అధ్యాయం - 29

 అధ్యాయం -29

గిరి ప్రదక్షిణ మహత్యము

******************************


 


గౌతమ మహర్షి కాస్త…. మహాదేవా ! అరుణాచలేశ్వర…. స్థానేశ్వర…. మూలస్థాన మూర్తి …..పర్వత లింగేశ్వర….. మహాప్రభు!  నా యందు దయ ఉంచి….. నీ పూజా విధానం ఫలితాలు నాకు వివరించి చెప్పినందుకు సదా కృతజ్ఞతుడిని.  కానీ, నీ యందు నా భక్తి నిశ్చలమయ్యే విధంగా నన్ను అనుగ్రహించు స్వామి…. నా యందు అనుగ్రహం  ఉంచి మీ అరుణగిరి  యందు చేసే గిరిప్రదక్షిణ ఫలితం గురించి తెలుసుకోవాలని నా మనసు ఉత్సాహ ఉరకలు వేస్తోంది.  కావున నా యందు దయవుంచి గిరిప్రదక్షిణ ఫలితమును వివరించండి అనగానే…


వత్సా !గౌతమ నీ ఆసక్తిని గమనించాను.  నా యందు నీ భక్తి తత్పరతను గ్రహించాను. నీవు అడిగిన గిరిప్రదక్షిణ మహత్యం గురించి…. నీకు చక్కగా వివరిస్తాను.  శ్రద్దా భక్తులతో ఆలకించు …

గౌతమా ! నేను కాస్త శోణ శైలముగా…. ఈ విశ్వ జగత్తు యందు దివ్య తేజస్సు, కాంతితో ప్రకాశిస్తున్నాను. అలాగే నా చుట్టూ సర్వదేవతలు పర్యవేష్టించి ఉన్నారు . నేను నీకు ఇప్పుడు నా శివ జ్ఞానమును ప్రసాదిస్తున్నాను. ఆకాశము, వాయువు, అగ్ని,జలము, భూమి, సూర్యచంద్రులు పురుషుడు ఇవే నా అష్ట మూర్తి యొక్క తత్వము . వీటిచే ఈ చరాచర విశ్వమంతా వ్యాపించి ఉన్నాను. నేనే కాలస్వరూపుడని…. విషయాలు, విషయార్థాలు….వాటి స్థితిగతులను నిర్ణయిస్తాను నేనే తత్వం ఉన్న జీవుడిగాను… నేనే తత్వ అతీత శివుడి గాను ఉంటున్నాను.  ఉన్నది నేనే .. నేను తప్ప మరొకటి లేదు. ఈ అనంత సచ్చిదానంద సాగరమైన నా యందు…. అలల రూపంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర,  ఆదిపరాశక్తి, ఇంద్రాది దేవతలు లక్ష్మీ సరస్వతీ, పార్వతీ నా  అంశా రూపాలే.  అలాగే క్షమా, శ్రద్ధ ,భక్తి, ప్రజ్ఞా, స్వాహా, స్వదరులు అనేవి నాకు గుణ తత్వాలుగా ఉన్నాయి. నా మహాశక్తి అయిన గౌరీ ఈ మాయా జగత్తును  సృష్టిస్తోంది. నా సృష్టి శక్తి అనంతము.  ఆది ,అంతము లేనిది.  ఈ విశ్వమంతా ఈమె మాయ చేత ఆవరించబడి సర్వవ్యాప్తి అయింది.  ఈ శక్తితో కూడి నేను స్వేచ్ఛగా సర్వ,సృష్టి,స్థితి,లయ, తిరోగమనము, అనుగ్రహము చేస్తూ….. క్రీడిస్తూ నీకు …నేనే ఉన్నాను… నా మోహము తొలగించుకుని…  నా మహిమ గురించి ఎవరైతే విచారణ చేస్తారో… అనగా ఎవరికైతే ….మోహక్షయం అవుతుందో…. వారికి మోక్షం  కలుగుతుందని గ్రహించు. సాగర తరంగం అనేది సాగరం కంటే భిన్నము కాదని గ్రహించిన వాడికే ….. నా మోహమాయ క్షయం అవుతుంది.  అనగా నీవు అలాగే నేను అనేది భిన్నము కాదని….. ఉన్నది నేనే అని….జీవుడు కాదని….. శివుడని…..స్వానుభవంగా గ్రహించినాడే నీ భౌతిక మరణం మోక్షమరణం అవుతుంది.  ఇలాంటి మోక్ష ప్రాప్తి  పొందాలి అంటే…. వాడికి ఉన్న జన్మాంతర జన్మలలో చేసిన సర్వపాపాలు నాశనం కావాలి. దీనికి సూక్ష్మంగా మోక్ష సాధనగా నా గిరి చుట్టూ గిరి ప్రదక్షిణం చేస్తే జన్మాంతర పాపారాశి నాశనం అవుతుంది. 


ఎందుకంటే….. నా ప్రదక్షిణం చేతనే…. కోటి అశ్వ మేధ యాగాలు…. కోటి రాజపేయ యజ్ఞములు…. సర్వతీర్థ స్నాన ఫలితము పొందడం జరుగుతుంది. ప్రదక్షిణ అను పదములో…. ప  అనగా పాపాలు శక్తివంతంగా పోగొట్టితే…. ద అనగా కోరిన కోరికలు తీర్చేది అయితే క్షి అనగా కర్మలు నశింప చేయునది అయితే…. ణ   అనగా ముక్తిని ప్రసాదించేది అన్నమాట!  తద్వారా నాకు ప్రదక్షిణం చేయుట చేతనే సమస్త పాపముల నుంచి విముక్తి పొందుతారు.  ఇది మూడు లోకాలకు ప్రదక్షిణ చేసిన దానితో సమానమని గ్రహించు.  ఇంతటి మహిమాన్విత మహిమ కలిగిన ఈ ప్రదక్షిణాలు చేయువారు….. శుభ్రమైన వస్త్రాలు ధరించి ….. భస్మధారణ చేసి….. నా శివనామస్మరణ చేస్తూ…. అడుగులు వేయాలి.  మొదటి అడుగుతో భూలోకమును…. రెండవ అడుగుతో అంతరిక్షం….. మూడవ అడుగుతో స్వర్గమునందు …ప్రదక్షిణ చేస్తే వచ్చే ఫలితాలు లభిస్తాయి.  అలాగే మొదటి అడుగులో మానసిక పాపాలు…. రెండో అడుగులో వాక్కుతో చేసిన పాపాలు ……మూడవ అడుగులో శారీరక పాపాలు…. ఇలా త్రివిధ పాపాలు సమస్తము నశించును.  అలాగే ఒక ప్రదక్షిణముతో సర్వ పాపాలు నశించును. రెండవ ప్రదక్షిణముతో సర్వ  తపస్సు ఫలము అందించును.  మూడవ ప్రదక్షిణముతో సర్వదేవతల అనుగ్రహము కలుగును. 


నా అరుణగిరికి నమస్కరించి…. ఈ గిరి యందు అగ్నిమయమై…. దీని అంతర్భాగంలో ఉన్న అంతర గుహయందు నేనే సిద్ధ పురుషుడిగా ఉన్నానని భావిస్తూ…. ధ్యానిస్తూ…. చాలా మెల్లగా ప్రదక్షిణం చేయాలి.  అలాగే నా గిరి అనేది స్పటిక స్వరూపము…. ప్రకాశ స్వరూపము అని ధ్యానిస్తూ…. ప్రదక్షిణం చేయాలి. అలాగే నేను కాస్త మనసుకి, వాక్కుకి, అందని వాడనని…. అప్రమేయుడనని … అగ్ని మయమని…. నన్ను చేరుట సాధ్యం కాదని…. ఇలా పర్వతలింగ రూపంలో దర్శనమిస్తున్నానని…. భావిస్తూ ప్రదక్షిణం చేయాలి. నా అష్ట మూర్తి తత్వమే పంచభూతాలు, సూర్యచంద్ర ,పురుషుడు, అయిన నా అష్ట మూర్తి తత్వమే….. నా అష్ట లింగమూర్తుల తత్వం అని……నా గిరికి ప్రతి దిక్కుని స్తుతిస్తూ….. ఎవరి  చేతిని పట్టుకోకుండా…. అతి నెమ్మదిగా అనగా ప్రసవ సమయం సమీపించిన ఒక స్త్రీ మూర్తి ఎలా అయితే నడుస్తుందో…. అలా అనగా ప్రదక్షిణం చేసేవారికి అడుగుల సవ్వడి కూడా వారికి వినిపించకుండా….. ఎవరైతే  ఇలా నన్ను భావిస్తూ…. ధ్యానిస్తూ…. ప్రదక్షిణం పూర్తి చేస్తారో….. వారే నాకు అత్యంత ఇష్టులు.  అలాగే సన్నిహితులు అన్నమాట ! 


ఇలా ప్రదక్షిణం చేసే వారిని సేవించడానికి కోట్లాది దేవ,గంధర్వ,యక్ష,రుద్ర గణాలు అనుక్షణం సిద్ధంగా ఉంటారు.  అలాగే వీరి పరివారము వాహనములు ప్రదక్షిణ చేసే వారి పాదాలను మోయ్యటానికి పోటీ పడుతూ ఉంటాయని గ్రహించు. అలాగే ప్రదక్షిణ దారిలో మన భౌతిక నేత్రాలకి కనిపించని శరీరాలతో…. మునులు , దేవతలు, సిద్ధులు…  ఇతరులు వాయు శరీరాలతో కిక్కిరిసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారని గ్రహించి… గుర్తించి…. వారి దారికి అడ్డం రాకుండా…. మనం ప్రదక్షిణ చేయాలి.  శివనామ సంకీర్తనలు…. శివ నృత్యం చేస్తున్న భక్తులతో కలిసి నడవాలి ….నాయందు దృష్టి నిలిపి వారి మనస్సు యందు నా మహత్యం తలచుకుంటూ…. ముందుకు సాగాలి.  దారిలో అర్హులైన పేదవారికి…. లేదా సాధువులకి తగినంత ధనసహాయం లేదా వస్త్రదానము లేదా అన్నదానము చేయాలి. అలాగే అవసరమైన వారికి విరివిగా సహాయ సహకారాలు అందిస్తూ….. దయతో కూడిన హృదయం కలవారై….. నా భక్తులు ప్రదక్షిణం పూర్తి చేయాలి. ఇలాంటి భక్తుల కోరికలను గిరి చుట్టూ పర్యవేక్షించి…. కంటికి కనిపించని దేవతలు కాస్త వారి మనసులో ఉన్న సమస్త  కోరికలు తీరుస్తారు.  ఇలాంటి గిరిప్రదక్షిణం భక్తుల పాద ధూళి వీరిని అలాగే భూమిని  పవిత్రం చేయడంతో…. వారి మరణానంతరం నా శివ సాయుజ్యం పొందడం జరుగుతుంది.  అలాగే నా ఈ  శోణరూపమునకు ప్రతిరోజు….. ప్రతినిత్యం ప్రదక్షిణం చేసే వారికి….. శాశ్వతంగా నా శివ సాన్నిధ్యం నందు శాశ్వత నివాసం ప్రసాదిస్తాను. 


ఆదివారం నాడు ప్రదక్షిణ చేస్తే సూర్య మండలం దాటించి నా శివలోక ప్రాప్తి పొందుతారు.  సోమవారంనాడు ప్రసాదం ప్రదక్షిణం చేస్తే …..ముసలితనం  వయోవృద్ధ మరణం లేని అజరామత్వం పొందుతారు.  అదే మంగళవారం చేస్తే  సార్వభౌమాదిత్యం పొందుతారు.  బుధవారం చేసే ప్రదక్షిణ యందు సర్వజ్ఞత్వం, మహాపాండిత్య జ్ఞానం లభిస్తుంది. అదే గురువారం చేస్తే సర్వదేవతలు నమస్కరించే లోక గురుత్వ బ్రహ్మ పదవి లభిస్తుంది. అదే శుక్రవారం నాడు చేస్తే సకల సంపదలు, భోగభాగ్యాలు ప్రాప్తితో పాటుగా…. అంతిమంగా విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.  అదే శనివారం నాడు ప్రదక్షిణ చేస్తే గ్రహ పీడ తొలగి సర్వ కార్యాలయందు విజయము…. అలాగే ప్రాప్తి కలుగుతుంది.  అదే నాకు ప్రీతికరమైన పుణ్య తిధులు…. కరణములు…. యోగములు వచ్చిన రోజులలో చేసే ప్రదక్షిణ వలన మీ సర్వ అభీష్టములు తీరతాయి.  సర్వముహూర్తములు, ఘోరాలు, శుభతిధుల యందు చేసే ప్రదక్షిణం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.  ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రదక్షిణము చేస్తే సమస్త దోషాలు నశించిపోవును. ఒక మండలం లేదా అర్థ మండలం నా ప్రదక్షిణలు చేస్తే…. వారి రాజ పదవులు స్థిరత్వం గాని…. శత్రువుల పరాజయం కలిగే విధంగా అనుగ్రహిస్తాను.  విషవత్, సంక్రాంతి, గ్రహణ సమయాలలో గిరిప్రదక్షిణ గావిస్తే రెట్టింపు ఫలితం….. అత్యంత పుణ్య ఫల  ప్రాప్తి కలుగుతుంది. నా జ్యోతిర్మయమైన పర్వతలింగమైన స్థావర లింగమును ప్రదక్షిణం గావిస్తే…. నా సారూప్యము పొందుతారు. 


ఇలా ప్రదక్షిణం చేసేవారికి….. కాలికి గాయం అయితే….. రక్తం చిందితే….మహాలక్ష్మి కాస్త ఒక మానవ స్త్రీ మూర్తిగా వచ్చి…. నిత్యం దేవేంద్రుడు ధరించు మందర పుష్పమాల పొడిచేత రక్తం తుడిచి వేస్తుంది.  అలాగే తన శరీర లేపనమైన కుంకుమతో ఈ కాలినొప్పి తగ్గిస్తుంది. ఇలా కాలికి గాయమైన వారికి….. సర్వ భౌమ పదవి పొంది…. ఎల్లప్పుడూ స్వర్గంలో  ఉన్న మణిపర్వత శిఖరమాలపై విహరిస్తూ….. నందనవనంలో ఉండే  కల్పవృక్షము నీడలో విశ్రమిస్తాడని….. శివ పరమాత్మ చెప్పేసరికి ఇదంతా విన్న గౌతమ మహర్షి కాస్త….. 


స్వామి!  నాయందు దయవుంచి గిరిప్రదక్షిణ ఫలితాలు సవివరంగా తెలియజేశారు. ఇప్పుడు నా యందు అనుగ్రహం నుంచి….  ఇంతటి శక్తివంతమైన గిరి ప్రదక్షిణం  గిరి చుట్టు ఎక్కడ నుంచి ప్రారంభించి ఎక్కడ,  ఎలా ఆపాలో తెలియజేయగలరు అనగానే …..


వత్సా! గౌతమా ! నీవు అడిగిన వివరాలు సవివరంగా నీకు వివరిస్తాను.  సావధానంగా శ్రద్ధ భక్తితో విను.  నా తేజోలింగము మొదట బ్రహ్మ చూశాడు. ఆ తర్వాత విష్ణు చూశాడు.  కాబట్టి నా గిరిప్రదక్షిణ కూడా నా దేవాలయమైన అరుణాచలేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న బ్రహ్మ లింగముతో మొదలుపెట్టి…. విష్ణుమూర్తి అంశ అయిన భూతనాధుడు దగ్గర గిరి ప్రదక్షిణం పూర్తి చేయాలి. నా గిరి చుట్టూ 33 కోట్ల మంది దైవాలు సిద్ధులు, మహర్షులు, కాస్త ధ్యాన తపస్సు చేసిన సిద్ధ ప్రదేశాలు, శక్తి కేంద్రాలు ఉన్నాయని తెలుసుకో!  వీటిని ఒక్కొక్కటిగా దాటుకుంటూ….. నమస్కార భక్తి చేస్తూ… శ్రద్ధ భక్తితో నా గిరిప్రదక్షిణ గావిస్తూ…… ఈయన అనుగ్రహ ఫలమును పొందాల్సి ఉంటుంది. అలాగే మైల రోజులలో…. నెలసరి సమయాలలో…. గిరిప్రదక్షిణ చేయరాదు.  పాదరక్షలు లేకుండా పాదాలతో  చేయాలి. వాహనాలు ఎక్కి చేయరాదు ..  ఎవరిని తాకకుండా…. ఎవరితో మాట్లాడకుండా…. మౌనంగా మనస్సులో నా నామస్మరణ చేస్తూ…. ఈ ప్రదక్షిణం పూర్తి చేయాలి. అప్పుడప్పుడు ఆ గిరివైపు చూస్తూ…. నా అనుగ్రహం పొందుతూ….. మీ కోరిక నివేదిస్తూ నా గిరిప్రదక్షిణ చేయాలి. నీ కోరిక తీరిన యెడల కృతజ్ఞతా భావంతో మళ్ళీ గిరిప్రదక్షిణలు చేయాలి. ఎందుకంటే నాకు గిరిప్రదక్షిణంతోనే నేను కాస్త సంతృప్తి చెందుతాను.  అంతేకానీ మీరు చేసే ధ్యానములతో…. జపములతో…. నా నామస్మరణంతో…. మీ పూజాదికాలతో అంతగా సంతృప్తి చెందను.  అలాగే మీరు చేసే అన్నదానాలు, వస్త్రధానాలు, ఆభరణాలు ,ధనము దానాలు నాకు సంతృప్తిని ఇవ్వవు…. ఇవ్వలేవు.  నాకు ఈ  క్షేత్రము నందు కేవలం గిరిప్రదక్షిణతో మాత్రమే సంతృప్తి చెందుతాను.ఈ ప్రదక్షిణం అనేది…. అహంతో, మదముతో, గర్వముతో ,దర్పముతో ,కాకుండా ప్రేమతో….. ఇష్టంతో…. అనురక్తితో…..సర్వస్య శరణాగతి భావంతో చేస్తే గాని….. నేను సంతృప్తి చెందుతానని తెలుసుకో!  మీరు ఎన్నిసార్లు నాకు  గిరి ప్రదక్షిణం చేశారా అని నేను చూడను.  పట్టించుకోను. ఇందులో ఎంతగా సంతోషంగా, ఆనందంగా, ఇష్టంగా, సంతృప్తితో….. శరణాగతి భావంతో….. మనస్ఫూర్తిగా ఒక ప్రదక్షిణం చేసినను శాశ్వత గిరి ప్రదక్షిణ సంపూర్ణ ఫలితమును అనుగ్రహిస్తానని…. మనసును బట్టి ప్రదక్షిణ ఫలితము ఆధారపడి ఉంటుందని గ్రహించు. మనస్ఫూర్తిగా ఒక ప్రదక్షిణం పూర్తి చేసినను…. కోటి యజ్ఞాల ఫలితములు, నూరు అశ్వ, రాజ సూయ యాగాల ఫలితము అనుగ్రహిస్తాను.  ఇలా నా గిరిప్రదక్షిణం చేయటానికి శరీరం సహకరించని వారికి వయోవృద్ధులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి….. నా అరుణాచలేశ్వర ఆలయం వెనకవైపు ఉన్న స్థూల సూక్ష్మ శివలింగం ఉన్న గుడి చుట్టూ ఒకసారి లేదా మూడుసార్లు ప్రదక్షిణం చేసినను….. మనస్ఫూర్తిగా ఒకసారి గిరి ప్రదక్షిణం పూర్తి చేస్తే….. ఎంత ఫలితం వస్తుందో….. అంతే ఫలితమును ఈ గుడి ప్రదక్షిణం చేసిన వారికి ఖచ్చితంగా నిశ్చయముగా కలుగుతుంది.  నేను అనుగ్రహిస్తాను.   అంతెందుకు నా గిరి ప్రదక్షిణ యందు నేను కాస్త సంతృప్తి చెందడానికి ఉత్తరాయన పుణ్యకాలంలో అనగా మకర సంక్రమణ సమయంలో నేను  కూడా నా అనుచరగణాలతో, గిరి దేవతలతో …మహర్షులతో… సప్త ఋషులతో…. నా స్వరూపమైన ఈ శోణాద్రి గిరిని ప్రదక్షిణం చేస్తాను. అంటే ఈ గిరిప్రదక్షిణానికి నేను ఇచ్చే గౌరవం,మర్యాద, విలువ ఏమిటో…. ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది అని చెప్పడం జరిగింది. 


సూచన:- 

గిరి ప్రదక్షిణం అనేది అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్న బ్రహ్మ లింగముతో మొదలుపెట్టి ….భూతనాథుడి దగ్గర పూర్తి చేస్తే….. వచ్చే 44 శక్తిప్రాంతాలను ఈ ప్రదక్షిణం ఎలా చేయాలో…. ఒక వరుస క్రమంలో మీకు వివరిస్తాను. మొదట  అరుణాచలేశ్వర ఆలయంలోని రెండవ ప్రకారంలో ఉన్న బ్రహ్మ తీర్థం దగ్గరికి చేరాలి. వీలయితే ఈ తీర్థం సేవనం చేయండి.  లేదంటే నమస్కారం చేసుకొని….. ఆ పక్కనే ఉన్న చతుర్ముఖ బ్రహ్మ లింగమును…. మొదట దర్శనం చేసుకుని…. ఆ పక్కనే ఉన్న పెద్దనంది దగ్గరకు వెళ్లి…. అక్కడ మీ కోరిక చెప్పండి. ఈ నంది కాస్త మీ కోరికను ఎదురుగా ఉన్న అరుణాచలేశ్వర స్వామి శివలింగం మూర్తికి నివేదిస్తాడు అన్నమాట!  ఆ తర్వాత ఈ నంది దగ్గర నుండి మీరు కాస్త…. స్వామివారికి నమస్కారం చేసుకొని…. గుడి బయటకు వచ్చి రాజగోపురం కింద ఉన్న శక్తి గణపతిని దర్శించుకుని ……బయటకు వచ్చి గాలి గోపురానికి ఎదురుగా…. ఒక కర్పూర దీపం వెలిగించి…. దానిని జ్యోతిర్లింగంగా భావించి….నమస్కారం చేసి… అక్కడి నుంచి అష్ట లింగాలలో మొదటిదైన ఇంద్ర లింగ దర్శనానికి వెళ్లి దర్శనం చేసుకుని…. అక్కడి నుంచి గిరిప్రదక్షిణ మొదలు పెట్టాలి. అనగా 1.  బ్రహ్మ లింగం, 2.  ఇంద్ర లింగం, 3.  అగ్ని లింగం (అగ్ని తీర్థం),, 4.  శేషాద్రి ఆశ్రమం 5. దక్షిణామూర్తి ఆలయం 6.రమణాశ్రమం 7. వినాయక దేవాలయం 8. ద్రౌపది ఆలయం 9. యమలింగం 10. పృద్వి నంది 11.వదైముడి గణపతి 12) ఋషీ దూర్వాస ఆశ్రమం 13 కట్టు శివాశ్రమం 14. అప్పునంది 15.దేవునంది 16.జ్యోతి (సోనతీర్థం) 17) నైరుతీ లింగం 18. నంది ముఖ దర్శనం 19. వల్లలార్ ఆశ్రమం 20. ఆకాశనంది 21 పళనిగుడి 22.రాజరాజేశ్వరి గుడి 23. సింహనంది( సింహ తీర్థం) 24. కన్నప్ప గుడి 25. గౌతమ మహర్షి ఆశ్రమం 26. సూర్య లింగం( సూర్య తీర్థం) 27. వరుణ లింగం 28.మాణిక్యవాచకార్ ఆశ్రమము 29. ఆది అన్నామలై గుడి 30.వాయు లింగం 31.వాయునది 32.రమణ స్వామి వంతెన 33. చంద్ర లింగం 34.అగస్త్య ఆశ్రమం 35.అధికార నంది 36.కుబేర లింగం 37. మోక్ష ద్వారం (ఇడుక్కి పిళ్ళ యార్) 38.పంచముఖ దర్శనం 39. ఉసి లింగం గుడి 40. పచ్చయమ్మన్ గుడి 41.ఈశాన్య లింగం (యజమాన నంది) 42.షణ్ముఖగుడి 43.దుర్గాలయం ఖడ్గ తీర్థ ం 44. భూతనాథ గుడి.


ఈ శక్తి కేంద్రాలను దర్శించుకుని…. గిరిప్రదక్షిణ పూర్తి చేసుకుని…ఆఖరిగా ఈ భూతనాధుడి గుడికి దగ్గరలో ఉన్న ఈ  ఇరుండి పిళ్ళ యార్ గుడిలోని రెండు గణపతులను దర్శించికుని …..ఆపై అరుణాచలేశ్వర స్వామి శివలింగం మూర్తి దర్శనముతో…..ఆ రోజు చేసిన మీ గిరిప్రదక్షిణ సంపూర్ణము అంటే …..శక్తి గణపతి తో మొదలై ద్వీపద గణపతి దర్శనముతో పూర్తి అవుతుందన్నమాట!  ఒకవేళ ఇలా వీలుపడని వాళ్ళకి…..ఎక్కడైతే ప్రారంభిస్తారో ….ఆ ప్రాంతంలో ఏదైనా గుడి లేదా ఆశ్రమం నుండి ప్రారంభించండి.  మళ్ళీ గిరి ప్రదక్షిణం ఇక్కడికి వస్తే గాని…..పూర్తి చేసినట్లు అవ్వదని గ్రహించండి. 


అలాగే గిరిప్రదక్షిణంలో రానిఆలయాలు కూడా ఉన్నాయి.  వీటిని ఆసక్తి ఉన్నవారు కాలినడకతో లేదా వాహనం ఉపయోగించుకొని దర్శించు కోవచ్చును. వీటిలో ఇంద్ర తీర్థం అనేది …మనకి విష్ణు ప్రతిష్ట చేసిన అరుణగిరి నాథర్ గుడి దగ్గర ఉంటుంది. అలాగే గిరికి వంద మీటర్లు దూరంలో గురు ముహూర్తం అనే ప్రాంతంలో…. మనకి 18 సిద్ధులలో ఒకరైన  సిద్ధుడు సమాధి అలాగే….. తీర్థ కొలను దర్శనమిస్తుంది. అలాగే బస్టాండ్ దగ్గర్లో అతి పురాతనమైన తొండేశ్వర స్వామి ఆలయం ఒకటి ఉంది. అలాగే అగ్ని లింగం దగ్గర అగ్ని తీర్థం దర్శనం చేసుకోండి.ఈ అగ్ని తీర్థం  నుంచి లోపలికి  దాకా 1.5 కిలోమీటర్ల వెళితే…. పాండవుల చేత నిర్మించబడిన పాండవగుడి అలాగే పాండవ తీర్థము దర్శనం వస్తుంది. నైరుతి లింగం దర్శనం అయిన తర్వాత… నేర  శివాలయం, హనుమాన్ మందిరం, ఉన్నామలై గుడి, ఉన్నామలై తీర్ధము, రామలింగేశ్వర గుడి, రాఘవేంద్ర స్వామి గుడి, వీరభద్ర ఆలయము , వేదపరి మండపము అంటే ప్రతిధ్వని మండపం కనబడతాయి.  ఆ తర్వాత మాణిక్య వాచకర్ గారి గుడి సమీపంలో మనకి రెండు కాశీ నందుల గుడి దర్శనమిస్తుంది.  ఇక్కడికి దగ్గరలో రేణుకా మాత ఆలయం దర్శనమిస్తుంది. అలాగే రమణా బ్రిడ్జి దాటిన తర్వాత అక్షరమండపం అనగా వేటపాళ మండపం దర్శనం ఇస్తుంది. ఇకపోతే ఈశాన్య లింగం దగ్గర మనకి ఈశాన్య జ్ఞాన దేశికర్ స్వామి సమాధి ఉన్న ఆశ్రమం దర్శనమిస్తుంది. ఇక్కడ నుండి గిరి అగ్ర భాగం దగ్గరలో తాబేలు తల లాంటి తాబేటిబండ దర్శనం ఇస్తుంది.  ఇకపోతే దుర్గాదేవి ఆలయమునకు ముందే మనకి ప్రవాళ పర్వతం దర్శనమిస్తుంది.  దీనిమీద అర్ధనారీశ్వర గుడి… అలాగే గౌతమ మహర్షి పూజించిన ప్రవాళ శివలింగమూర్తి దర్శనం ఇస్తుంది . అలాగే ఆదికామాక్షి దేవాలయం దర్శనమిస్తుంది. ఇలా వీటిని కూడా గిరి ప్రదక్షిణ సమయంలో మీకు వీలుంటే దర్శించుకోండి.  లేదంటే గిరి ప్రదక్షిణం పూర్తి అయిన  మరుసటి రోజు…. ఇలా గిరి చుట్టుపక్కల ఉన్న ఆశ్రమాలు లేదా ఇతర దేవాలయములు దర్శనం చేసుకోవచ్చును.



నవావింశతిః (29వ) అధ్యాయం సమాప్తం 

శుభం భూయాత్ 

సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి