అధ్యాయం - 30

 అధ్యాయం - 30

గిరి ప్రదక్షిణ అనుగ్రహ ఫలితము

▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️



గౌతమ మహర్షి కాస్త స్వామి!  అరుణాచలేశ్వర…. మహాదేవా ! నాయందు దయ ఉండటం వలన నీకు అత్యంత సంతృప్తిని ఇచ్చే గిరిప్రదక్షిణం గురించి తెలుసుకున్నాను.  ఇప్పుడు మేము చేసే ఈ గిరిప్రదక్షిణానికి సంతృప్తి చెంది…. మమ్ములను ఏ విధంగా అనుగ్రహిస్తారో…. ఎలా అనుగ్రహించావో ….నీ ద్వారా తెలుసుకోవాలని నా మనసు ఉరకలు వేస్తుంది. నా యందు నీ అనుగ్రహం నుంచి…. ఈ నా ప్రశ్నకి సమాధానంగా నీ అనుగ్రహ భాషణమును అనుగ్రహించు స్వామి…..అనగానే 


వత్సా ! గౌతమా ! నీ  జ్ఞానాసక్తికి సంతోషించాను. ఇప్పటిదాకా గిరి ప్రదక్షిణం గురించి తెలుసుకున్నావు.  ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణం చేసిన వారిని నేను ఎలా అనుగ్రహించానో….. వివరంగా చెబుతాను.  శ్రద్ధ భక్తితో సావధానముగా విను… 


ఈ గిరి ప్రదక్షణ ఫలితములు నా కుమారులైన గణపతికి అలాగే కుమారస్వామిని ఎలా అనుగ్రహించానో….. వివరంగా చెబుతాను.  ఒకసారి మేమంతా కైలాసమునందు సభా భవనంలో ఉండగా….. నా దగ్గరికి నందనవన అధిదేవత ఒక కర్మఫలమును తీసుకుని వచ్చింది. దీనిని చూసిన మా పిల్లలు మాకిమ్మని కోరగా…..  మీలో ఎవరైతే… ముందుగా లోకాలోక పర్వతం చుట్టూపడిన  భూలోకమును చుట్టి వస్తారో….. వారికి ఈ ఫలం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పగానే…..కుమారస్వామి కాస్త తన వాహనమైన నెమలి ఎక్కి  భూప్రదక్షిణం కోసం బయలుదేరితే…. గణపతి మాత్రం తన ఎలుక వాహనం ఎక్కి అతని భారీ ఆకారముతో….. భూ ప్రదక్షిణం చేయటం చాలా కష్టమని గ్రహించి….. సూక్ష్మములో మోక్షంగా శోణాకృతి ….శైలాకృతిగా ధరించి ఉన్నానని సూక్ష్మమును గ్రహించి….. అక్కడే ఉండి నా చుట్టూ ఒక  ప్రదక్షిణం చేయగానే….. భూ ప్రదక్షిణ ఫలితం పొందడంతో….. నేను  సంతసించి గణపతికి ఈ కర్మఫలమును ఇచ్చి….. నేటి నుండి సకల కర్మ ఫలాలకి గణపతియే అది దేవుడని సభాముఖంగా ప్రకటించే సమయానికి….. కుమారస్వామి కాస్త భూ ప్రదక్షిణ గావించుకొని….. గణపతికి చేసిన పని తెలుసుకొని….. తనకి కర్మఫలం దక్కలేదని…. మా అందరి మీద అలిగి వాడు కాస్త పళని క్షేత్రానికి  చేరుకోవటం జరిగింది. వీడి అలక తీర్చడానికి నేను కాస్త వాడికి నా మోక్షజ్ఞాన ఫలమును…. ఈ క్షేత్రంనందు ఇవ్వడంతో…. వాడికి అలకతీరింది.  అందుకే ఈ క్షేత్రమును పళని అని నామకరణ ఖ్యాతి పొందింది. ఆరోజు పౌర్ణమి కావడంతో…. వీడిని తీసుకొని మేమంతా అరుణగిరి క్షేత్రానికి తిరిగి రావడంతో….. ఆనాటి నుండి ఈ గిరి క్షేత్రమునందు పౌర్ణమి నాడు చేసే గిరిప్రదక్షిణమునకు అత్యంత రెట్టింపు ఫలితం అనుగ్రహించబడింది.


అలాగే పూర్వము…… నిజానికి ఆదిలో 33 మంది దేవతలు అనగా 11 ఏకాదశ రుద్రులు…. 8 మనవులు….. 12 ఆదిత్యులు…. ఇద్దరు అశ్విని వైద్య దేవతలు…. ఇలా ఈ 33 మంది కలసి ఒకసారి గిరిప్రదక్షిణం చేయగానే….. ఒక్కొక్కరు ఒక్కొక్క కోటితో దేవతా శరీరాలు పొంది…. 33 మంది కాస్త 33 కోట్ల దేవతలు అయ్యారు. సూర్యుడు,చంద్రుడు ఇలా నవగ్రహ దేవతలు కాస్త భూమికి అధిపతులు అయ్యారు.లోక పాలకులు, అష్టదిక్పాలకులు,  కారణేశ్వరులు నాకు ఈ గిరి యందు ప్రదక్షిణం గావించి వారి పదవులను సుస్థిరంగా చేసుకున్నారు.


పూర్వం ధర్మకేతువు అనే  రాజు కాస్త యమలోకము నుంచి వచ్చి….. గుర్రం ఎక్కి నా క్షేత్రమునందు గిరిప్రదక్షిణ చేశారు.  కానీ ఈ ప్రదక్షిణ పూర్తి అయిన తర్వాత….. ఇతని గుర్రము కాస్త మరణించి గణనాథ రూపము పొంది….. శివలోకమునకు వెళ్లేసరికి….. ఈ రాజు కాస్త నేల మీద పడిపోయి తెలివి తెచ్చుకొని ……తను చేసిన తప్పును అదే గుర్రం ఎక్కి ప్రదక్షిణం అనగా…. వాహనాలు ఎక్కి చేయరాదని గ్రహించి….. దానితో పాదాచారిగా గిరిప్రదక్షిణం పూర్తి చేయగానే….. ఇతను కూడా గణనాథ రూపం పొంది….. శాశ్వత నా శివలోక ప్రాప్తి పొందడం జరిగింది. అలాగే పుణ్యం క్షీణించబడిన ఒక సిద్ధుడు కాస్త…. స్వర్గం నుండి భూమిపై ఉన్న ఈ క్షేత్రమునందు పడిపోగా…. ఇతడు కాస్త గిరి  ప్రదక్షిణం గావించగానే…. తిరిగి వాడి అభీష్టము ప్రకారంగా శాశ్వతమగు స్వర్గలోక ప్రాప్తి పొందడం జరిగింది.


ఒకసారి దేవ జాతికి చెందిన ఇద్దరు విద్యాధరులు కాస్త హిమాచలము పైన ఉన్న దుర్వాస మహర్షి ఆశ్రమానికి వెళ్లడం జరిగింది. ఇక్కడ సుందరమైన ఉద్యానవనం చూసి వీరిద్దరూ కాంతిశాలి అనేవాడు కాస్త…. ఈ సుగంధ పువ్వుల మొక్కలను…. కాళ్ళతో తొక్కుతూ నాశనం చేస్తూ ఉంటే….. కళాధరుడు కాస్త ఈ సుగంధ పువ్వులను కోస్తూ…. ఆనంద పడసాగారు.   అక్కడ ఉన్న శాండిల్య వృక్షం కింద పులిచర్మంపై తపస్సు చేసుకుంటున్న దూర్వాసమునికి ధ్యాన భంగమై కళ్ళు తెరిచి….. ఉగ్రమైన కోపంతో వీరిద్దరికేసి చూస్తూ ఎవర్రా మీరు? ఏమీ ఈ దురాచారం….. దురహంకారులై నా కోపాగ్నికి బలి అవ్వాలని ఇలా ప్రవర్తించారు.  ఈ వనము  అలాగే ఈ భూమి అనేది శివ  తపో భూమి …..అలాగే శివ పూజకై పోషించబడుతున్నది. అలాంటి పవిత్రమైన ఈ తపో భూమియందు మీరిద్దరూ జంతువుల వలె ప్రవర్తించారు కాబట్టి ……..భూలోకంలో మీరిద్దరూ కూడా జంతువులుగా జన్మించండి అంటూ కాంతిశాలి, కేసి చూస్తూ నువ్వు నీ కాళ్ళతో ఈ వనములు నాశనం చేశావు కాబట్టి!  నువ్వు ఇతరులకి వాహనంగా ఉపయోగించబడే గుర్రముగా జన్మించమని….. ఆ తర్వాత కళాధరుడు కేసి చూస్తూ ఈ వనములోని సుగంధ పువ్వులను ఇష్టం వచ్చినట్లుగా కోసి ఆనందించావు కదా!  ఈ పువ్వులను సుగంధ సువాసనకి ఎలా మోహితుడవై ఈ పని చేశావో అలా నీ నుండి  వెలువడే సువాసన వచ్చే….. మోహించబడే….. కస్తూరి మృగముగా మారమని వీళ్ళిద్దరికీ శాపాలు ఇవ్వగానే….. దానితో వీరిద్దరికీ తాము చేసిన అపరాధం  అర్థం అయ్యి ….. క్షమించి తమకి శాప విముక్తి మార్గమును ఉపదేశించమని దుర్వాస ముని అడగగా…. ఆయన కాస్త దయార్థ హృదయుడై నాయనలారా!  శాపకర్మను అనుభవించక తప్పదు.  కాకపోతే మీరిద్దరూ కాస్త ఎప్పుడైతే అరుణాచల క్షేత్రంలో ఉన్న అరుణగిరిని చేరుకొని…. దానికి గిరిప్రదక్షిణం పూర్తి చేస్తారో…. ఆ క్షణమే ఈ జంతు జన్మల నుంచి విముక్తి పొంది…. యదార్ధ రూపాలు పొంది…. భూలోకము నుండి మీ దేవతాలోక ప్రాప్తి పొందుతారని చెప్పడం జరిగింది. అలా వీళ్ళిద్దరూ కాస్త ద్రవిడ దేశమును పరిపాలించే  వజ్రాంగదుడు అనే రాజుకి…..కాంతి శాలి కాస్త రాజ్య  అశ్వముగా మారాడు.  అలాగే కళాధరుడు కాస్త నా అరుణిగిరి మీద కస్తూరి మృగంగా మారి సంచారం చేయసాగాడు.  అనుకోకుండా….. ఒకరోజు  ఈ రాజు కాస్త అరుణాచల క్షేత్రానికి వచ్చి….. ఈ కస్తూరి మృగ సువాసనకి ఆకర్షితుడై…. దీనిని సంహరించడానికి వేటాడీ ….ఇది కాస్త ఇతనికి దొరకకుండా….. గిరి చుట్టూ తిరుగుతూ…గిరి ప్రదక్షిణం పూర్తి చేస్తే…. రాజు కూడా తన అశ్వము ఎక్కి దీనిని వేటాడే పనిలో గిరిప్రదక్షిణం పూర్తి చేయడం జరిగింది. ఇలా ఏకకాలంలో కస్తూరి మృగం అలాగే గుర్రము కాస్త గిరిప్రదక్షిణం పూర్తి చేయటం…..ఈ రెండు జంతువులు కాస్త చచ్చిపోయి…. వాటి స్థానంలో దివ్య తేజ శరీరాలతో  విద్యాధరులుగా మారి ఆ రాజుకి జరిగిన విషయం చెప్పి….. జంతు రూపాలు విడిచి వారి స్వస్వరూపాలతో భూలోకము నుండి దేవతాలోక ప్రాప్తి పొందటము జరిగింది.


పూర్వం అగ్నధృడు అనే రాజు జంబు దీపాన్ని పరిపాలించాడు.  ఈయనకి 9 మంది సంతానం ఉండేది. ఇందులో పెద్ద కుమారుడైన నాభి అనే వాడికి వివాహమై….. తర్వాత విష్ణువు కాస్త పెద్ద కుమారుడైన భరతుడుగా జన్మించాడు.  ఇతను పరమ భాగవతోత్తముడైనప్పటికీ కూడా వివాహం చేసుకొని….. పదివేల సంవత్సరాల పాటు భూమండలం పరిపాలించి….. తన సంతానమైన ఐదుగురికి రాజ్యపాలన అప్పగించి….. సర్వం త్యజించి ….. విష్ణుమూర్తిని తన మనస్సులో ప్రతిష్ట చేసుకొని….. పులహమహర్షి ఆశ్రమమైన సాలగ్రామ క్షేత్రానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఈయన ఒక పర్ణశాలను ఏర్పరచుకొని…. విష్ణుమూర్తిని ఆరాధిస్తూ….. జింక చర్మం ధరిస్తూ…. పుష్పాలతో తులసీదళాలతో…. పూజిస్తూ గొప్ప భక్తుడై బ్రహ్మజ్ఞాని అయ్యాడు.  అన్నింటికి అతీతుడై….జడత్వంతో…. మెలగడం  వలన ఈయనకి జడా భరతుడు అనే పేరు వచ్చింది. 


ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒకరోజు ఇతను కాస్త ప్రతిరోజు స్నానము చేసే చక్ర నదికి స్నానానికి వెళ్లి…. స్నానం చేసి నది నుండి బయటకు వచ్చిన తరువాత….. దైవ నామాన్ని జపిస్తూ నది ఒడ్డున కూర్చున్నాడు.  ఇదే సమయానికి ఇక్కడికి ఒక నిండు గర్భిణీ అయిన ఒక జింక….. ఈ నది నీళ్లను తాగడానికి వచ్చి….. నీళ్లు తాగుతున్న సమయంలో…. దానికి సమీపంలో ఒక సింహగర్జన వినిపించేసరికి…. ఈ జింక కాస్త భయపడి నది దాటే ప్రయత్నంలో గర్భస్రావం అయ్యి పిల్లను కని చనిపోయింది.  దానితో ఇదంతా గమనిస్తున్న జడ భరతుడు కాస్త ఈ జింకపిల్ల మీద జాలిపడి …..దానిని తన చేతులలోనికి తీసుకొని…. తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి….. దానిని ప్రేమగా ఆప్యాయతగా పెంచసాగాడు.  ఎంతగా అంటే ఈయన మనస్సు ఈ జింక కూనను వదిలి ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేని విధంగా….. ఇతని మోహ బంధన స్థితిలోనికి వెళ్ళిపోయాడు.  ఈ జింక కూన యే ఇతనికి లోకమయ్యింది. సర్వభవ బంధాల మీద వైరాగ్యం చెంది …ఇక్కడికి వచ్చిన ఇతనికి…..అంతవరకు ఎవరి మీద ఏ విధమైన భావ బంధాలు పెట్టుకొని ఇతను కాస్త…. ఈ జింక కూన  పైన విపరీతంగా బంధాన్ని…. అనుబంధం పెంచుకోవడంతో…. నిత్య ఆరాధనలు, విష్ణు పూజలు అర్చనలు, జపాలు, ధ్యానాలు  అన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోయి…. ఈ జింక కూన మీద అధిక శ్రద్ధ భక్తి పెరగటం ఆరంభమైంది. కొంతకాలానికి తను అవసాన దశకు చేరుకొని మరణం వచ్చే అంతిమక్షణంలో కూడా తన దైవమైన విష్ణుమూర్తి నామస్మరణ ఏమాత్రం చేయకుండా…..ఈ జింక పిల్ల గురించి తలుచుకుంటూ….మదన పడుతూ ప్రాణాలు విడువటం జరిగింది. ఎప్పుడైతే ఆఖరి  స్పురణకు తగ్గట్లుగా భవిష్య జన్మ ఉంటుందని చెప్పిన వాక్యము ఆధారంగా….. ఇతనికి మరుజన్మగా జింక జన్మ ఎత్తటం జరుగుతుంది.  కానీ ఇతనికి పూర్వజన్మ యందు చేసిన విష్ణు భక్తి వలన కలిగే అపారమైన పుణ్యఫలం వలన…. పూర్వజన్మ జ్ఞానం కలిగి ఉండటంతో…. యోగి అయిన తాను అవివేకం వలన ఒక జింగ పిల్ల మోహ మాయలో పడి బంధనమై….. ప్రస్తుత ఈ జింక జన్మ ఎత్తే పరిస్థితి తెచ్చుకొని….. తాను బ్రష్టుడిని అయినానని గ్రహించి బాధపడేవాడు.  ఆ తర్వాత ఈ జంతు జన్మ మీద విరక్తి చెందడంతో…. అప్పటిదాకా ఆవాసం చేస్తున్న కాలంజనము పర్వతం నుండి బయలుదేరి తన పూర్వ ఆశ్రమమైన సాలగ్రామ క్షేత్రంలో ఉన్న పులాహ ఆశ్రమానికి వెళ్లి….. ఆ మహర్షితో తనకి ఈ జింక నుండి ఎప్పుడు ఎలా విముక్తి కలుగుతుందో చెప్పమని అడగగా…. దానికి ఈయన కాస్త నాయనా! నువ్వు గత జన్మలో జడభరతుడిగా మహావిష్ణు భక్తుడిగా…. చేసిన పుణ్యఫలం వలన నువ్వు అరుణగిరికి చేరుకొని గిరిప్రదక్షిణం గావిస్తే…. నీకు వచ్చిన మోహ బంధ జింక జన్మ నుండి విముక్తి పొంది…. విష్ణులోక ప్రాప్తి పొందుతావని చెప్పగా…..జింక రూపంలో ఉన్న జటాభరతుడు కాస్త సాలగ్రామ క్షేత్రం నుండి బయలుదేరి శోణగిరి అయిన నా ఈ క్షేత్రానికి చేరుకొని…. ఆహారమును,నీళ్లను త్యజించి ….నా యందు గిరి ప్రదక్షిణ చేసి పూర్తి అవ్వగానే….. ఈ జింకదేహాన్ని నా శివసముద్రము నందు విడిచి సశరీరంగా యదార్థ జడాభరత మునిగా తన అదృష్టము మేర విష్ణు లోకమైన వైకుంఠ ప్రాప్తి పొందడం జరిగింది.  ఈయన ద్వారా మనము ఎవరిమీద… వేటిమీద…. ప్రేమ, మోహ వ్యామోహాలు పెంచుకోకూడదని….. పెంచుకుంటే అవి కాస్త బంధమై…. బంధనమై…. బాధ్యతలై ఆయా జన్మలనే పునః జన్మగా పొందాల్సి ఉంటుందని…..ఈ ముని ద్వారా అందరూ గ్రహించండి అని చెప్పటం జరిగింది. 


త్రింశత్ (30) వ అధ్యాయం సమాప్తం 

శుభం భూయాత్ 

సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు


 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి