అధ్యాయం 35
అరుణాచల శివ నామాలు
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
స్వామి! మహాదేవా! అరుణాచల శివ! మీ అనుగ్రహ భాషణం ద్వారా మీ ఆవాసమైన అరుణగిరి క్షేత్ర మహత్యమును సంపూర్ణంగా విన్నాను. నా మనసు శాంతించింది. ఇప్పుడు నేను కాస్త ఈ క్షేత్ర ఆవాసం చేసి… మీకు ఏమి చేయాలో నాకు కర్తవ్య బోధను అంతిమ బోధగా అనుగ్రహిస్తే…. ఈ నా జన్మ తరించిపోతుంది అనగానే…
కుమారా! గౌతమా ! నీ నిస్వార్థ భక్తికి సంతసించాను. నీవు నిత్యం నా సన్నిధిలో నివసిస్తూ….నాకు అన్ని రకాల ఉపచారాలు చేస్తూ…. నన్ను అర్చిస్తూ ….నన్ను ధ్యానిస్తూ…. తపస్సు చేసుకో! సప్త ఋషులు ఎలా అయితే నన్ను అంతరిక్షమునందు ఉన్న నా శివలోకమునందు నిత్యం ఆగమ శాస్త్ర ప్రకారం ఎలా అయితే పూజిస్తారో….అలాగే నువ్వు కూడా ఈ భూలోకంలో ఉన్న నన్ను పూజింపుము. నా ద్వారా విన్న నా ఈ క్షేత్రమైన అరుణాచల క్షేత్ర మహత్యమును సర్వజీవులకి తెలియజేయుము. ఇంతకుముందు నన్ను పూజించిన మహాత్ములందరి కంటే…. నీవే నాకు అత్యంత ప్రీతిపాత్రుడవు….అలాగే అధికుడవి కాబట్టి…. నా శివార్చన విధివిధానము అందరికీ శుభము కలిగించే విధంగా ఏర్పాటు చెయ్యి… అనగానే
స్వామి! పరమేశ్వర! మహాత్మా! శివాత్మ! నిత్యం మానవులు ఏ విధంగా నిన్ను పూజించాలో…. సులభంగా నిన్ను ఏ విధంగా… ఏ నామాలతో… అర్చించాలో… ఈ వివరాలను దేవదేవుడైన నీవు నీ కృపతో నాకు తెలియచేయుము అనగానే…
వత్సా! ఆగమ శాస్రం ప్రకారం… మానవులు చేసే పూజను నేను అనుగ్రహిస్తాను. నాకు వారు సమర్పించే వివిధ సేవలను అంగీకరిస్తాను. నీవు ఆగమములను శ్రద్ధగా పరిశీలించి…. వాటిని అనుసరించి…. నాకు శైవాగమన పూజా విధివిధానం నీవే ఏర్పాటు చేయుము. ఇక్కడ అనేక యాగాలు, యజ్ఞాలు, హోమాలు జరిగే విధంగా చూడు. అలాగే భక్తులు తమ శక్తి కొలది దానాలు ఇచ్చే విధంగా చూడు. నీవు నిత్యం నా ఈ తేజోలింగమును యధావిధిగా పూజింపుము. అలాగే ఈ పావనమైన అరణ్యము మధ్యలో ఉన్న ప్రవాళ పర్వతము పైన ఏకాంత వాసమునకు అలాగే తపస్సుకి అనుకూలమైన ఈ ప్రాంతము నందు….. నువ్వు నా అంశా రూపమైన శివలింగమును ఏర్పాటు చేసుకొని… నీ తపోశక్తిని దానికి ధారపోస్తూ నా అనుగ్రహమును పొందు. మూలస్థానమున అరుణాచలేశ్వర శివలింగమూర్తినీ…..ఉత్తర భాగంలో జగజ్జనని అయిన ఆదిపరాశక్తి, మహాశక్తి అయిన అపితస్థని మాతను ప్రతిష్టించి…. ఆరాధించుము. ఇక జ్ఞానప్రదాయకమైన గొండ్రగొడ్డలి, అలాగే మనసుకి సంకేతమైన జింకని చేతులతో ధరించి ఉన్న ఉమాస్కందేశ్వరుడు దివ్య రూపముతో నన్ను ఆరాధించే విధంగా ఏర్పాటు చేయుము. అలాగే సంపదలకి కారకమైన నా కుమారుడైన బాలగణపతిని నాకు ముందు భాగంలో ఆహార పదార్థాలు స్వీకరిస్తున్నట్లుగా ప్రతిష్టించి పూజింపుము. నృత్యగాన ప్రియుడైన నటరాజమూర్తిని ….అమృతేశ్వరుడిని… నాకు దక్షిణ భాగంలో సప్తమాతృకులను ప్రతిష్టించి… పూజింపుము. నాకు నైరుతి కోణంలో విఘ్నములను నివారించే విజ్ఞనాశకుడైన వినాయకుడిని అలాగే….. శక్తి ఆయుధమును ధరించిన కుమారస్వామిని ప్రతిష్టించి పూజింపుము. నా దేవాలయ దక్షిణ భాగంలో దక్షిణామూర్తిని…. అగ్ని రూపుడైన విష్ణుమూర్తిని…. ఉత్తరంలో బ్రహ్మదేవుడిని….తూర్పు భాగంలో సర్వదేవ గణాలను ప్రతిష్టించి పూజింపుము. అలాగే నా పుత్రులను, నా భక్తులను రక్షించుట కొరకు విచ్చేసిన కాలభైరవుడు అలాగే కాళికాదేవి మూర్తులను ప్రతిష్టించి పూజింపుము. దేవాలయ రక్షణమే వైభవ నాయకులను ప్రతిష్టించి పూజించుము. అలాగే సర్వ అలంకారాలతో ఉన్న నా క్షేత్రపాలకుడైన స్వర్ణ భైరవమూర్తిని ప్రతిష్టించి పూజించుము. ఇలా ఇతర దేవతలను నా ఆలయంలో ఉప ఆలయాలలో…. యధా స్థానంలో స్థాపించి పూజించవలెను. అలాగే ఈ ఊరికి నాలుగు వైపులా నాలుగు శైవ మఠాలు ఏర్పాటు చేసి…. వీటి యందు నా శివ భక్తులు, విరాగులు ,సాధువులు, తపస్సులు, మునీశ్వరులు, మహర్షులు, సిద్దులు, శివయోగులు నా తంత్ర యోగులైన అఘోరాలు ,కాపాలికులు, భైరవులు, నాగసాధువు, బభిక్షకులు మున్నగు సదా నివసించే వారికి….కావలసిన అన్న పానీయాలు ఏర్పాట్లు చేయాలి. వీరందరూ నాకు జరిగే ప్రతీ పూజకు అలాగే…. సేవలకు రక్షకులుగా ఉండే విధంగా ఏర్పాటు చెయ్యి. అలాగే ఈ క్షేత్ర స్థలవృక్షమైన పొగడ చెట్టును సంరక్షించే విధంగా చూసుకో.. ఎందుకంటే సిద్ధరూపముతో ఈ వృక్షము కిందనే ఆవాసం చేసి నేను నిత్య ధ్యాన సమాధి స్థితిలో ఒకప్పుడు ఉండేవాడిని. ఇప్పుడు కాస్త నా శోణ గిరి యొక్క అంతర్గత గుహ యందు ఆవాసం చేస్తున్నాను. కావున పొగడ చెట్టు కింద ప్రార్ధించే భక్తుల యొక్క సమస్త కోరికలను నేను నెరవేరుస్తాను. ఈ చెట్టు కింద చేరి దైవ కార్యాలు జరిగే విధంగా ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఫలాపేక్ష లేకుండా…. నాకు సమర్పించే ధనమునకు అక్షయమైన ఫలితమును అనుగ్రహిస్తాను. ప్రతి మాసములో ఆయా విశేషాలతో కూడిన ఉత్సవాలు…… అలాగే పండుగలు….. నా సమక్షంలో జరిగే విధంగా ఏర్పాటు చేయాలి. అలాగే ప్రతి కార్తీక మాసం నందు కృతిక నక్షత్రము నందు నా గిరి అగ్రభాగములో కార్తీక దీపమైన అరుణ జ్యోతి ప్రజ్వలన జరిగే విధంగా చూడాలి. నా గిరి పరిసరాలలో నిత్యం అన్నదానం జరిగే విధంగా ఏర్పాటు చేయాలి. అలాగే రాత్రివేళల యందు నిత్య దీపారాధన జరిగే విధంగా చూడాలి. నా శివసేవ యందు ఆసక్తి ఉన్నవారిని….. అలాగే నా భజనలు యందు, నా నృత్యముల యందు , నా గీతముల యందు నిపుణులైన వారిని…. నా సేవలకి వినియోగించే విధంగా ఏర్పాట్లు చేయాలి. పవిత్రమైన వారు మానసిక, శారీరక శుద్ధి ఉన్నవారు, సుందరమైన కన్యకలను నా సేవకై వినియోగించే విధంగా ఏర్పాటు చేయాలి. చక్కని ఆచారవంతులు…. పరిశుద్ధమైన మనసు ఉన్నవారు …..మరియు నిష్కామ కర్మతో ఉన్నవారు…. అలాగే నా గురించి శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారు…. నాలుగు వేదాల పరిజ్ఞానం ఉన్నవారు….. మరియు నా ఆగమములు క్షుణ్ణంగా తెలిసినవారు…. అలాగే నా ఉపచార విధివిధానాలు తెలిసిన పండితులని…. నా ఆలయ పూజారులుగా…. నా పూజకై నియమించే విధంగా ఏర్పాట్లు చేయాలి. నిత్యం నా పూజ సేవకై మంగళ వాయిద్యాలు అనగా శంఖము, మృదంగం, డమరుకం వాయిద్యాల జ్ఞానం పూర్తిగా తెలిసిన వారిని వాయిద్య కళాకారులుగా నియమించాలి. ప్రతి పౌర్ణమి తిథి యందు విశేష పూజలు జరిగే విధంగా ఏర్పాటు చేయాలి. నిత్యం నా ఆలయము నందు భక్తి గీతాలాపన లేదా నా నామస్మరణ లేదా నా భజనలు జరిగే విధంగా శివ భక్తులను నియమించాలి. అలాగే నాకు నిత్యం షట్కాల పూజలు జరగాలి. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజ జరగాలి. ఇక నీవు అడిగిన ఈ నా క్షేత్ర శివనామాలు శ్రద్ధగా విను. వీటిని శ్రద్ధతో కంఠస్థం చేసి నన్ను అర్చిస్తే… అన్నీ కోరికలు తీరుస్తాను.
1. ఓం శోణాద్రీశాయనమః
2. ఓం అరుణాద్రీశాయ నమః
3. ఓం దేవాధీశాయ నమః
4. ఓం జనప్రియాయ నమః
5. ఓం ప్రపన్న రక్షకాయ నమః
6.ఓం ధీరాయ నమః
7. ఓం శివాయ నమః
8. ఓం సేవక వర్ధకాయ నమః
9. ఓం అక్షిపేయామృతేశానాయ నమః
10. ఓం స్త్రీ పుంభావప్రదాయకాయ నమః
11. ఓం భక్త విజ్ఞప్తిసమాదాత్రే నమః
12. ఓం దీనబంధు విమోచకాయ నమః
13. ఓం ముఖరాంఘ్రిపతయే నమః
14. ఓం శ్రీమతే నమః
15. ఓం మృడాయ నమః
16. ఓం అషుతోషుడు నమ:
17. ఓం మృగమదేశ్వరాయ నమః
18. ఓం భక్త ప్రేక్షణాకృతే నమః
19. ఓం సాక్షిణే నమః
20. ఓం భక్తదోషనివర్తకాయ నమః
21. ఓం జ్ఞానసంబంధనాథాయ నమః
22.ఓం శ్రీహాలాహలసుందరాయ నమః
23. ఓం ఆహువైశ్వర్యదాతాయ నమః
24. ఓం స్మర్త్యసర్వాఘనాశనాయ నమః
25. ఓం వ్యత్యస్తనృత్యధ్వజధృతే నమః
26. ఓం సకాంతినే నమః
27. ఓం నటనేశ్వరాయ నమః
28. ఓం సామప్రియాయ నమః
29. ఓం కలిధ్వంసినే నమః
30. ఓం వేదమూర్తినే నమః
31. ఓం నిరంజనాయ నమః
32. ఓం జగన్నాథయ నమః
33. ఓం మహాదేవయ నమః
34. ఓం త్రినేత్రే నమః
35.ఓం త్రిపురాంతకాయ నమః
36. ఓం భక్తాపరాధసోఢాయ నమః
37. ఓం యోగీశాయ నమః
38. ఓం భోగనాయకాయ నమః
39. ఓం బాలముర్తయే నమః
40. ఓం క్షమారూపిణే నమః
41. ఓం ధర్మరక్షకాయ నమః
42. ఓం వృషధ్వజాయ నమః
43. ఓం హరాయ నమః
44. ఓం గిరీశ్వరాయ నమః
45. ఓం భర్గాయ నమః
46. ఓం చంద్రరేఖావతంసకాయ నమః
47. ఓం స్మరాంతకాయ నమః
48. ఓం అంధకరిపవే నమః
49. ఓం సిద్ధరాజాయ నమః
50. ఓం దిగంబరాయ నమః
51. ఓం ఆరామప్రియాయ నమః
52. ఓం ఈశానాయ నమః
53. ఓం భస్మ రుద్రాక్షలాంఛనాయ నమః
54. ఓం శ్రీ పతయే నమః
55. ఓం శంకరాయ నమః
56. ఓం స్రష్టాయ నమః
57.. ఓం సర్వ విఘ్నేశ్వరాయ నమః
58. ఓం అనఘాయ నమః
59. ఓం గంగాధరాయ నమః
60. ఓం క్రతుధ్వంసినే నమః
61. ఓం విమలాయ నమః
62. ఓం నాగభూషణాయ నమః
63. ఓం అరుణాయ నమః
64. ఓం బహు రూపాయ నమః
65. ఓం విరూపాక్షాయ నమః
66. ఓం అక్షరాకృతయే నమః
67. ఓం అనాదియే నమః
68. ఓం అంత్య రహితయ నమః
69. ఓం శివ కామాయ నమః
70. ఓం స్వయం ప్రభవే నమః
71. ఓం సచ్చిదానందరూపాయ నమః
72. ఓం సర్వాత్మయ నమః
73. ఓం జీవధారకాయ నమః
74. ఓం స్త్రీ సంగవామభాగాయ నమః
75. ఓం విధయే నమః
76. ఓం విహిత సుందరాయ నమః
77. ఓం జ్ఞానప్రదాయ నమః
78. ఓ ముక్తిదాయ నమః
79. ఓం భక్త వాంఛితదాయకాయ నమః
80. ఓం ఆశ్చర్య వైభవాయ నమః
81. ఓం కామినే నమః
82. ఓం నిరవద్యాయ నమః
83. ఓం నిధి ప్రధాయ నమః
84. ఓం శూలినే నమః
85. ఓం పశుపతయే నమః
86. ఓం శంభవే నమః
87. ఓం స్వయంభువే నమః
88. ఓం గిరీశాయ నమః
89. ఓం అచల స్వరూపాయ నమః
90. ఓం కాల స్వరూపాయ నమః
91. ఓం సర్వపాతక వినాశయ నమః
92. ఓం విశ్వరూపాయ నమః
93. ఓం దివ్య తేజోరూపాయ నమః
94. ఓం పర్వతలింగ రూపాయ నమః
95. ఓం నమస్తామ్రాయ నమః
96. ఓం చారుణాయ నమః
97. ఓం శివాయ పరమాత్మనే నమః
98. ఓం సర్వ వేద స్వరూపాయ నమః
99. ఓం నిత్యాయ నమః
100. ఓం అమృత మూర్తయే నమః
101. ఓం కాలాయ నమః
102. ఓం కరుణార్థ్రా య నమః
103. ఓం దృష్టి పేయామృతాబ్ధయే నమః
104. ఓం భక్తవత్సలాయ నమః
105. ఓం పూర్ణాయ నమ
106. ఓం పుణ్యాయ నమః
107. ఓం పురభేదినే నమః
108. ఓం మూలస్ధానమూర్తియే నమః
ఇవి ఈ క్షేత్ర 108 నామాలు…. ఇవే కాకుండా వేదాలలో అలాగే పురాణ ఇతిహాసాల యందు చెప్పబడిన ఇతర నామములను కూడా స్మరిస్తూ నన్ను పూజించవచ్చు. ఇలా ఈ అతిముఖ్యమైన ఈ క్షేత్ర నామాలతో చక్కగా నన్ను అర్చించిన వారికి అన్ని అపరాధములను… నేను తక్షణమే క్షమిస్తాను. వారు ఎంతటి దుష్టులైనను… లేదా పాపాత్ములైనను…. నా భక్తులుగా మారుస్తాను. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఇది నిశ్చయము. ఈ నామాలతో నన్ను నా సన్నిధిలో ఉండి చేసే పూజలు లేదా వేరే దూరప్రాంతాల యందు పూజించు వారి పూజలు…. శీఘ్రముగా నేను అంగీకరించి…. స్వీకరించి…. వారి సర్వ అభీష్టములు నెరవేరుస్తాను. ఇలాంటి వారికి మోక్షము కావాలన్నా నిశ్చయముగా పొందటం జరుగుతుంది. నా నిత్య పూజ లేదా నా నిత్య నామస్మరణ ఎక్కడ చేసినను….. నాకు కావలసింది అనురక్తితో….. నిష్కామ భక్తితో….నిస్వార్థం మధుర భక్తితో…..నా యందు శ్రద్ధ భక్తితో…. మనస్సు, బుద్ధి, ఆత్మ నివేదన భక్తితో కొలిచే వారిని …..ఎక్కడ ఉన్నా కూడా వారి పూజలు అంగీకరించి వారి అభీష్టాలు తక్షణమే తీరే విధంగా అనుగ్రహిస్తాను.
కొంతకాలమునకు నా అర్ధాంగి అయిన పార్వతి దేవి ఇక్కడికి త్వరలో చేరుకుంటుంది. అప్పుడు ఆమె నన్ను దర్శించి నాలో ఐక్యమై నా శరీరమునందు అర్థ భాగమును పొంది…. అర్ధనారీశ్వర తత్వముతో ఈ క్షేత్రం నందు అపీతకుచాంబిక అంటే (త్రాగబడని స్తనములు) గలది…. అనే నామముతో ప్రసిద్ధి చెంది…. ఉత్తరాయన పుణ్యకాలంలో నన్ను పూజించే దేవతలు, మహర్షులు, సిద్ధులు, భక్తులు, యక్షులు, రాక్షసులు, రుద్రగణాలు, భూతాలు, పిశాచులు ఇలా మున్నగు వారందరిని ఈమె ఆశీర్వదించి అనుగ్రహిస్తుంది. ఈమె అనుగ్రహం వలన వీరికి ఉన్న సమస్త పాపాలు లేదా దోషాలు నశించిపోతాయి కాబట్టి…. నేను చెప్పిన విధంగా ఈ నా క్షేత్రంలో ఏర్పాట్లు గావించి పూజించుము అని ఆజ్ఞాపించగానే…
గౌతమ మహర్షి కాస్త అమిత ఆనందభరితుడై స్వామి మహాదేవా ! మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. మీరు చెప్పిన విధంగా ఈ క్షేత్రం నందు ఏర్పాటుచేసి మీరు చెప్పిన 108 నామాలతో పూజ ,అర్చనలు జరిగే విధంగా చూస్తాను. నేను ఈ అరుణాద్రిని విడువక…..ఇక్కడ ఆవాసం చేస్తూ….. అమ్మ ఆగమనము కోసం నిరీక్షిస్తూ ఉంటాను…. అనగానే తధాస్తు! సర్వ అభీష్టాలు నెరవేరుగాక! అంటూ దీవిస్తూ…. ఆశీర్వాదం చేస్తూ…. అరుణాచలేశ్వర స్వామి అంతర్ధానం అయ్యారు.
పఞ్చత్రింశత్(35వ) అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్
సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి