అధ్యాయం 41

 అధ్యాయం 41 

అర్ధనారీశ్వర అవతరణ 

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°



కార్తీక పౌర్ణమి రానే వచ్చింది. దానితో తీవ్రమైన ధ్యాన తపస్సులో ఉన్న కామాక్షికి శోణాద్రి గిరి అగ్రభాగంలో ఎలాంటి ఆధారం లేకుండా స్వయంభూ దివ్య తేజస్సుతో కూడిన అరుణ జ్యోతి దర్శనం అయ్యింది. ఈ దర్శనం కోసం అప్పటికే ఈ గిరి చుట్టూ త్రిమూర్తులు, త్రిశక్తులు ,దేవేంద్రుడు ,అష్టదిక్పాలకులు, ఏకాదశరుద్రులు, ద్వాదశ ఆదిత్యులు , అష్టవసువులు, అశ్విని దేవతలు, యక్షులు, కిన్నెరలు, గంధర్వులు, సిద్దులు, మహర్షులు, మునులు, యోగులు మున్నగు వారంతా వేచి చూస్తూ….. ఈ దివ్య జ్యోతి దర్శనం పొంది….గిరి ప్రదక్షిణం చేయడం ప్రారంభించేసరికి…. కామాక్షి కూడా గిరిప్రదక్షిణం తన చెలికత్తెలతో పరివారముతో చేస్తూ…. పదేపదే మధ్య మధ్యలో….. ఈ దివ్య అరుణ జ్యోతిని తదేక దృష్టితో చూస్తూ….. స్వామి!  అరుణాచల మహాదేవా ! ఓ విశ్వరూప! సర్వపాతక వినాశన ! బ్రహ్మ విష్ణువులు కూడా తెలుసుకోలేని దివ్యతేజమా!  కాలస్వరూప!  అగ్ని రూప!  అచలస్వరూప!  అరుణాచల రూప!  ఈ నీ విచిత్ర రూపమైన పర్వత లింగమును గురించి…. నీ కదలిక వేదాలకే తెలియదు.  మహేశ్వర.!  ఇలాంటి పర్వతలింగమును బ్రహ్మ ,విష్ణువు చేతనే దర్శించబడిన సుమంగళ రూపధారివి. నమస్తే మేరు రూపాయ!  కైలాస వాసినే!  నీ హర శైలజా మాత్రే !శోణక్ష్మాధరరూపిణే! వరుణాది సూర్యాస్యరూపాయ!  నమస్తే అరుణాదిత్య వక్షసే! అరుణాచల నాధాయ! కరుణా స్వరూపిణే !జయ జహ్నునుత!  చంద్ర  లేఖలాంకృత! శేఖర! జయ సౌందర్య మోహిత శేషము పత్ని జనాశయ!  జయ  శైలాసుత సంగ సంభృత సంగ వైభవ!  మాయా నారాయణ భోగ క్రీడా మ్రేడన పండిత! జయ సంధ్య సమూపేతానంద తాండవ! జయ  గీర్వాణ గంధర్వసిద్ధ విద్యాధరర్చిత!జయ హేరంబ జనక!  జయ షణ్ముఖ వత్సల!  జయ హైమావతి పార్ద్వ! జయ పార్థివ దుర్లభ! నేడు నీ జ్యోతి దర్శనంతో నేను పవిత్రురాలిని అయ్యాను. నీ దివ్యరూప దర్శనం నాకు ప్రసాదింపుము అని కోరుకుంటూ….. గిరిప్రదక్షిణం పూర్తి చేసుకొని అరుణాచలేశ్వర శివలింగ దర్శనం చేసుకుని…. తిరిగి గిరి అగ్రభాగమున స్వయంభు వెలుగుతూ…. దర్శనమిస్తున్న అరుణ జ్యోతిని పదేపదే చూస్తూ….. జ్యోతిని వేడుకోవడం చూసిన పరమేశ్వరుడు కాస్త గౌరీదేవి ప్రార్థనలను ఆలకించి….. ఉదయించే కోటి సూర్యుల కాంతులతో….. కోటి పూర్ణచంద్రుల చల్లదనముతో….. కోటి కాలాగ్ని సమాన తేజస్సుతో…. అరుణాద్రి నాథుడు దేవి ఎదుట ప్రత్యక్షమయ్యాడు.  ఈ దివ్య రూప సాక్షాత్కారం చూసిన దేవి కాస్త….. తన విరహవేదనను మర్చిపోయి పరమానంద భరితురాలై …..దేవతలు, మునులు, మహర్షుల బృందముతో… కలిసి ….పరమేశ్వరుడికి పరమ భక్తితో ప్రణమిల్లింది.  అప్పుడు అరుణాద్రి కాస్త అంబికను చూసి…. దేవి!  నీవు నన్ను శైవాగమున పద్ధతిలో ఆచరించిన నీ తపస్సు చేత నేను సంతృప్తి చెందాను. నీవు దర్శించిన నా ఈ దివ్య తేజో రూప దర్శనముతో…. నీ సమస్త అజ్ఞానము తొలగిపోయింది.  ఇప్పుడు నా దర్శనము చేతనే పాప దోషాలు సమస్తము తొలగిపోయాయి. నీవు ప్రాయశ్చిత్తం కోసం కైలాసం నుంచి నీ పుత్రుడైన బాల కుమారస్వామికి పాలు ఇవ్వకుండా ఈ భూమి మీదకి ఘోర తపస్సు చేసుకొనుటకు రావటం చేతనే…. ఈ నాటి నుండి నువ్వు కాస్త ఈ క్షేత్రంనందు అపీతస్తని గా…అపితకుచాంబిక అని పేరుతో ప్రసిద్ధి పొందుతావు. ఈ కృత్తికా నక్షత్రం ఉచ్చదశ యందు నీవు ఈ ప్రాయశ్చిత్త ఫలితం పొందుట చేత….. కరుణామూర్తివై నా వామభాగమును పొంది అర్ధనారీశ్వర తత్వముతో అపితకుచాంబికగా నన్ను పొందు అంటూ ఉండగానే …..



అమ్మవారు కాస్త ఈయన వామభాగం వద్దకు చేరుకోగానే…. ఓ దేవి..నువు నా అంశవి.ఇతరులవలే మన మధ్య ఏలాంటి బేధాలు,విభేధాలుండవు.కాని నువ్వు నీ ఈర్ష్యచేత నన్ను వ్యాకులపరుస్తున్నావు.ఇకపై నా మీద కోపముతో నువ్వు నా నుండి వేరూగుటకు వీలులేదు. అంటూండగా …పరమేశ్వరుడి శరీరం నుంచి వచ్చే దివ్యమైన పరిమళమునకు ముగ్గురాలైన అమ్మవారు కాస్తా "స్వామి!  మీ శరీరం నుంచి వచ్చే…. ఈ దివ్య పరిమళం ఏమిటిది?  ఎలా వచ్చింది ? అనగానే దానికి పరమేశ్వరుడు కాస్త…. చిరునవ్వు నవ్వి …..దేవి!  ఈ పరిమళమును నువ్వు కూడా ధరింపుము.  పూర్వం పునుగు పిల్లి రూపంలో పులగుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి…. నా నుంచి అద్భుతమైన సుగంధమును వరముగా పొందాడు.  దానితో మునులు ,మహర్షుల భార్యలే కాకుండా….. దేవతా స్త్రీలు ఆకర్షించబడి…. వీడి కామ కాంక్షలు తీర్చడం మొదలుపెట్టేసరికి…. వీరందరూ ఒకరోజు నా దగ్గరికి వచ్చి…. వీడు చేసే అకృత్యము నాతో చెప్పేసరికి…. వీరికి నేను అభయమిచ్చి…. ఈ దైత్యుని  నా దగ్గరకు రప్పించుకొని…. వాడితో లోక రక్షణ కోసం…. శరీరమును త్యాగం చేయమని…. నేను వాడికి ఆజ్ఞాపించగా…. దానికి ఈ దైత్యుడు కాస్త స్వామి!  దేవాది దేవ!  మీ ఆజ్ఞ మేరా నేను అలాగే ఈ సుగంధ పురితమైన శరీరమును వదిలి వేస్తాను.  వదిలే ముందు నాకు వరాలు ప్రసాదించండి.  నా శరీరం చెమట బిందువులతో తయారు అయ్యే ఈ సుగంధ లేపనము…. నువ్వు నీ శరీరం మీద ప్రతినిత్యం ధరించాలి.  అలాగే ఈ పునుగు లేపనం కాస్త శృంగారస వర్ధకము అవ్వాలి. దీనికి ప్రియమై శాంతిని,సౌభాగ్యమును ప్రసాదించుగాక!అలాగే ఈ సుగంధ లేపనం నా వంశంలోని వారందరికీ ….సహజ సిద్ధమవుగాక!  అని వేడుకునేసరికి…. తధాస్తు!  అని అనేసరికి వాడు కాస్త ఆనందంగా ఈ సుగంధ శరీరం విడిచి పెట్టాడు.  వాడి కోరిక మీద, వాడి శరీర సుగంధ లేపనమును అనగా ఆనాటి నుంచి నేను కాస్త ధరించడం మొదలుపెట్టాను.  అవును…!  నీ చేతిలో ఉన్న పుష్పం నుంచి ఒక రకమైన సుగంధ సువాసనలు వెదజల్లుతుంది.  ఇది నీకు ఎక్కడిది అనగానే దేవి కాస్త…… ఓ దేవాది దేవా!  నా శివ!  నీ ఆజ్ఞ చేత నేను కాస్త కైలాసం నుంచి తపస్సు చేసుకొనుటకు భూలోకమునకు బయలుదేరాను కదా!  అప్పుడు నాకు మానససరోవరం వద్ద ఎన్నటికీ వాడిపోని ఈ సుందర సౌగంధిక పుష్పం దర్శనం అయ్యింది.  దానికి నేను కాస్త తీసుకొని భూలోకమునకు బయలుదేరి నీ శివలింగార్చన కోసం నేను ఎన్నిసార్లు దీనిని వినియోగించినను ఇది వాడిపోక పొగా …..ఇంకా ఇప్పటికి తన సహజ సిద్ధమైన సుగంధ సువాసనను విరజిల్లుతూనే ఉంది.  అందుచేత ఎల్లప్పుడూ దీనిని నా చేతిలో నిత్యం ధరిస్తూ మీ విరహవేదనను కొంతమేర దాటుకుంటూ…… ఇన్నాళ్ళకు వస్తున్నాను అనగానే…. ఓ దేవి!  నీ శరీరం తపస్సు చేత తపించిపోయింది కదా!ఈ నా పునుగు తైలాన్ని నువ్వు కూడా వినియోగించుకుని…నా వియోగం చేత తపిస్తున్న.. నీ దేహ  వియోగాన్ని నుండి విముక్తి పొంది అంటూ…. అమ్మవారికి ఈ పునుగు తైలం ప్రేమగా, ఆప్యాయంగా రాస్తూ…. మహాదేవుడు కాస్త అత్యంత ప్రీతితో అమ్మవారిని ఘాఢంగా ఆలింగనం చేసుకొని….. ఇలా ప్రేమతో కలుసుకున్న శివశక్తుల శరీరాలు ఏకమై….. రెండు సమభాగాలుగా కలిసినట్లుగా …..ఒకవైపు పురుష భాగం కాస్త తెల్లని కర్పూరము వలె,  మరొకవైపు స్త్రీ భాగము కాస్త ఎరుపు వర్ణముతో ప్రకాశించింది.  ఈ విచిత్రమైన భవాని భవుల ఏకరూపమును అనగా….. ఒకపక్క పురుష రూపముతో, రుద్రాక్షమాలతో, చెవికుండలముతో నాగసర్పాలతో ఉంటే…. మరొక పక్క స్త్రీ స్వరూపముతో, తాటంకాలతో, ఒక నూపురముతో ఒకే స్థనముతో, ముగ్ధ మనోహరముగా ఉంది.  ఎప్పుడైతే ఇలా శివుడు కాస్త తన వామభాగమును తన అర్ధాంగికి ఇచ్చాడో….. ఆనాటి నుంచి ఈయనకి వామదేవుడిగా అలాగే శివశక్తి అర్ధనారీశ్వరుడుగా పిలుస్తూ….. కొలుస్తూ…. ఆరాధనలు చేయడం ఆరంభించారు. దానితో ఈ అర్థనారీశ్వర రూపుడు కాస్త అక్కడ ఉన్న దేవతలను, మునులను , మహర్షులను ,సిద్దులను యోగులను ఉద్దేశిస్తూ….. ఈనాటి నుండి మేము ఇక్కడే ఉండి శోణాద్రిశ , అపితకుచాంబ రూపాలతో ఉన్న మమ్ములను ఎవరు సేవిస్తారో….. వారికి భోగము, మోక్షములను పొందుతారు గాక!  దేవి అంశతో జన్మించిన దుర్గ కాస్తా మహిషాసుర మర్దని రూపముతో సర్వమంత్ర సిద్ధిప్రదాయకై ……ఇక్కడే నివసించును గాక! ఖడ్గ తీర్థము నందు అలాగే బ్రహ్మ తీర్థము నందు ఎవరైతే స్నాన, తీర్థ సేవనం చేస్తారో ….వారి సర్వ పాపాలు నశించి సర్వరోగాలు హరించు గాక!  ఈ అర్ధనారీశ్వర రూపముతో…. నన్ను సేవించిన వారి వరములు ఇచ్చుగాక!  ఇక్కడ తపస్సులు చేసేవారి తపస్సులు ఫలించుగాక!  ఈ క్షేత్ర వాసులుగా భైరవుడు, వటులు, సాధవులు, నివసించునుగాక!  నేను అరుణాచలేశ్వరుడిగా అమ్మవారు కాస్త అరుణేశ్వరిగా శాశ్వతముగా ఇక్కడే ఉండి….. మానవుల పూజలు అందుకుంటూ….. వారి కోరికలు తీరుస్తూ…. సర్వసిద్ధులను సులభంగా లభించుగాక . నా అర్ధనారీశ్వర తత్వ గాధను వినువారికి లేదా పఠించువారికి సర్వ శ్రేయోధాయకము అగుగాక అని వరాలు, ఆశీర్వాదాలు చేసేసరికి దేవతల కాస్త స్వామి!  అర్ధనారీశ్వర స్వరూప!  ఈనాడు నివోసగినా ఈ దివ్య దర్శనమును…. మా అందరికీ ప్రతి సంవత్సరం కార్తీకమాస కృతిక నక్షత్రంనందు  సమస్త లోకవాసులకి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము అనగానే…. అర్థనారీశ్వర రూపధారి కాస్త ఈ రోజున ప్రతి సంవత్సరం నా ఈ రూప సమక్షంలోనే నా దివ్య జ్యోతి దర్శనం నా సోనాద్రి గిరి అగ్రభాగంలో దర్శించుకుంటారు.  తధాస్తు అంటూ…. ఈ అర్ధనారీశ్వర స్వరూపంలో అంతర్దానం అయ్యెను. 


అన్నీ భోగ, యోగ కోరికలు అరుణాద్రినాథుని దర్శించువారు… గిరిప్రదక్షిణం చేయువారు… నమస్కరించు వారు…. తపస్సు చేయువారు…. ఈ అరుణాచల మహత్యం విన్నవారు…. సర్వ పాపాల నుండి ….సర్వకర్మల నుండి… సర్వకర్మ బంధాల నుండి ….సర్వ ఋణాల నుండి…. సర్వ ఋణాను బంధాల నుండి…. సర్వజన్మాంతరాల పాపాల నుండి…. విముక్తి పొంది రుద్రాంశ సంభూతులై…. పరమశివుడు కాస్త వశం అగును. సర్వ తీర్థాలలో చేసిన స్నాన ఫలితము, సర్వయజ్ఞ యాగాలు, హోమాలు చేసిన ఫలితము…. సర్వ క్షేత్ర దర్శన ఫలితం…. ఈ అరుణాచలేశ్వరుని అనుగ్రహం ద్వారా లభించును.  ఈ అరుణగిరిని సేవించు వారికి ….దీర్ఘకాలిక వ్యాధులు, కలి దోషాలు సంక్రమించవు. ఒక కల్ప కాలం పాటు చేసిన పుణ్యం లభించును. ఇంతటి మహత్తరమైన ఈ అరుణాచల మహత్య పురాణ శ్రవణం నేడు నీకు శివ ముఖం నుంచి వెలువడి… గౌతమ మహర్షి విని అనంత కోటి తపస్సు యొక్క ఫలితమును పొందాడని ….సూత ముని ప్రవచనము.


ఇది స్కాంద పురాణమునందు 81 వేల సంహితలలో మూడవ ఖండమగు మహేశ్వర ఖండంలోని అరుణాచల మహత్యం యొక్క ప్రధమ, ద్వితీయ భాగాలు సమాప్తం…. 

 

సర్వ 41 అధ్యాయాలు సమాప్తం… 

సర్వం అర్ధనారీశ్వర అరుణాచల శివార్పణమస్తు 

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణ శివ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి