అధ్యాయం - 32

 అధ్యాయం - 32

కార్తీక దీపోత్సవ మహత్యము 

------------------------------------------------------------




స్వామి… అరుణాచలేశ్వర!  కార్తీకమాసం నందు దీపారాధన చేస్తారని మీరు చెప్పడం జరిగింది. ఈ మాసము నందు దీపారాధన చేస్తే…. మీరు మమ్మల్ని ఎలా అనుగ్రహిస్తారో నా యందు అనుగ్రహం  ఉంచి మీ అనుగ్రహ భాషణం ఇవ్వండి అనగానే ….. వత్సా! గౌతమా! నా యందు నీ భక్తిని పెంచుకుంటూ వస్తూ…. నా మహిమలు ఒక్కొక్కటిగా నా ద్వారా తెలుసుకుంటూ….. లోకానికి తెలియజేయాలనే  నీ భక్తికి నేను ముగ్ధుడిని అయ్యాను. నువ్వు అడిగిన వాటన్నింటినీ వివరంగా చెబుతున్నాను… శ్రద్ధ భక్తితో ఆలకించు….. 


అరుణాచల దీప దర్శనం….చేత  సర్వపాప క్షయం అవుతుంది.  అనగా…. కార్తీకమాసమున కృతిక నక్షత్రంతో కూడిన కార్తీక పౌర్ణమి తిథినాడు… నా శివప్రదోష సమయం అనగా….. సాయంత్రం 6 గంటలకు నా శోణగిరి యందు వెలిగించే నా జ్యోతిర్లింగ దీప దర్శనము చేసుకొని…. నా శోణగిరికి ప్రదక్షిణము చేసి….. నా రూపమైన అరుణాచలేశ్వర శివలింగమూర్తిని దర్శించుకుంటారు. ఇలా చేసేవారికి   ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్య ప్రాప్తి పొందడం జరుగుతుంది.  ఇలాంటివాడు నా భక్తులలో …ఉత్తమమైన వారు అవుతారు.  ఈ ఉత్సవం జరిగే 11 దినాలు ఇలాగే ప్రతిరోజు చేస్తే….. సహస్ర అశ్వమేధ యాగాలు చేస్తే వచ్చే ఫలితమును వీరు పొందడం జరుగుతుంది. అంతెందుకు….. కార్తీక పౌర్ణమి తిథినాడు ఎవరైతే సంధ్యాకాలమున,  నా ఆలయమునందు ఆవు నేతితో లేదా నూనెతో లేదా సారంగ తైలంతో లేదా ఆముదంతో దీపారాధన చేస్తే…. వారు కాస్త అనంత ఫలములు పొంది ధన్యులై… ధర్మాత్ములు అవుతారు.  ఇలాంటి దీపారాధనని ఆలయ గోపురాల దగ్గర లేదా గిరి శిఖరాలలో చేసినను వారు కాస్త సర్వపాపముల నుండి విముక్తి పొందడం జరుగుతుంది. ఈ మాసము నందు మోహము చేతనైన లేదా దర్పము చేతనైన లేదా భక్తితో అయినా దీపారాధన చేస్తే నాకు అత్యంత ప్రియులు అవుతారు.  నా శోణగిరి మీద వెలిగించే కార్తీకదీపం దర్శనం చేసుకుని….సాయంత్రం గిరిప్రదక్షిణము చేస్తే… వారు చేసే ప్రతి అడుగుకి  అశ్వమేధ యాగ ఫలితం కలుగుతుంది.  అంతెందుకు…. ఈ కార్తీక దీప దర్శనం మాత్రం చేతనే సర్వదాన ఫలము అలాగే సర్వ తీర్థ స్నాన ఫలితములు లభిస్తుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా కోరిక కోరుకుని దర్శనం చేసుకొని గిరిప్రదక్షిణ పూర్తి చేసిన ఏడు నెలల లోపు వారు కోరిన కోరిక తప్పకుండా తీరుతుంది. అది ఎలా  నేను అనుగ్రహిస్తానో…. నేను అనుగ్రహించిన వారి స్వానుభవం నీకు చెబుతాను.  శ్రద్ధగా వినుము.. 


పూర్వకాలంలో పాంచాల దేశంలో… వజ్రసేనుడు అనే రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఇతనికి సంతానం లేదు. దానితో ఇతను చేయని దానము కానీ పూజలు కానీ వ్రతాలు కానీ లేవు. ఒక రోజు ఈయన ఆస్థానానికి పైంగలడు అనే మహర్షి రావటముతో…. రాజు యొక్క ఆవేదన తెలుసుకొని పరిష్కార మార్గముగా రాజా ! నువ్వు అన్ని చేశావు గానీ…. చేయవలసిన కార్యం చేయలేదు. అది చేసి ఉండి ఉంటే నీకు ఏనాడో మగ సంతానం ఉండేది. సమయం మించిపోలేదు.  నువ్వు తక్షణమే కార్తీకపౌర్ణమినాడు అరుణగిరి మీద వెలిగించే అరుణ జ్యోతి దీపమును దర్శించుకుని… దంపతులు కాస్తా గిరిప్రదక్షిణము పూర్తి గావించిన సప్త మాసాలకి నీకు మగ సంతాన ప్రాప్తిని ఆ అరుణాచలేశ్వర స్వామి అనుగ్రహిస్తాడని సెలవివ్వడంతో…. ఇంక ఆ రాజదంపతులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా…. మహర్షి చెప్పిన విధివిధానంగా నా కార్తీక దీప దర్శనం చేసుకుని నా అనుగ్రహబలముతో మగసంతాన ప్రాప్తి పొందడం జరిగింది. రాజు కాస్త ఇతనికి శత్రుజిత్తు అని నామకరణం చేసి లేక లేక పుట్టిన సంతానం కావడంతో…. అతి గారాబముగా పెంచసాగాడు. దానితో ఇతను కాస్త హద్దులు మీరి అహంకార మదముతో వావి వరుసలు  లేకుండా…. తన కింద పని చేసే వారి భార్యల మీద కన్నేసి… కామోద్రేకుడై  కామాంధుడైనాడు.  రాజ దంపతులకు ఈ విషయం తెలిసినా…. తెలియనట్లుగా ప్రవర్తించడంతో…. ఇదే అదనుగా ఈ రాజకుమారుడు మరింతగా చెలరేగిపోయేవాడు.  ఇతని కామ దాహానికి ఆ రాజ్యంలో దరిదాపుగా స్త్రీలందరు బలి అయ్యేవారు. 


ఇది ఇలా ఉండగా…. ఒక రోజు ఇతని దృష్టి ఆస్థాన పురోహితులైన పూజారి భార్య మీద పడింది. ఇందుకు ఈమె కూడా ఇతనికి సహకరించడంతో…. వీళ్లిద్దరూ కాస్త ఇతని రాజ మందిరములో సంభోగించే కార్యక్రమమును ప్రారంభించే వారు.  ఒక రోజు ఈమెకి నా అరుణాచల క్షేత్ర అరుణగిరి యొక్క కార్తీక దీప దర్శనం చేసుకోవాలని బలంగా అనిపించడంతో…..ఈ విషయం కాస్త తన చెలికాడైన రాజకుమారుడికి చెప్పడంతో…. వీరిద్దరూ కాస్త రాజభవనం నుంచి పారిపోయి… నా అరుణాచలమునకు చేరుకోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన బ్రాహ్మణుడు కూడా…. ఈ క్షేత్రానికి చేరుకున్నాడు.  ఈ విషయం వీళ్ళిద్దరికీ తెలియదు.  వీళ్ళు యధావిధిగా కార్తీక పౌర్ణమి నాడు కార్తీకదీపం దర్శించుకుని…. గిరిప్రదక్షిణం గావించుకొని….నా ఆలయములో లింగ రూపంలో ఉన్న నన్ను దర్శించుకుని…. ఆపైన శ్రద్ధా భక్తితో ఈ బ్రాహ్మణ భార్య కాస్త తన చీరకొంగును చింపి వత్తిగా చేస్తే…. రాజకుమారుడు కాస్త ఒక మట్టి ప్రమిదను ఆముదం తీసుకొని వచ్చి ఈ ఒత్తితో  వీరిద్దరూ దీపారాధన చేసి….. ఆపై అక్కడే కాముకులై మంచి శృంగార పట్టుతో ఉండగా…. ఈ బ్రాహ్మణ భార్య భర్త అయిన పురోహితుడు అక్కడికి వచ్చి…. వీరిద్దరిని  చూడకూడని స్థితిలో చూసి ….తనతో తెచ్చుకున్న కత్తితో తన భార్యను అలాగే రాజకుమారిని పొడవగా ఇతను కూడా తన ఆయుధంతో ఈ పురోహితుడిని పొడవడంతో… ఈ ముగ్గురు కాస్త కార్తీక పౌర్ణమి నాడు నా ఆలయము నందు ప్రాణాలు వదలడం జరిగింది.  ఈ పాపులను తీసుకుని వెళ్ళుటకు యమదూతలు అలాగే శివ దూతలు నా ఆజ్ఞ మేర రావటం జరిగింది. ఇందులో శివధూతలు కాస్త తప్పు చేసిన బ్రాహ్మణ భార్యను అలాగే రాజకుమారుడని తీసుకొని పోతూ ఉండగా…. తప్పును  ఖండించిన పురోహితడిని కాస్త యమదూతలు తీసుకొని వెళ్తూ ఉండేసరికి….ఈ పురోహితుడికి ఆశ్చర్యం వేసి వారితో తప్పు చేసిన వాడికి శివలోక ప్రాప్తి నా? ఆ తప్పును చేయకుండా ఖండించే నాకు యమలోక ప్రాప్తియా? ఇది ఏమి ధర్మము ….! ఇదేమి న్యాయము..!  అని అనగా….అప్పుడు శివ దూతలు కాస్త ఇతనితో ఓ విప్రుడా ..! వీరు కాస్త కామమోహంతో దీపారాధన చేయడం జరిగింది.  కార్తీక పౌర్ణమి నాటి సాయంత్రం వేళ ప్రదోషకాలమునందు జ్ఞానముతో లేదా అజ్ఞానముతో కానీ దీపారాధన చేసిన యెడల వారి సకల పాపాలు నశిస్తాయి.  కావున వీరి పాపాలు అంతరించి పోవడంతో….. వారికి శివలోక ప్రాప్తి కలిగింది.  ఈనాడు నువ్వు ఎలాంటి దీపారాధన చేయకపోవడం వలన…. నీకు పాప భారం వలన నీకు నరక ప్రాప్తి కలిగింది అనగానే…. వీళ్ళ మాటల విన్న రాజకుమారుడు కాస్త ఒకే కాలంలో మరణించిన వారికి ఒకే గతి పడుతుందని శాస్త్రవచనం ఉన్నది కదా!  ఈ లెక్కను చూస్తే మేము చేసిన కార్తీకదీపం ఆరాధన ఫలమును ఈ విప్రుడికి దీపదాన దీప ఫలదానం చేస్తున్నాను అనగానే….. ఆ విప్రుడికి ఈ దాన ఫలితంగా నరకప్రాప్తి నుంచి నా శివలోక ప్రాప్తి పొందడం జరిగింది.  


కాబట్టి శుద్దుడైన లేదా  అశుద్ధడైనా ….కార్తీకదీప దర్శనం లేదా కార్తీక దీపారాధన చేస్తే పునర్జన్మ ఉండదు. సర్వ పాప విముక్తుడు అవుతాడు.  యమపాశం నుంచి విముక్తి పొందుతాడు.  రుద్రాంశ సంభూతులవుతారు.  కామ క్రోధముల నుండి దేహాభిమానం నుండి విముక్తి పొందుతారు.  ముక్తులు అవుతారు.  అదే శోణగిరి సమీపంలో నివసించేవారు ఎవరైనా…. నా కార్తిక దీప దర్శనం చేసుకోకపోయినా…కార్తీక దీపం చేయకపోయినను కుక్కలుగా, చండాలుగా పునః జన్మను పొందడం జరుగుతుంది. అలాగే ఈ కార్తీక మహోత్సవ సమయం నందు చేసే వదానమైనను …..కాశీగంగా తీర్థ స్నానమే కాకుండా ఈ భూలోకములో ఉన్న సర్వ తీర్థాల స్నాన ఫలితము పొందడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది.ఇలా గిరి అగ్రభాగమున వెలిగించే కార్తీకదీపం కాస్త 11 రోజుల తర్వాత కొండెక్కితే…. జాలరి భక్తులు కాస్త ఈ పెద్ద ప్రమిదను కొండ నుంచి ఆలయానికి చేరుస్తారు.  అప్పుడు ఈ ప్రమిద నుండి తీసిన కాటుకను ఆరుద్ర నక్షత్రం రోజున నటరాజ స్వామికి అభిషేకం చేసిన తర్వాత అలంకరించి…. తర్వాత కాటుకను ప్రసాదంగా భక్తులకి కొన్ని రోజులపాటు పంచడం జరుగుతుంది. ఈ కాటుక ప్రసాదమును కుంకుమ బొట్టు వలే నుదుటిన ధరిస్తే….. మానసిక, శారీరక ఈతి బాధలు తొలగుతాయి.


ఈ ఆలయంలో జరిగే ఉత్సవములు… అలాగే పండుగలు గురించి సవివవరంగా తెలియజేస్తాను.. ఈ అరుణాచల క్షేత్రంలో అనేక ఉత్సవాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉన్నప్పటికీ…. ప్రసిద్ధి పొందిన ఉత్సవాలు రెండు మాత్రమే ఉన్నాయి. అవి ఒకటి కార్తీకదీపం అయితే  రెండవది  తిరువూడల్ ఉత్సవం అన్నమాట!  ఇందులో ఇప్పుడు ఈ క్షేత్రంలో జరిగే కార్తీకదీపం గురించి ముందుగా తెలుసుకుందాము. 


ఇది తమిళనాడు కాలమాలమైన సూర్యమానం ప్రకారంగా జరుగుతుంది.  అనగా తమిళ కార్తీకమాసంలో వచ్చే కృతిక నక్షత్రం ఉచ్చ దశలో ఉన్నప్పుడు….. ఆ నాటి కార్తీక పౌర్ణమిన తిథినాడు ఈ ఉత్సవం చేస్తారు.  అనగా సహజంగా నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో వస్తుంది. ఈ దీపోత్సవం అనేది క్రీ. శ 2000 సంవత్సరం నుంచి జరుగుతుంది అని  అనేక తమిళ గ్రంధాలలో చెప్పడం జరిగింది. ఈ దీపోత్సవం 16 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటి రోజు ధ్వజారోహణం చేస్తారు.  దీనికి ముందు అరుణాచలేశ్వర స్వామి అలాగే అపితకుచాంబికా దేవిని సతీసమేతంగా ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చి…. ఆపై ధ్వజారోహణ గావించిన తరువాత…. వీరిద్దరినీ గుడి ప్రధాన వీధులలో ఊరేగించి…. ఆలయంలోని కళ్యాణమండపంలో స్థాపన చేస్తారు.  ఇలా వీరిద్దరూ సుమారుగా ఈ 10 రోజులపాటు ఇక్కడే ఉంటారు. ఇలా ప్రతిరోజు రెండు పూటలా….. రోజుకి ఏ రోజుకి ఆ రోజుకి సంబంధించిన వాహనంపై ఎక్కించి….. ఈ గుడి చుట్టూ ఉన్న నాలుగు వీధులలో ఊరేగిస్తారు.  ఆ ఊరేగింపులో భాగంగా ఐదవ రోజు వెండినంది వాహనం మీద అమ్మవారిని అలాగే అయ్యవారిని ఉంచి చేసే ఊరేగింపు చూస్తే…. సాక్షాత్తు కైలాసంలో వృషభ వాహనం మీద పార్వతీ పరమేశ్వరుడు కాస్త సజీవ మూర్తులై కూర్చుని ఊరేగిస్తున్నారా అనే భావం….. అలాగే ఈ వృషభ వాహనం మీద కూర్చుని ఉన్న అప్ప, అమ్మను చూస్తే…  చూసిన ప్రతివారు పులకించి పోతారు.  ఇలా ఈ వృషభ వాహన ఊరేగింపు చూస్తే వారి జన్మ సాఫల్యం కలుగుతుందని చెప్పడం జరిగింది. ఇలా ఎనిమిదో రోజు నాటి రాత్రి పంచమూర్తులైన స్కంద మూర్తి అపితకుచాంబికా దేవి, గణేశ, కుమారస్వామి, చండీశ్వరుడు విగ్రహ మూర్తులను పంచ రథాలలో ఉంచి…. బ్రహ్మాండంగా పురవీధులలో రథ ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఇక 16వ రోజు జరిగే ఉత్సవమే కార్తీకదీపం అన్నమాట!  తెల్లవారుజామున 5 మట్టి ప్రమిదలు వెలిగించడమే భరణి దీపమై…. ఈ ఉత్సవానికి ఆరంభమవుతుంది.


ఈ దీపము ప్రాముఖ్యత అనేది పరమాత్మ యొక్క పంచభూత తత్వానికి ప్రతీకగా…. పంచ దీపాలు వెలిగిస్తారు.  సాయంత్రం వేళలో వెలిగించే కార్తీకదీపంతో…. తిరిగి పంచభూతాలు కాస్త పరమాత్మలో విలీనం అవ్వటమే ప్రతీక అని చెప్పడం జరిగింది.  భరణి దీపం వెలిగించిన తర్వాత….గర్భగుడిలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి అయిన శివలింగమూర్తిని పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో, సువాసన ద్రవ్యాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేస్తారు.  ఆ తర్వాత గిరి అగ్రభాగానికి ఇత్తడితో చేసిన పెద్ద ప్రమిదను అలాగే….. 1000 మీటర్లు పొడవైన వస్త్ర ఒత్తిని…. మరియు 3500 కేజీల ఆవు నెయ్యిని…. భరద్వాజ మహర్షి వంశానికి చెందిన జాలర వంశస్థులు తీసుకొని వెళ్లడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఎలా శివప్రదోష సమయానికి ముందుగా పంచమూర్తులైన సోమస్కంద మూర్తి అపితకు చాంబికా దేవి, గణపతి, కుమారస్వామి చండీశ్వరుడు ఇలా పంచమూర్తులే కాకుండా… శివశక్తి స్వరూపమైన అర్ధనారీశ్వర స్వామి విగ్రహ మూర్తిని ఈ ఆలయ జ్యోతి మండపం దగ్గరికి తీసుకుని రాగానే…..సరిగ్గా 6 గంటల సమయంలో వీరందరి సమక్షంలో గిరి అగ్రభాగమున ఉన్న కార్తీకదీపం అనగా….. అరుణ జ్యోతిని వెలిగించడం జరుగుతుంది. ఈ కార్తీక దీప దర్శనము అవ్వగానే ఈ క్షేత్ర నివాసులు అందరూ కూడా…. తమ ఇండ్ల ముందు దీపారాధన చేయడంతో…. ఆరోజు దీపావళి అన్నట్లుగా…. భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది.  అలాగే కొండమీద వెలిగించే ఈ కార్తీక దీప దర్శనం అవ్వగానే స్థానిక భక్తులు కాస్త హరోం హరా అని అరుణాచల శివ నామ సంకీర్తన చేయడం జరుగుతుంది.  సుమారుగా 200 మంది భక్తుల సమక్షంలో కొండపైన ఎక్కి ఈ కార్తీకదీపం దర్శనమును అతి సన్నిహితముగా చూసి పులకరిస్తే ఈ దీప దర్శనం సుమారుగా 30 కిలోమీటర్ల పరిధిగా ఉన్న భక్తులు దూరం నుండే దర్శించుకుని పులకిస్తారు. 


ఈ కార్తీకదీపం అనేది సహజంగా భక్తులు ఇచ్చిన నెయ్యి హరించి పోయేదాకా అనగా సుమారుగా 11 రోజులపాటు వెలుగుతుంది.  ప్రతిరోజు సాయంత్రం జాలర్లు వెళ్లి దీపం ఆరిపోతే నెయ్యి వేసి వెలిగిస్తారు.  కార్తీకదీపమును వెలిగించిన రోజున…ఆ రోజు  గిరిప్రదక్షిణం చేసే వారికి ఈ దీపము నుండి నెయ్యి అలాగే సుగంధ కర్పూర వాసన ఆహ్లాదకరంగా చేసి మనస్సుని ఈ జ్యోతి యందు లయింప చేస్తుంది.  దానితో ఈ దీప దర్శనముతో పాటుగా గిరి ప్రదక్షిణం వలన సర్వజన్మాంతర పాపరాశి క్షయమై పుణ్యఫలం కలుగుతుంది. ఈ దీపోత్సవం అయిన రెండవ రోజు రాత్రి విష్ణు ప్రతిష్ట అయిన అరుణగిరి నాధర్ గుడి సమక్షంలో ఉన్న ఇంద్ర తీర్థము నందు తెప్పోత్సవం జరుగుతుంది.  మరునాడు అనగా మూడవరోజు ఉదయం పంచమూర్తులు కాస్త పంచరథాలలో ఎక్కి…. తమ వద్దకి రాలేని భక్తులకు అనుగ్రహించడానికి గిరి చుట్టూ గిరి ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది.  ఇలా వీరి గిరిప్రదక్షిణముతో బ్రహ్మాండమైన కార్తీక దీపోత్సవం జరుగుతుంది. 


ద్వాత్రింశత్ (32వ) అధ్యాయం సమాప్తం 

శుభం భూయాత్ 

సర్వం అరుణాచల శివార్పణమస్తు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి