహం వలన సూర్యచంద్రులు ప్రకాశించలేదు. నక్షత్ర, గ్రహ మండలాలు తమ కాంతిని కోల్పోయాయి. గాలి స్తంభించింది. పర్వతాలు కంపించాయి . ఔషధాలు ఇంకిపోయాయి . జంతుజాలం శోకించింది. పక్ష మాస, ఋతు చక్ర, కాలచక్రము తిరగటం ఆగి….అంతరించ సాగింది. దానితో పగలు, రాత్రి కాస్త అస్తవ్యస్తమయ్యింది. లోకవాసులు కాస్త కల్పాంతమైనదని భ్రమ చెందడం ఆరంభించారు. ఇలా మహా సంక్షోభం సంభవించగా…. మహేశ్వరుడు కాస్త ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలని…. దివ్య దృష్టితో చూడగా…. ఈ సంక్షోభమునకు మూల కారణం బ్రహ్మా, విష్ణువుల కలహమని తెలుసుకొని… సకల ఐశ్వర్యకారకుడైన తనని మరిచి….అధికార మదముతో వీళ్ళు కాస్త ఎవరికి వారే ప్రభువులమని కలహించుకుంటున్నారని….ఈ సమస్త జగత్తుకు నేనే కారణమని తెలిసినా కూడా….. ఇలా వీరిద్దరూ కాస్త మోహమాయకు వశమై తెలిసిన జ్ఞానమును మరిచిపోయి…. అజ్ఞాన అంధకార అహంకారంలో మునిగిపోయి…. ఈ రకంగా ప్రవర్తిస్తున్నారంటే మోహమాయ ఎంత బలవత్తరమైనదో కదా! ఇలా వీరిద్దరూ కూడా… తామిద్దరము కూడా…. తమకే తెలియని అజ్ఞాన అంధకారంలో పడిపోయి తమ ఎదుట ఉన్నదానిని కూడా గుర్తించలేకపోతున్నారు కదా! వీరు మోహముతో అపరాధం చేస్తున్నా కూడా నేను వీరిని ఉపేక్షించకూడదు. వీరి వలన ఇప్పటికే లోకాలు అన్నీ కూడా అంధకారంలో మునిగాయి. ఎలా అయినా నేనే వీరి మధ్య ఉన్న మోహమాయను పోగొట్టి…. వీరిని అలాగే లోకాలను రక్షించాలని అనుకుని సదాశివుడు సంకల్పించాడు. ఉత్తమమైన కరుణ వలన విష్ణువు, బ్రహ్మ కాస్త తమ మోహమాయ నుండి విముక్తి చెందారు. ఎలా అంటే వేదాలలో నా మహత్యము ఆదిక్యం వివరించబడి ఉంది కదా! ఈ మూఢులు తమ కోప కలహము వలన వేద జ్ఞానమును మరిచిపోయి…. తమలో తాము కలహించుకుంటూ….. లోకములో ఉన్న సమస్త ప్రాణుల కన్నా తామే ఘనులమని భావిస్తున్నారు కదా! ఈ అహంకారం వలనే దుష్టులై పతనమవుతున్నారు అనుకొని…. దీనికి పరిష్కార మార్గముగా నేను నా మహత్యమును ప్రకటిస్తే కానీ అప్పుడు నా స్వరూపమును దర్శించి వారు నన్ను పొందుతారు అని భావించి….సదాశివుడు కాస్త వీరిద్దరి మధ్యలో తేజో స్తంభమై ఆవిర్భవించాడు.
తేజోలింగ ఆవిర్భావం
ఈ రకముగా లోక వినాశకరముగా కలహించుకుంటున్న బ్రహ్మ విష్ణువుల మధ్య ఆకాశమంతా నిండిపోయి…. దేదీప్యమానమైన ఒక మహా జ్యోతి స్తంభం ఆవిర్భవించింది. దీనివలన అంతరిక్షం కనిపించక అదృశ్యమైనది కదా! అనిపించసాగింది. దిక్కులు ఎచ్చటికో విసిరి వేయబడినట్టుగా గ్రహ, నక్షత్ర తారకలు తమ కాంతిని కోల్పోయినట్లుగా….ఈ జ్యోతి అగ్నిజ్వాలచే సప్త సముద్రాలు ఇంకిపోయినట్లుగా….. పర్వతాల మీద ఈ జ్యోతి తేజస్సు ప్రతిబింబించడంతో సూర్యుని వలె వెలుగుతున్నాయి. ఆకాశ నక్షత్రాలు కాస్త ఈ తేజస్సు నుండి వెలువడుతున్న నిప్పురవ్వల వలే కనిపించసాగాయి.సముద్రాలు కాస్త పద్మరాగ మణుల వలె మెరుస్తున్నాయి. ఆకాశం ఎర్రగా మారింది. దిక్కులన్నీ సింధూర రంగుతో వెలిగిపోతున్నాయి. నదులన్నీ కూడా ఒక్కసారిగా అనంత పద్మములు వికసించినట్లుగా పద్మ కాంతులతో వెలిగాయి. అంటే భూదేవి భ్రూ మధ్యంలో కుంకుమ బిందువు పెట్టుకున్నట్లుగా శోభించసాగింది. తద్వారా ఈ బ్రహ్మాండమంతా శివుడి చేతిలో ఉండే కపాలము వలె ఈ తేజోస్తంభము యొక్క ఎరుపు రంగుతో నిండిపోయింది. ఇలా ఈ తేజోలింగం కాస్త సర్వలోకాలకు అతీతమై…. మొదలు చివర లేకుండా సర్వత్రా అగ్నివలె జ్వలిస్తూ …..చూడటానికి వీలుకాని స్థితిలో ఉంది. దీనిని చూస్తున్న బ్రహ్మ, విష్ణువులకి దిక్కుతోచక అలాగే నిశ్చల స్థితిలో నిల్చుని…. చూస్తున్న వీరిద్దరికీ తమలో తాము అనగా బ్రహ్మ కాస్త “ఏమి తేజము! చూస్తుంటే ఒక్కసారిగా ద్వాదశ ఆదిత్యులు ఉద్భవించినట్లుగా ఉంది. మేఘ సంకర్షణములో ఉద్భవించిన 12 ఆదిత్యులు కలిసి భూమి ఆకాశం ఆవరించినట్లుగా ఉంది. కన్నులు ఈ దివ్య తేజస్సు వలన మెరుస్తున్నాయి… ఈ భరించరాని తేజస్సు కాస్త భూమండలమును మోస్తున్న ఆదిశేషుని సప్త పడగలలోని మాణిక్యముల కాంతులను ఒకే చోట పెట్టినట్లుగా ఉంది. ఈ సమస్త ప్రాణికోటినీ ఆక్రమించినా కూడా…. దీని అగ్ని తేజస్సు తీవ్రంగా ఎవరిని బాధించడం లేదు. కేవలం ఉష్ణస్థితి. అది వేడిని మాత్రమే చూపుతోంది. ఇది ఒకవేళ కల్పాంతము సూచన? ” అని అనుకోసాగాడు. అప్పుడు విష్ణువు కాస్త బ్రహ్మతో ఈ తేజస్సు చూస్తే ఇది నిజంగా మనల్ని పరీక్షించుటకు పుట్టినట్లుగా ఉంది. కనిపించని దీని అంత్యము , అగ్రము ఒక్కరే కనుగొనటం అసాధ్యముగా ఉంది…. అనగానే అవును దీని కాంతిచే మన దేహాలు కాస్త ఎరుపు రంగు ధరించాయి కదా ! ఇది ఎక్కడినుండి ఎలా ఉద్భవించిందో….ఒక పట్టాన అర్థం కావడం లేదు. దీని మూల కారణం ఏదో తెలియడం లేదు. ఇది దేని శక్తి చేత ఇలా ప్రజ్వలించుచున్నదో కూడా అర్థం అవడం లేదు. దీని మూలం పాతాళ లోకమున ఎంత లోతు ఉన్నదో…… అలాగే దీని అగ్ర భాగం ఆకాశంలో ఎంత ఎత్తులో ఉన్నదో……! అనుకోసాగారు. ఇలా వీరిద్దరూ దిక్కు తోచని స్థితిలో ఉండగా…. ఒక అశరీరవాణి కాస్త “ఓ మూఢులారా! ఎందుకు మీలో మీరు తగువులు ఆడుకుంటున్నారు… మీ కలహ వివాదం సదాశివుడే తీర్చగలడు. మీ ముందు ఉన్న ఈ దివ్య తేజోస్తంభమే సదాశివుడు. కాబట్టి మీలో ఎవరు దీని ఆది,అంతము చూస్తారో…. వారే జగదీశ్వరులు అని అంగీకరించండి…. అని చెప్పి అంతర్దానం అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఆ అశరీరవాణి మాటకి కట్టుబడి…. ఈ తేజో స్తంభం యొక్క మూలమును విష్ణువు చూడాలని…. అలాగే దీనిని శిరోభాగమును బ్రహ్మ చూడాలని నిశ్చయించుకొని, విష్ణు కాస్త వరాహ రూపంతో ఈ తేజస్సు మూలమైన పాతాళ లోకము వైపుకు వెళితే…. బ్రహ్మ కాస్త హంస రూపముతో ఈ తేజస్సు యొక్క అగ్రమును చూడాటానికి ఆకాశం వైపు వెళ్లడం జరిగింది.
నవదశ అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్
సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి