అధ్యాయం- 36

 అధ్యాయం- 36

అమ్మవారి ఆవిర్భావం 

▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️



బ్రహ్మకుమారుడైన దక్షుడు శివతపస్సు చేసి…. శివ సాక్షాత్కారం పొంది…. స్వామి!  మీ శక్తి సామర్థ్యాలతో తులతూగే శక్తి ఉన్న కూతురిని నాకు వరంగా ఇచ్చి నీకు మామ అయ్యే వరమును ప్రసాదించమని కోరగా…. అందుకు మహాదేవుడు కాస్త తధాస్తు!  అని దీవించి…. అంతర్దానం అయ్యాడు.  కొన్ని రోజుల తర్వాత దక్షుడికి శివ వర ప్రభావం చేత… దాక్షాయిణిగా శివాంశ ఆదిపరాశక్తి కూతురిగా పుట్టింది.  ఒకనాడు దక్షుడు కాస్త శివ సభకి వెళితే…. అందరూ దేవతలు ఈయనని చూచి నిలబడితే…. శివుడు లేవలేదు.  దానితో దక్షుడికి శివుడులేచి మర్యాద చేయలేదని…. కోపావేశాలకి గురి అయ్యి శివుడిని నానా మాటలతో దూషించి…. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దక్షుడు కాస్త ఒక యజ్ఞము చెయ్యదలచి దేవతలందరికి ఆహ్వానమును పంపిస్తాడు.  కానీ శివుడికి పంపించడు.  కానీ శివుడు ఇది విని  మౌనం వహిస్తాడు.  ఈ దక్ష  యజ్ఞానికి దేవతలు, కిన్నెరలు, గంధర్వులు యక్షులు, నాగులు, సిద్దులు ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, సప్త ఋషులు, విష్ణువు ,లక్ష్మీదేవి అలాగే బ్రహ్మా, సరస్వతి, మునులు, మునిపత్నులు, అష్టదిక్పాలకులు వెళతారు.  ఈ విషయం తెలుసుకున్న దాక్షాయిణి కాస్త శివుడు చెంతకు చేరి…..స్వామి!  నా తండ్రియగు మీ మామయ్య అయిన దక్షుడు ఒక యజ్ఞమును చేస్తున్నాడని విన్నాను.  దీనిని చూచుటకు పోవాలని నాకు కోరిక కలుగుతుంది.  అందుకు తమరు నాకు అనుమతి ఇవ్వండి అనగానే …..దానికి శివుడు కాస్త దేవి!  పిలువని పేరంటానికి వెళ్లరాదని శాస్త్ర వచనం ఉన్నది కదా!  దక్షుడు నీ తండ్రియే కావచ్చును…. నన్ను  సభ యందు అవమానించాడు కదా!  ఆ విషయం నీకు తెలుసు కదా!  పైగా కానీ దక్షుడు నుండి మనకి రమ్మని ఎలాంటి ఆహ్వానము రాలేదు.  మరి నువ్వు ఎలా అక్కడికి వెళతావు? అనేసరికి….. దాక్షాయిణి కాస్త స్వామి!  అయినా నా కన్నతండ్రి కదా…. మరి కూతురికి అలాగే తండ్రికి మధ్య ఆహ్వానాలు, పిలుపులు అవసరమా!  రక్తసంబంధం కాబట్టి…. ఆయన మనల్ని పిలిచి ఉండడు.  నాకోసం మా తండ్రి యొక్క తప్పును ఈసారి మన్నించి….నన్ను ఈ యజ్ఞానికి వెళ్లడానికి అనుమతి ఇవ్వండి అనగానే…. దానికి శివుడు కాస్త దేవి!  ఆడవాళ్ళకి పుట్టింటి మీద ఉన్న మమకారాలు మెట్టింటి మీద ఉండవు కదా. నీ మాటే నెగ్గాలి కదా!  అంతా తెలిసినా కూడా నీవు వెళతాను అంటే  నీ ఇష్ట ప్రకారమే  పోయిరా …..అనగానే దాక్షాయిణి కాస్త అమితానందంతో…. ఈ దక్ష యజ్ఞానికి వెళుతుంది.కానీ తీరా అక్కడికి వెళ్లేసరికి….. దక్షుడు కాస్త దాక్షాయిణిని చూసి ప్రేమగా పలకరించకపోగా…. కోపావేశానికి గురై…. నిన్ను ఇక్కడికి రమ్మని ఎవరు పిలిచారు.  పిలవకుండా ఎలా వచ్చావు?  అని అందరి ముందు నిలదీసి అడిగేసరికి… దానితో ఈ అవమాన భారం భరించలేని దాక్షాయిణి కోపంగా చూస్తూ …..నా భర్త లేకుండా ఈ యాగం  చేస్తున్నావు…ఈ యాగం తక్షణమే నశించునని శపించి…. యాగాగ్నిలో దూకి తన దేహము విడిచింది. 


ఈ విషయం శివుడికి తెలిసి…. దక్షుని మీద ….అలాగే దక్షయజ్ఞం మీద…. అక్కడ ఉన్న దేవతల మీద… కోపవేశాలు కలగగానే ….తన జటాజూటం నుంచి జటను తీసి నేలకేసి కొట్టగా….దాని నుండి అతి వీరభయంకరంగా వీరభద్రుడు ఉద్భవించెను.  అప్పుడు ఇతను కాస్త తండ్రి!  నా ఉద్భవమునకు గల కారణం ఏమిటి?  మీ ఆజ్ఞ ఏమిటో సెలవిస్తే పాటిస్తాను అనగానే…. ఓ వీరభద్ర ! నాకు ఆహ్వానం లేకుండా దక్షుడు ఒక యజ్ఞమును చేశాడు.  అందుకు నా సతి దేవి కాస్త వెళ్లి ఆ యజ్ఞగుండము నందు దూకి ఆహుతురాలు అయ్యింది. నీవు తక్షణమే ఆ యాగశాలకు వెళ్లి…. ఆ యాగమును నాశనం చేసి…. అక్కడ ఉన్న సమస్త దేవతలకు బుద్ధి చెప్పి రా!  అని ఆజ్ఞాపించగానే….. సరే స్వామి!  మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను అంటూ…. వీరభద్రుడు కాస్త తన భూత బేతాళ గణాలను  వెంటపెట్టుకొని…. దక్షుడు యొక్క యాగశాలను  ధ్వంసం చేయడానికి బయలుదేరాడు. వీరభద్రుడు కాస్తా అనంత, వాసుకి ,తక్షక, కర్కోటక,పద్మ, మహా పద్మ ,శంకపాల, గుళిక అను ఎనిమిది రకాల సర్పరాజులను తన మెడలో సర్పమాలగా ధరించి….ఐరావతి, పుండరీకా, వామన, కుముదాండ, ధాన్జన, పుష్పదంతా, సార్వభౌమ, సుప్రతి, పంబు అనే ఎనిమిది కణ భూషణములు ధరించి భూతర మణిమణులను చామరాలుగా వేస్తూ ఉండగా…. దిశ వల్లభు ఊరేగింపు చెయ్యి రధమును ఎక్కి… దక్షయాగశాలకి బయలుదేరాడు. ఈ రథానికి వెయ్యి ఏనుగులు కట్టారు.  పిశాచులు కాస్త శంఖారావాలు చేస్తున్నాయి.  ఈ గణాలలో కొందరు జింక వాహనాలుగా…. మరికొందరు దున్నపోతులుగా… మరికొందరు ఏనుగు, తేలు, గుర్రాలు, మనుష్య రూపాలను వాహనాలుగా… చేసుకొని యుద్ధానికి బయలుదేరారు. లవణం అంటే ఉప్పు…. ఇచ్చు అనగా చెరుకు రసం …..సర్పి అనగా నెయ్యి, దధి అనగా పెరుగు, క్షీర అనగా పాలు, నీడ అనగా మంచినీళ్లు, సుర అనగా కల్లు… ఇలా. ఈ  సప్త  సముద్రాలు దాటుకొని దక్షుడు చేసే యజ్ఞశాల కోసం సమస్త విశ్వ జగత్తును జల్లెడ పట్టడం ఆరంభించారు.  సప్త మేఘాలను కాస్త ఈయన భూత గణాలు పట్టుకొని…. తమ జడలలో పెట్టుకున్నాయి.  సప్త సముద్రాలలో ఒక సముద్రమైన సురాపానమును ఈ పిశాచాలు విపరీతంగా త్రాగి గంతులు వేస్తూ ఉంటే ….మరికొన్ని సచిత్ర విచిత్రమైన వాయిద్యాలను విపరీతంగా మోగిస్తూ ఆనంద నృత్యాలు చేస్తూ చివరికి దక్షయాగశాలకి చేరుకోవటం జరిగింది. 


వీరిని చూసిన అష్టదిక్పాలకులైన ఇంద్రుడు,అగ్ని ,యముడు, నైరుతి ,వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అనే వీళ్ళు కాస్త తమ వాహనాలను రధాలు ఎక్కి…. వజ్రాయుధం , కుంతము ,పాశం, ఖడ్గం మొదలైన ఆయుధాలతో వీరభద్రుడి సైన్యమైన భూత గణాల మీదకి ప్రయోగించారు.  అంతట వీరభద్రుడు కాస్త… వీరి మీదకి అష్ట బాణాలు వేయగానే….ఈ బాణాల దాటికి ఇంద్రుడు కాస్త తన వాహనమైన ఐరావతమును వదిలి పారిపోవటంతో…. ఇతరులు చేసేది ఏమీ లేక సిగ్గుతో తలవంచుకొని ఓటమి అంగీకరించారు. యముడైతే వనకడం ఆరంభించాడు. అగ్ని దేవుడి చేతులు నరికి వేశాడు. సూర్యుడు యొక్క దంతాలు రాలగొట్టాడు… చంద్రుడు కాస్త పారిపోతూ ఉంటే… వాడిని పట్టుకొని అక్కడే ఉన్న హోమాగ్ని వేడిమి దగ్గర ఉంచేసరికి…. ఈ వేడికి చంద్రుడు కాస్త తట్టుకోలేక… కాంతిహీనుడై వెన్నలాగా కరిగిపోతూ అదృశ్యం అయ్యాడు.  ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న బ్రహ్మ దేవుడికి కోపావేశం కలిగి…. వీరభద్రుడు మీదకి రాగా… వీరభద్రుడు కాస్త బ్రహ్మకి ఉన్న నాలుగు తలలు, అలాగే చేతులు నరికివేసి చంపడం జరిగింది.  అలాగే ఈయన భార్య అయిన సరస్వతి దేవి యొక్క నాలుకని… వీరభద్రుడు కొయ్యడం జరిగింది. దానితో శ్రీ మహా విష్ణువు కాస్త గరుడవాహనము ఎక్కి కోపావేశంతో ఉన్న వీరభద్రుడు మీదకి వచ్చి రాగానే…. బాణాల వర్షం కురిపిస్తే…. దానికి  వీరభద్రుడు కాస్త ఆనంద కేళి చేస్తూ…. ఈ బాణాలను నాశనం చేయడంతో ….విష్ణువు కాస్త తన చేతిలోని ఖడ్గమును విసరగా…. పరాక్రమవంతుడైన వీరభద్రుడు కాస్త ….దీనిని ఒడిసిపట్టుకుని తునాతునకలు చేయడంతో… ఇక చేసేది ఏమీ లేక…. శివుడు ప్రసాదించిన సుదర్శన చక్రమును వీరభద్రుడి మీదకు తన ఆఖరి ఆయుధంగా విష్ణు ప్రయోగించగా…. ఈ సుదర్శన చక్రం కాస్త వీరభద్రుడి పాదాల దగ్గరికి వచ్చి పూజించేసరికి …..అప్పుడు కానీ విషయం విష్ణువుకి అర్థమై…. వచ్చింది సాక్షాత్తు శివ అంశ అని గ్రహించినవాడై…. వరాహరూపమును ,సింహ రూపమును ఎత్తి యుద్ధం చేసినను…. వీరభద్రుని దాటికి తట్టుకోలేక…. చివరికి చేప రూపము ఎత్తి విష్ణు కాస్త సముద్రం అడుగుకు చేరి ప్రాణాలు కాపాడుకున్నాడు. అలాగే అక్కడే ఉన్న విష్ణువు సతి అయిన మహాలక్ష్మి యొక్క ముక్కుని వీరభద్రుడు కోసేసరికి…. ఈమె కాస్త అక్కడి నుంచి అదృశ్యం అయింది.  ఇలా దేవతలు, ఋషులు, అష్టదిక్పాలకులు, బ్రహ్మా, సరస్వతి మున్నగు వారంతా…. కూడా ప్రాణాలు పోగొట్టుకొని  శవాలై….విగత జీవులుగా అవ్వటం చూసిన యాగ కర్త అయిన దక్షుడు కాస్త…..కోపావేశంతో వీరభద్రుడు మీదకు రాగానే….. తన దగ్గర ఉన్న ఖడ్గంతో ఒక్క వేటుతో ఇతని తలను నరికి హోమాగ్నిలో పడవేయడంతో దక్షుడు భార్య కాస్త ఇతని మీదకు రాగానే…. ఈమె చెవులను కొరికివెయ్యగానే…. ఈమె కాస్త భయభ్రాంతులై యాగశాలను వదిలిపెట్టగానే….. ఇలా ఈ యాగానికి వచ్చిన వారందరూ కూడా… వీరభద్రునికి అలాగే ఈయన గణాలైన  భూతాలకి ఆహారమై… యాగశాల కాస్త ఆహారశాలగా మారడం జరిగింది. దానితో వీరభద్రుడు కాస్త కైలాసమునకు వెళ్లి….. శివుడికి నమస్కారాలు చేసి…. జరిగిన విషయమును చెప్పేసరికి…. అప్పటిదాకా విపరీతమైన కోపావేశం ఉన్న శివుడు కాస్త…. శాంత స్వరూపుడు అయ్యి….దక్షయాగశాలకు వచ్చి…. చచ్చిన దేవతలను, మహర్షులను, ఇతరులను తిరిగి బ్రతికించి… దక్షుని  తలకు బదులుగా మేక తలను అమర్చి… బ్రతికించి…. వారి వారి పదవులను  చేసుకోమని…. బ్రహ్మ,సరస్వతి… విష్ణువు, లక్ష్మీ దగ్గరికి వెళ్లి అరుణాచల క్షేత్రం మహత్యం వారికి వివరించి…. అక్కడికి వెళ్లి ఆరాధన చేస్తే ….పోయిన అంగాలు తిరిగి వస్తాయని… అలాగే కోల్పోయిన పదవులు తిరిగి పొందడం జరుగుతుంది అని వారికి చెప్పి…. చచ్చి పడిపోయి ఉన్న సతీదేవి అయిన దాక్షాయిణి దేహమును తన భుజాన వేసుకొని…. సతి విరహవేదన భరించలేక…… పిచ్చివాడిగా…భైరాగిగా,స్మశానవాసిగా, శివుడు మారేసరికి…. విష్ణువు కాస్త తన సుదర్శన చక్ర ఆయుధముతో…. సతీదేవి దేహమును 18 భాగాలుగా ఖండించి…. వాటిని అష్టాదశ శక్తి కేంద్రాలుగా మార్చాడు.  దానితో శంకరుడు కాస్త తన భార్య అయిన దాక్షాయిణి జ్ఞాపకాలను మర్చిపోవటానికి…. కైలాసమునకు వెళ్ళి అక్కడ స్థానువై ధ్యాన సమాధిలో ఉండిపోయాడు. 


షట్ త్రింశత్(36వ )అధ్యాయం సమాప్తం

శుభం భూయాత్ 

సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి