గ్రంథ పారాయణం

 

గ్రంథ పారాయణం 

1) గురుదక్షిణామూర్తి ఫోటో లేదా రెండు అంగుళాలున్న దక్షిణామూర్తి విగ్రహ మూర్తిని తీసుకొని దానిని నీళ్లతో కడిగి లేదా తుడిచి గంధపు బొట్లు ప్రతిరోజు పెట్టాలి.


2) నిత్య దీపారాధన చేయాలి. అగరవత్తులు వెలిగించాలి. 


3) శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమును పఠించాలి. అరుణాచల శివనామస్మరణ చేసుకోవాలి.


4) గ్రంథ పారాయణం ఎవరైతే చేస్తారో వాళ్ళు….ప్రతి గురువారం తల స్నానం చేసి, ఇంట్లో ధూపం వేసి, ఆ రోజంతా ఉపవాసం ఉండి, మౌనం పాటించాలి. ఆ తర్వాత దక్షిణామూర్తి విగ్రహానికి లేదా ఫోటోకి నానబెట్టిన శనగల మాల వేయాలి.అలాగే తాళింపు పెట్టిన శనగల నైవేద్యం పెట్టాలి.  మరునాడు స్వామివారికి వేసిన శనగల మాలను తీసి… ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేయాలి లేదా పశువులకు, పక్షులకు ఆహారంగా పెట్టవచ్చును. 


5) ప్రతిరోజు పారాయణ పూర్తి అయిన తర్వాత పటిక బెల్లం నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి. 


6) ప్రతిరోజు ఒక అధ్యాయం రెండు భాగాలుగా ఉదయం, సాయంత్రం వేళల యందు చదువుకోవాలి! ఇలా 41 రోజులలో 41 అధ్యాయములు పూర్తి అయితే…. 41 రోజుల గ్రంథ పారాయణం పూర్తి అయినట్లే అవుతుంది. అర్థం చేసుకుంటూ ఆర్తిగా…అనురక్తిగా….నెమ్మదిగా హడావిడి లేకుండా ప్రశాంతంగా చదవాలి.


7) పారాయణం పూర్తి అయిన ఆఖరి రోజున అనగా 41వ రోజున పాల పాయసం, తాలింపు శనగలు నైవేద్యంగా పెట్టి అందరికీ గురుప్రసాదంగా పంచాలి.


8) ఆఖరి రోజున ఏదైనా శివాలయం పూజారికి స్వయంపాకం లేదా భోజనం పెట్టి మీ స్తోమతకు తగ్గట్లుగా దక్షిణ తాంబూలం ఇవ్వండి. వారిని గురువుగా భావించి ఆశీస్సులు తీసుకోండి .


9) మీ కోరిక తీరితే…. మీకు అరుణాచలేశ్వరుడి అనుగ్రహం పొందితే …..అరుణాచల క్షేత్ర దర్శనానికి వచ్చి గిరిప్రదక్షిణం చేసుకొని అరుణాచలేశ్వర అగ్నిలింగమూర్తిని దర్శనం చేసుకోండి.


గమనిక:-


స్త్రీమూర్తులు నెలసరి సమయాలలో ఈ గ్రంథ పారాయణ చేయరాదు.  నెలసరి అయిదు రోజులు పూర్తి అయిన తరువాత 6వ రోజునుండి ఎక్కడ ఆపారో అక్కడినుండి చదవడం ప్రారంభించాలి. 


అలాగే పురుషమూర్తులు కూడా ఇలాంటి స్థితిలో ఎవరైనా స్త్రీ మూర్తులు ఉంటే…. ఆయా సమయంలో గ్రంథ పారాయణ చేయరాదు. 


ఇంటి మైల రోజులలో కూడా ఈ గ్రంథ పారాయణ చేయరాదు. 


మన శరీరం, మనసు, బుద్ధి ఎంత పవిత్రంగా ఉంటే…. మనకి అంత శీఘ్రముగా మన కోరిక తీరుతుందని…. ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహం కలుగుతుందని తెలుసుకోండి. జాగ్రత్తగా మసులుకోండి.


తప్పు చేస్తే శిక్ష తప్పదు. పరిహార దోషాలు అనుభవించక తప్పదు. ఎందుకంటే అరుణాచల క్షేత్రంలో అరుణగిరి లోపల ఇప్పటికీ గురు దక్షిణామూర్తి సజీవమూర్తిగా… సిద్ధపురుషుడిగా…. మర్రిచెట్టు కింద ధ్యాన సమాధిలో, నిశ్చలమూర్తిగా… నిశ్చల స్థితిలో ఉన్నారని…. స్కంద పురాణ మరియు అరుణాచల పురాణ ఉవాచ చెబుతోంది. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ప్రామాణిక ఆధారం లేకుండా ఏవి చెప్పవని తెలుసుకొని… మసులుకొని…. అమిత శ్రద్ధ ,భక్తి అచంచల విశ్వాసంతో పర్వత లింగమైన  అరుణాచలేశ్వరుడి అనుగ్రహం పొందండి. పొందుతారని ఆశిస్తూ…. ఆశీస్సులు ఇస్తూ ….


ఇష్టకామ్య ఫల సిద్ధిరస్తు 

అరుణాచల శివానుగ్రహ ప్రాప్తిరస్తు 

శుభం భూయాత్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి