అధ్యాయం 25

 అధ్యాయం 25

గిరి దర్శన మహత్యము 

------------------------------------------------------



స్వామి మహాదేవా! అరుణాచల శివ ! అరుణాచలేశ్వర..!  స్వామి ఇప్పటిదాకా మీ యొక్క రూపమైన  శోణాద్రి గిరి గురించి చెప్పడం జరిగింది. నాయందు దయవుంచి మీరు ఈ గిరి యొక్క దర్శనం చేసుకున్న వారిని ఎలా అనుగ్రహించారో మీ నోటి ద్వారా వినాలని ఉంది అనగానే…


వత్సా! గౌతమా! నీ అనురక్తి నాకు అర్థం అయింది.  ఇప్పటిదాకా నా గిరి రూపము గురించి నువ్వు తెలుసుకున్నావు.  ఇప్పుడు నా గిరి దర్శనం చేసుకుంటే వచ్చే నా అనుగ్రహ ఫలితం తెలుసుకోవాలనే నీ ఆసక్తి…. నన్ను మరింత ముగ్ధుడిని చేస్తుంది.  నీ కోరికమేరా ఈ వివరాలు సవివరంగా చెబుతాను.  శ్రద్ధ భక్తితో విని అర్థం చేసుకో ….అంటూ 


ఒకసారి రాక్షసులను సంహరించాలని… నా దగ్గరికి దేవతలు అలాగే ప్రజాపతి రాగానే నా ఆజ్ఞ మేర త్వష్ట సూర్యుని సృష్టించాను.  ఇతను తనకి ఉన్న సుదర్శన చక్ర ఆయుధముతో ….అందరినీ దహిస్తూ నా గిరి దగ్గరికి వచ్చి అహంకారపూరితుడై… నా శో కి శోణగిరిని దాటి విజృంభించి….ప్రయత్నించి… విఫలమై నా గిరి తేజస్సు తట్టుకోలేక… అతని సూర్యతేజస్సు కోల్పోవడం ఆరంభమయ్యింది.  దానితో పాటుగా ఇతని రథం యొక్క సప్త అశ్వాలు కూడా అలసిపోయాయి…. తద్వారా ఆకాశంలో ఎక్కడైనా  విహరించగల సూర్యుడు కాస్త…. నా అరుణగిరి దగ్గరకు వచ్చేసరికి శక్తిహీనుడై అతిబలహీనమయ్యేసరికి…. అహం తగ్గి… అనుకూలత  పెరిగి బ్రహ్మచేత ఉపదేశం  పొందిన ఇతను కాస్త….. నా అరుణగిరికి  సర్వస్య శరణాగతి భావంతో ఆరాధన చేసేసరికి…. ఆకాశంలో ఎక్కడైనా అడ్డు లేకుండా విహరించగలిగే శక్తిని తిరిగి పొందడంతో పాటుగా…. నా యందు ఈ శోణగిరిని అతిక్రమించకుండా ……నా గిరి చుట్టూ తిరుగుతూ ప్రయాణం కొనసాగిస్తున్నాడు. 


ఒకసారి దక్షుని శాపం వలన చంద్రుడు కాస్త క్షయరోగం పొందడం జరిగితే…. బ్రహ్మ ఉపదేశ సారముగా నా  శోణగిరికి చేరుకుని… నన్ను ఆరాధించి…రోగ విముక్తుడై….లోకాలకి చల్లదనమును ప్రసాదించే శక్తిని పొందడం జరిగింది. అలాగే ఈ దక్షయజ్ఞంలో పూష అనే సూర్యుడు కాస్త కోల్పోయిన దంతమును., బృగు మహర్షి కాస్త కోల్పోయిన కన్నును, అలాగే సరస్వతి కాస్త కోల్పోయిన తన నాలుక,అలాగే మహాలక్ష్మి కాస్త తను కోల్పోయిన తన ముక్కును తిరిగి నా గిరిని దర్శనం చేసుకున్న తరువాతనే పొందడం జరిగింది. ఇలా ఈ దక్షయజ్ఞంలో తమ అంగాలు పోగొట్టుకున్న దేవతలు, మహర్షులు, కాస్త బ్రహ్మ ఉపదేశం ప్రకారం…. ఆదేశం ప్రకారం…. నా శోణ గిరిని దర్శించుకుని…. ఆరాధన చేసి….కోల్పోయిన తమ అంగాలను తిరిగి పొందడం జరిగిందన్నమాట!  విష్ణు ఆజ్ఞ చేత ఆదిశేషుడు కూడా నా అరుణగిరిని దర్శనం చేసుకుని ఆరాధన చేయడంతో కామరూప శక్తీ అనగా…..ఏ రూపము కావాలంటే ఆ రూపాన్ని ధరించే వరమును పొంది…. భూమిని మొత్తాన్ని భరించే శక్తిని పొందడం జరిగింది. ఇలా ఇతరులైన నాగులు, గంధర్వులు, అప్సరసలు , అష్టదిక్పాలకులు, సిద్దులు, మహర్షులు నా శోణ గిరిని దర్శనం చేసుకుని…. అర్చన చేసి వారు కోరుకున్న ఫలితాలను వరాలుగా పొందడం జరిగింది.


ఒకసారి మహా బలవంతుడైన ఇంద్రుడు కుమారుడైన వాలీ కాస్త…. తన బల అహంకారంతో తూర్పు కొండ నుండి పడమర కొండకు ఎగురుతూ మార్గమధ్యంలో ఉన్న నా శోణ గిరిని చూసి కూడా ఆగకుండా…. దాటబోయే ప్రయత్నం చేసేసరికి… నా శక్తికి అతని శక్తి సన్నగిల్లి హరించకుపోవడంతో నేలపై కుప్పకూలాడు. కారణం ఏమిటని తన తండ్రి అయిన ఇంద్రుణ్ణి అడగగా…. విషయం తెలుసుకొని వినయంతో నా శోణగిరిని దర్శించుకుని ప్రార్థించగానే…. అతడు శక్తిని తిరిగి పొందడం జరిగింది.  ఇకపోతే బలిచక్రవర్తి కాస్త వామనునికి భూమిని దానం ఇచ్చే సందర్భంలో…. ఇతని గురువు అయిన శుక్రాచార్యులు కాస్త అడ్డురాగా వామనుడు కాస్త తన దగ్గర ఉన్న గడ్డి  దర్భతో ఇతని కన్నుని గుచ్చగా….కన్ను కోల్పోవడం జరిగింది.  అప్పుడు ఒక కంటిని పోగొట్టుకున్న ఇతను కాస్త బ్రహ్మ దగ్గరికి వెళ్లి మొరపెట్టుకొనగా ఇతను కాస్త నా శోణగిరిలోని సూర్యుడు ఆవాసం చేసే సూర్య పర్వతం పైన కఠోర తపస్సు చేసి… తిరిగి కోల్పోయిన కన్ను పొందడం జరిగింది. 


పూర్వం ఇలుడు అనే మహారాజు కాస్త తెలియక గౌరీ వనములోనికి ప్రవేశించి…. స్త్రీ రూపమును పొందితే ….తన పురోహితుడైన వశిష్ట మహర్షి చేత నా మహిమ విని నా శోణగిరి దర్శించుకుని… అర్చన చేసిన తరువాత…. ఇతనికి తిరిగి తన పురుష రూపము పొందడం జరిగింది. ఇలా ఒకానొక సమయంలో ఒక దేవదాసి నన్ను భక్తితో గానం చేస్తూ ఉంటే…. ఈమెను చూసిన సూర్య రథసారధి అయిన ప్రతినుడు అనే రాజు మోహించి…. ఈమె వెంటపడి వేధిస్తుంటే…. ఈమె  కాస్త నన్ను శరణు వేడగా…. ఇతని ముఖం కాస్త కోతి ముఖంగా మారిపోయింది. దానితో ఇతనికి ఉన్న మోహము పోయి మోహ రహితుడై వినయంగా…. నన్ను శరణ వేడుకొనగా…. ఆ దేవదాసికి బదులుగా అనేక కన్యలను నాకు సమర్పించుకోవడం….ఇతనికి ఉన్న కోతి మొహం పోయి తిరిగి మనుష్య ముఖం పొందడం జరిగింది. ఇలాగే ఒకసారి పుష్పకుడు అనే గంధర్వ రాజు కాస్త గర్వమోహితుడై అకారణంగా నన్ను తిట్టడం జరిగింది. దానితో ఇతని ముఖము కాస్త పులి ముఖమైంది. నారద మహర్షి ద్వారా కారణం తెలుసుకొని నా శోణగిరిని దర్శించుకొని….ఆరాధన చేయగానే ఇతని సుందరమైన మనుష్య ముఖం తిరిగి పొందడం జరిగింది. ఇలా దేవతలు, మహర్షులు, సిద్ధులు, రాజులు ఈ శోణగిరిని దర్శించుకుని… ఆరాధన చేసి   ఎన్నో విధాలుగా వాళ్లు అనుకున్న ఫలితాలు పొందడం జరిగింది అని స్వామి వారు చెప్పడం జరిగింది. 


పంచవింశతిః (25వ)అధ్యాయం సమాప్తం 

శుభం భూయాత్ 

సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి