అధ్యాయం 31


 అధ్యాయం 31 

గిరి ఉపచార ఫలితములు

▪️▫️▪️▫️▪️▫️▪️▫️▪️▫️▪️ 


గౌతమ మహర్షి కాస్త…..స్వామి!  మహాదేవ..!  అరుణాచలేశ్వర..!  నీ అనుగ్రహం వలన ఇప్పటిదాకా గిరిప్రదక్షిణ మహత్యం తెలుసుకున్నాను.  ఇప్పుడు నా యందు దయవుంచి ….నీకు ఎవరైనా ఉపచారాలు చేస్తే నువ్వు ఎలా అనుగ్రహించావో…. తెలుసుకోవాలని ఉంది.  నా యందు అనుగ్రహం  ఉంచి వివరించగలవు ….అనగానే 


వత్సా ! గౌతమా ! నువ్వు నా యందు ఆసక్తుడివై…. నీ ద్వారా నా మహత్యం లీలలు… మహిమలు… ఫలితాలు…. ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ…. నీ మనసుని నా యందు లగ్నం చేస్తూ…. సందేహనివృత్తి చేసుకుంటూ…. మనసుని స్థిరపరచుకుంటున్నావని నాకు అర్థం అయింది. నాకు ఉపచారాలు చేస్తే వచ్చే అనుగ్రహ ఫలితం సవివరంగా వివరిస్తాను.  శ్రద్దా భక్తితో వినుము. 


పూర్వకాలంలో ఒక సాలెపురుగు నా గిరి మీద గూడు కట్టుకుంది.  తద్వారా నాకు వస్త్రము ఇచ్చినట్లు అయింది . అప్పుడు దానికి తన గత జన్మ జ్ఞానం కలిగి….  నా శివలోక ప్రాప్తి పొందింది. ఒకసారి నాకు గిరి పరిసరాలలో ఆవాసం చేసే ప్రజల యొక్క గోవులు కాస్త మేత కోసం నా గిరి మీద తిరుగుతూ….. వాటి బిడ్డలను గుర్తు చేసుకుంటూ …..నా గిరిపైన పాలు స్రవించాయి . తద్వారా నాకు క్షీరాభిషేకం చేసిన ఫలితము…. వాటికి ఇవ్వడంతో అవి కాస్త ముక్తిని పొంది వారి అదృష్టం మేర శ్రీకృష్ణుని ఆవాసమైన గోలోకమును చేరాయి.  ఒకనాడు ఒక ఏనుగు ఈ గిరి మీద సంచారం చేస్తూ ఉంటే దానికి విపరీతమైన దాహం వేయడంతో వనములోని  ఆ ఏనుగు తన మదధారలను స్రవించడంతో అదికాస్తా నాకు అభిషేకము అవడంతో…..ఆ ఏనుగుకి గణనాథత్వం పొందింది. ఒక ఎలుక కొండ లోపలి భాగం తవ్వడంతో….దానికి  పగడము దొరకటంతో నా గుహ  కాస్త ఈ మణికాంతితో మెరవడంతో నాకు దీపారాధన చేసిన ఫలితం ఈ  ఎలుకకి ఇవ్వడంతో ఇది కాస్త నా సారూప్యము పొందింది.  ఒకానొక సమయంలో రాత్రిపూట ఒక రామచిలుక కాస్త తన గూటిలో వెలుగు కొరకు కొన్ని మిణుగురు పురుగులను ఉంచగా….వాటి ప్రకాశము వలన నా గిరి ప్రకాశించుట చేత….. దానికి నా శాశ్వత శివ లోక ప్రాప్తి కలిగించాను. అంతెందుకు…. ఒక గద్ద కాస్త నా ఆలయ బలిపీఠం మీద ఉన్న ఆహారమును కింద పడాలని తన రెక్కలను బలంగా  విదిలించేసరికి….. ఆహారం కింద పడే వేగంలో నా గుడి శుభ్రం అవడంతో…. అనగా సమ్మార్జన సేవ అనగా….. ఆలయం శుభ్రం చేస్తే వచ్చే ఫలితమును ఇది పొందడంతో ముక్తి పొందింది.


అలాగే వజ్రాంద మహారాజు నాకు ఉపచారాలు చేస్తే ఎలా అనుగ్రహించానో తెలుసుకో!  ఇతను ఎవరో కాదు….. కాంతిశాలి మరియు కళాధరుడు అనే ఇద్దరు దేవత విద్యాధరులు కాస్త…. ఈయనకి ఒకరు రాజ అశ్వము అయితే… మరొకరు కస్తూరి మృగముగా మారి శాప విముక్తి పొంది ….ఈ రాజుకి తమ వృత్తాంతం తెలిపి…. నా మహత్యమును చెప్పేసరికి…. ఈ రాజు కాస్త తన రాజ్యభారము తన కుమారుడికి అప్పగించి….ఈ నా క్షేత్రములో శాశ్వతంగా స్థిరనివాసిగా మారాడు . తన రాజ్యంలోని విలాసవంతమైన ప్రదేశాలు…. నా సేవకై సమర్పించి ….నా శోణగిరి చుట్టూ అనేక జలాశయాలు…. ఎన్నో దిగుడుబావులు కట్టించాడు.  ఇక్కడ ఉండే బ్రాహ్మణునికి అనేక అగ్రహారాలు దానం చేశాడు.  నా సేవకు  ఎంతోమంది సుందరమైన వారిని ఏర్పాటు చేశాడు.  ఇతను ప్రతిరోజు  నవతీర్థ సరస్సులో స్నానమాచరించి…. శివ పంచాక్షరి జపము చేస్తూ….. పాదచారిగా గిరి  ప్రదక్షిణ చేసేవాడు.  మూడు యోజనాలు వరకు వ్యాపించి ఉన్న నా గిరికి అంగప్రదక్షిణం అప్పుడప్పుడు చేసేవాడు.  నా  శోణేశ్వర స్వామికి ప్రతి రోజు కూడా తెల్లనైన గంధసార లేపనముతో…. మృగ మదముతోను ….చందన చర్చ చేయించేవాడు.  కార్తీక పౌర్ణమి నాడు….. నాకు మహా దీపోత్సవం జరిపించేవాడు. ఆ రోజున అభిషేకానికి సుగంధ, సార, కర్పూర జలముతో నిండిన వెయ్యి బంగారు కలశాలతో సహస్ర గంటాభిషేకం చేసేవాడు. ఇలా ఇతను నన్ను మూడు సంవత్సరాల పాటు కొలవడంతో….ఇతని భక్తికి అలాగే ఇతను నాకు చేస్తున్న సేవలకి…. అలాగే ఉపచారాలకు మెచ్చి…. నేను కాస్త నా గణాలతో…..ఇతని ముందు సాక్షాత్కరించగానే …..ఇతను కాస్త నాకు సాష్టాంగ నమస్కారం చేసి…. ఓ దేవదేవా!  మహాదేవ! సర్వలోక రక్ష ….సర్వలోక శరణ్య…. దీనబంధు… నేను ఏదైనా అపరాధం తెలుసో… లేదో తెలియక చేస్తే నన్ను క్షమించు స్వామి!  కరుణామూర్తి ….అనగానే నేను కాస్త ఓ రాజా!  భయం వద్దు.  నీవు చేసిన అపరాధం ఏమిటంటే…. ఒకనాడు కైలాసంలో నన్ను అవమానించావు. ఎందుకంటే అప్పుడు నువ్వు దేవేంద్రుడిగా ఉన్నావు. నువ్వు చేసిన అపరాధానికి ప్రాయశ్చిత్త శిక్షగా నా చేత శపించబడ్డావు.  దానితో నీకు ఉన్న గర్వ అహంకారాలు తొలగి….. నా శివజ్ఞానమును ప్రసాదించమని కోరగా…..అప్పుడు నేను కాస్త నీతో వజ్రాంగద నామముతో భూలోకములో మహారాజుగా పుట్టి…. నా ద్వారా శివజ్ఞానమును పొంది…. తద్వారా నీ శాప విముక్తి పొంది…. ఇంద్ర పదవితో….తిరిగి ఇంద్ర లోకానికి చేరుకుంటావని అభయం ఇవ్వడంతో…. నీకు నా శివజ్ఞానం  ప్రసాదించటానికి ఇలా సాక్షాత్కరించాను అంటూ….. ఇతనికి శివ జ్ఞానమును బోధించిన తర్వాత భూలోకమునందు నా శివ భక్తుడిగా సకల భోగాలు అనుభవించిన పిమ్మట  దేవేంద్ర రూపమును పొంది…. ఆపై ఇంద్ర సుఖాలను అనుభవించిన పిమ్మట….  నాయందు ఐక్యం చెందగలవు అని ఇతనికి అభయం ఇచ్చి…. అంతర్దానం అయినాను.  ఆ తర్వాత ఈ రాజు కాస్త భూలోకము నందు గల సకలభోగాలను అనుభవించి….మరణం పొంది….ఇంద్ర  పదవితో ఇంద్రలోక సుఖాలను అనుభవించి ….అక్కడ విముక్తి పొంది… చివరికి నా శివ సాయుజ్యమును పొందడం జరిగిందని చెప్పడం జరిగింది. 


ఇలా నాకు దీపం వెలిగించు మానవులకి స్వయంప్రకాశ తత్వం పొంది…. నా సారూప్యములు పొందుతారు. అంతెందుకు ఈ నా అనుగ్రహ ప్రాప్తి కోసం…. అనగా జన్మరాహిత్య స్థితి పొందటానికి…. దేవతలు అలాగే మనుషులు కాస్త…. ఈ గిరి చుట్టూ ఉండే వృక్షాలుగా, జంతువులుగా ఈ నా క్షేత్రమునందు జన్మించి…. నా అనుగ్రహం పొందాలని ఎల్లప్పుడూ  ప్రార్థిస్తూనే ఉంటారు. ఎందుకంటే   ఈ నా  క్షేత్రమైన అరుణాచల క్షేత్రం మించిన క్షేత్రం….. అలాగే ఈ నా  అరుణాచలేశ్వర శివలింగమూర్తిని మించిన దైవము…. అలాగే ఈ నా గిరి ప్రదక్షిణమునకు మించిన తపస్సు లేనేలేవు…. అని గ్రహించడం వలన…. ఈయన అనుగ్రహ ప్రాప్తి కోసం…. దర్శనం, స్మరణ, శ్రవణములతో ….నన్ను సేవిస్తూ ప్రార్థిస్తూ…. ధ్యానిస్తూ…. ఉంటారు అని చెప్పడం జరిగింది. 


ఏకత్రింశత్ (31వ) అధ్యాయం సమాప్తం 

శుభం భూయాత్ 

సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి