అధ్యాయం 6

 అధ్యాయం 6 

పాము సజీవ సమాధి దర్శనం 

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°



నాకు ఎప్పుడూ ధ్యానమునందు పదేపదే ఒక తెల్లని సర్పం కాస్త గిరి అగ్రభాగమును చుట్టుకొని ఉన్నట్లుగా కనిపించేది. ఇది చాలా అరుదైన దేవతా సర్పమైన శ్వేతనాగు సర్పమని నాకు అర్థం అయింది.  ఇలా ఎందుకు నాకు ధ్యానమునందు ఈ శ్వేత నాకు దర్శనం అవుతుందో అర్థం కాలేదు.  పైగా పచ్చయ్యన్ అమ్మన్ కాస్త సజీవ మూర్తి గా కనిపించి…. గిరి అగ్రభాగంలో ఉన్న వివిధ రంగులలో ఉన్న దేవత సర్పాలకి పాలుపోసే ధ్యాన దృశ్యం ఇంతకుముందు చాలాసార్లు చూశానని “శక్తి రూపాల నిజరూప దర్శనం” అనే అధ్యాయంలో చెప్పడం జరిగింది కదా !  ఈవిడ  కాస్త పాములకి పాలు పోయటం సత్యమని నిదర్శనంగా 



                                              
                                             చూత గుహ దగ్గర ఉన్న ఈ శ్వేత నాగు సజీవ సమాధి


మనకి గిరి మధ్య భాగంలో ఉన్న చూత గుహ  దగ్గర ఏడు తలలున్న తెల్లని పాము యొక్క శిల మనకి  దర్శనం ఇస్తుంది.  ఇది ఈ పాము యొక్క సజీవ సమాధి అని….ఇక్కడ ఉన్న స్థానిక సాధువులు నాకు చెప్పడం జరిగింది.  అలాగే రాత్రిపూట సమయాలలో ఎన్నో సర్పాలు కాస్తా ఇక్కడికి చేరుకొని అదృశ్యం అవుతాయని…. ఇక్కడ పాముల గుహ ఏదో ఉండి ఉండాలని చెప్పడం జరిగింది. 



నిజానికి ఇక్కడ ఉన్న ఆది శివలింగం ఉన్న గుడిలో ఈ శ్వేత నాగు వచ్చి….. ఈయనకి పడగ పట్టేదని ఇలా 12 సంవత్సరాలు జరిగిందని అనుకోకుండా ఒక రోజు ఈ పాము కాస్త ఈ ప్రాంతము  నందు చచ్చి పడింది అని….దానికి స్మారక చిహ్నముగా ఈ పాము యొక్క పార్థివ దేహమును అక్కడే సమాధి చేసి….. ఏడు తలలున్న తెల్లని పామ విగ్రహం మూర్తిని ప్రతిష్టించడం జరిగిందని చెప్పడం జరిగింది. 



ఈ విగ్రహ మూర్తికి ముందు జంట పాములతో ఉన్న నల్ల శిలమూర్తి….అలాగే గణపతి విగ్రహ మూర్తిని ఉంచడం జరిగింది. ఎవరికైనా సర్ప దోషాలు, సర్ప శాపాలు, రాహు కేతు గ్రహదోషాలు, కుజ గ్రహ దోషాలు ఉంటే…..ఇక్కడ పూజలు చేస్తే ఆ దోషపరిహారం జరుగుతుందని చెప్పడం జరిగింది. నాకు ధ్యానంలో కనిపించే శ్వేత నాగు ఇదేనని నాకు అర్థం అయింది.  కాకపోతే నాకు ధ్యానంలో ఏకతలతో కనపడితే…. ఇక్కడ ఈ సర్పానికి ఏడు తలలు ఉండటం నాకు ఆశ్చర్యం వేసింది.  ఇక్కడ  కూర్చొని ధ్యానం చేస్తే ….ధ్యాన దృశ్యంగా సుమారుగా 30 అడుగుల ఒక శ్వేత పాము ఆదిలింగం ఉన్న గుడికి వచ్చి ఈ శివలింగానికి పడగ  పట్టడం కనిపించింది…. అలాగే ఇది తిరిగి గిరి అగ్ర భాగానికి వెళుతున్నప్పుడు…. ఏకతల కాస్త మూడు తలలుగా ….ఆపై ఐదు తలలుగా… ఆపై ఏడు తలలుగా పాముగా కనపడేది. కానీ గిరి అగ్రభాగం నుండి కిందకి ఈ గుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం అనేక తలలుగా కాస్త ఏకతల సర్పంగా మారి ఈ శివలింగానికి పడగ పట్టి ఎండ నుండి,  వర్షము నుండి రక్షణ ఇచ్చే ధ్యాన దృశ్యం కానవచ్చింది. అలాగే ఈ పాము కాస్త గిరి అగ్ర భాగంలో ఉన్న పాముల గుహ యందు ప్రవేశించే ధ్యాన దృశ్యం కనిపించింది.  అలాగే ఎప్పుడైతే పచ్చయ్యన్ అమ్మన్ వచ్చి పిలవగానే…..ఈ గుహలో ఆవాసముగా ఉండే వివిధ రకాల జాతులున్న అనేక సర్పాలు బయటకు వచ్చి…. ఈమె ఇచ్చే పాలను త్రాగే దృశ్యం చూడడం జరిగింది. అంటే ఈ లెక్కన చూస్తే శ్వేత నాగు ఉండటం….. అలాగే సర్ప గుహ ఉండటం…. మరియు సర్పాలకు పాలు పోయటం అనేవి సత్యాలేనని నాకు ఈ సర్ప జీవ సమాధి చూసిన తర్వాత అర్థమయింది.  మీరు ఎప్పుడైనా అరుణాచల క్షేత్రానికి వస్తే గిరి పైన ఉన్న చూత గుహ దగ్గర ఉన్న ఈ శ్వేత నాగు సజీవ సమాధిని దర్శించుకుని…. మీకున్న సర్ప దోషాలని పరిహారం చేసుకొని …ధన్యులై తరించండి. 


షష్టమ అధ్యాయం సమాప్తం 

శుభం భూయాత్ 

సర్వం అరుణాచల శివార్పణమస్తు 








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి