మనకి అరుణాచల క్షేత్ర మహత్యమునకు సంబంధించిన ప్రస్తావము… స్కాంద పురాణమునందు, లింగపురాణమునందు, శివపురాణమునందు, కేనోపనిషత్తులో, ఉపమన్యు మహర్షి రచించిన “శివ భక్తి మహత్యము” అనే గ్రంథములో… శ్రీ జ్ఞాన సంబంధ భక్త కవి చరిత్రలో ఈ క్షేత్రం గురించి కనపడుతుంది. వ్యాసమహర్షి రచించిన స్కాంద పురాణంలో 81 వేల సంహితలలో మొదటిదైన కేదార, కౌమారిక, ఖండములు తరువాత వచ్చే మూడవది మహేశ్వర ఖండములో మనకి అరుణాచల క్షేత్ర మహత్యము ప్రస్తావించబడినది. ఇందులో మొదటి భాగములో బ్రహ్మదేవునికి - సనక మహర్షికి మధ్యన జరిగిన సంవాద రూపంలో 13 అధ్యాయాలుగా ……రెండవభాగంలో నందీశ్వరుడికి -భక్త మార్కండేయుడికి మధ్య జరిగిన సంవాద రూపంలో 24 అధ్యాయాలుగా చెప్పడం జరిగింది. ఈ రెండు సంవాద విషయాలు మనకి బ్రహ్మా ,విష్ణు మధ్య వివాదం, లింగోద్భవము, దక్షుని యజ్ఞము, శివపార్వతుల కల్యాణము, పార్వతీ పాప పరిహారార్థం తపస్సు చేయటం, అరుణగిరి క్షేత్ర మహత్యము, ప్రదక్షిణ మహత్యము, శివ భక్తుల వివరాలు ఉంటాయి. అలాగే శివపురాణంలో విద్యేశ్వర సంహితలో శివుడి విగ్రహారాధన మరియు లింగారాధన వివరాలు…. శివుడి పంచ కృత్యములు…. లింగోద్భవము గురించి వివరించడం జరిగితే విద్యాసార సంహితములో అరుణాచల క్షేత్రంలో అన్నదానం గురించి ప్రస్తావించబడినది. ఇదే విధముగా స్కాంద పురాణంలో క్షేత్ర ఖండంలో లో మనకి అరుణాచల క్షేత్రములో దీప దర్శన ప్రభావం గురించి చెప్పడం జరిగింది.
అలాగే ఉపమన్యు మహర్షి రచించిన “శివ భక్త మహత్యము” అనే గ్రంథములో భక్తకవి తిరు జ్ఞాన సంబంధర్ ఎలా అరుణాచల క్షేత్ర దర్శనం చేసుకున్నాడో …..అక్కడ ఆయన పొందిన అనుభవాలు గురించి చెప్పడం జరిగింది. ఈయన కాస్త తిరువన్నామలైకి 20 మైళ్ళ దూరంలో ఉన్న అరయని నల్లూర్ అనే ప్రదేశానికి వచ్చినప్పుడు… ఇక్కడి నుంచి కనిపించే అరుణాచల అరుణగిరి శిఖరాన్ని దర్శించి ,తన్వయత్వం చెందుతూ…. అరుణాచల శివని స్తుతిస్తూ 10 చరణములు గల పాటలు పాడడం జరిగింది. అలాగే అరుణాచల క్షేత్రం గురించి మనకి ఎన్నో ప్రాచీన సంస్కృత గ్రంథాలలో వివరాలు లభిస్తున్నాయి. 300 సంవత్సరాల క్రిందట తంజావూరు రాజుల కొలువులో మహాకవి శైవ “ఎల్లప్ప నావలాల్” అనే మహా భక్తుడు ఉండేవాడు. ఈయన తమిళంలో రచించిన “అరుణాచల పురాణం” అనే గ్రంథము పవిత్రమై లోక ప్రసిద్ధి పొంది… అరుణాచల క్షేత్రం యొక్క స్థల పురాణ విశేషాలు చెప్పే గ్రంథ పురాణముగా ప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత తమిళ పండితులు లక్కీరన్ ,కపిలర్, పరనార్, పట్టి నత్తర్ ,తిరుణావుక్కరసు, శెక్కిలార్ స్వామి, సుందర మూర్తి, మాణిక్య వాచకరులు… ఇలా మున్నగు వారంతా కూడా తమ రచనలలో , గేయాలలో, పాటలలో ….అరుణాచలేశ్వరుడిని స్తుతించి ప్రస్తావించడం జరిగింది.
ఇలా నేను కాస్త ఈ గ్రంథములో వివిధ పురాణ ఇతిహాసాలలో చెప్పబడిన అరుణాచల మహత్యము ప్రస్తావనలు అన్నీ కూడా…. ఇందులో రాయడంతో పాటుగా , చరిత్రలో ఈ ఆలయ విశేషాలు… అలాగే అరుణగిరి , గిరి ప్రదక్షిణ సమయంలో చూడవలసిన ప్రదేశాలు, అష్ట లింగాలు వివరాలు …..ఇతర దేవాలయ వివరాలు…. ఈ క్షేత్ర పండుగలు, ఈ క్షేత్ర ఉత్సవాలు, ఈ క్షేత్ర గుడి లోపల చూడవలసిన వివరాలు…. ఈ గిరి మీద చూడవలసిన యోగుల గుహలు…. ఈ గిరి చుట్టూ ఉన్న శివయోగుల ఆశ్రమాలు…. ఊసి లింగ వివరాలు…. మోక్ష ద్వార వివరాలు…. పద్మాకార శివలింగం వివరాలు….. అర్ధనారీశ్వర తత్వ దేవాలయాల వివరాలు… సాధన అనుభవాలు…. ఇలా ఎన్నో, ఎన్నెన్నో వివరాలు ఇందులో ప్రస్తావించడం జరిగింది.
సర్వం అరుణాచల శివమయం
సర్వం అరుణాచల శివార్పణమస్తు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి