అధ్యాయం 7
కుమారస్వామి నిజరూప దర్శనం

ఈ యదార్థ సంఘటన మనకి ఈ క్షేత్ర కవి భక్తయోగి అయిన అరుణగిరి నాధర్ జీవితంలో జరిగింది. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. ఈయనని అందరూ కూడా “డిండిమభట్టు” అని పిలిచేవారు. ఈయన యవ్వనమంతా కూడా చెడుసావాసాలతో గడిచిపోయింది. వేశ్య లోలుడు. వేశ్య సుఖము లేకపోతే పిచ్చివాడు అయ్యి ఉన్మాదిగా మారేవాడు. వేశ్యల కోసం తరతరాలుగా వచ్చిన ఆస్తులు కరిగిపోయాయి. ఒకరోజు తన అక్క….. తనకి వేశ్య సుఖం కోసం ధనం ఇవ్వకపోతే ఉన్మాదిగా మారి ఈమె మీదకి దండెత్తి వస్తే…. ఏమే కాస్త ఏమాత్రం ఆలోచించకుండా…. క్షణకాలంలో నగ్నముగా మారి నీకు సుఖమే కదా కావాల్సింది….నేను ఇస్తాను తీసుకో! నీకు తెలియని విషయం ఏమిటంటే ….నిజానికి మనిద్దరం కూడా సొంత అక్క తమ్ముళ్ళం కాదు…. నీ తండ్రి వేరు , అలాగే నా తండ్రి వేరు. అమ్మ చనిపోతూ…. ఆఖరి క్షణంలో ఈ విషయం నాకు చెప్పి చనిపోయింది. నువ్వు ఎక్కడ బాధపడతావో అని ఈ విషయం నీకు చెప్పకుండా ఇన్నాళ్లుగా నాలో ఉంచుకొని మదనపడ్డాను. ఇక కామావేశం హద్దులు దాటింది… వావి వరుసలు దాటాయి….తన, మన తేడా లేకుండా పశువులగా మారి కోరిక తీర్చుకోవడం ధనం కోసం నన్ను నిత్యం వేధిస్తూ వస్తున్నావు…. ఇన్నాళ్లు నేను కాస్త బిక్షాటనలో పోగు చేసిన ధనమంతా పూర్తి అయ్యింది. తాతలు ఇచ్చిన ఆస్తులు ఏనాడో నీ కామపిశాచి దెబ్బకి హరించి పోయాయి. ఇక ఈరోజు ఈ విషయం తెలిసింది కదా! మన తండ్రులు వేరు కదా….. నాకు ఒక పైసా ఇవ్వకుండా, నా నుండి నీకు కావాలసిన శరీర కామ సుఖమును అనుభవించు…. అనగానే , ఇన్నాళ్లుగా తన తల్లి తర్వాత తల్లిగా భావించుకున్న సొంత అక్కే…. నగ్నముగా మారి సుఖం ఇస్తాను అనడంతో….. ఇతనికి ఆ క్షణమే కామము మీద మోహ వ్యామోహము మాయపోయి…. స్మశాన వైరాగ్యం కలిగి….. అక్క మీద చీర వేసి…. క్షమించమని అడిగి….. అక్కడ నుండి బయటకు వచ్చాడు.
అప్పుడు కాస్త, అరుణాచల శివుడు కాస్త…. ఒక సాధువు రూపంలో ఇతని దగ్గరికి వచ్చి ఇతనితో… “దేవుడిని ప్రార్థించు…. ఈయన కరుణిస్తే నీ జన్మ ధన్యమవుతుంది…. సమస్యలు దూదిపింజులాగా వెళ్లిపోతాయి…. మాయలు తొలగి జ్ఞానం అందుతుంది…. పదార్థం దాటితే కానీ యదార్థం ఏమిటో నీకు తెలుస్తుంది…” అని చెప్పి వెళ్లిపోయాడు. దానితో ఇతను కాస్త అరుణాచలేశ్వర ఆలయమునకు వెళ్లి అక్కడ ఉన్న అగ్ని శివలింగమూర్తిని చూస్తూ…. ఎంతో కాలం ప్రార్థనలు చేశాడు. ఎలాంటి ఫలితం అగపించలేదు….దానితో ఇతని విరక్తి కాస్త తారాస్థాయికి చేరడంతో…. దైవ కృప పొందని బతుకు వ్యర్ధము అని ఈ ఆలయంలోని ఉత్తర గోపురం ఎక్కి ఆత్మహత్య చేసుకుందామని కిందకి దూకాడు.
అప్పుడు కుమారస్వామి కాస్త సజీవ మూర్తిగా భౌతిక దేహంతో ప్రత్యక్షముగా తన చేతులతో…. ఇతనిని పడిపోకుండా పట్టుకుని కిందకి దించి… ఇతని నాలుకపై శరణభవ షడక్షర బీజాక్షర మంత్రమును… తన శూలాయుధంతో లిఖించడం జరిగింది. ఆ తర్వాత ఈయన కాస్త ఇతనితో నా గురించి ఏమైనా కీర్తన చెప్పు అన్నాడంట. అప్పుడు ఇతని నోటి నుండి కుమారస్వామి స్తుతిగా…. అశువుగా…. వచ్చిన కీర్తన “ముత్తయితారుపతి” గా ప్రసిద్ధి చెందింది. ఈ కీర్తన ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది జరిగిన ప్రదేశమును అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర కోవెలగా ఉంది. ఇది ప్రధాన ఆలయమునకు ఎడమ పక్కగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయమును మనం దర్శించుకోవచ్చును.
ఆనాటి నుండి అరుణగిరి నాధర్ కాస్త కుమారస్వామి ప్రియ భక్తుడు అయ్యాడు. తన భక్తి గేయాలతో సుబ్రహ్మణ్యస్వామిని నిత్యం స్తుతించేవారు. ఈయన పిలిస్తే పలికేవాడు. ప్రార్థన చేస్తే అగుపించేవాడు. ఒకసారి ఆనాటి రాజైన ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో జ్ఞాన సంబంధర్ అనే కాళీమాత అనుగ్రహం పొందిన భక్తకవి ఉండేవాడు. ఈయన పిలిస్తే కాళీమాత ప్రత్యక్షమయ్యేది. ఈయనకి అరుణగిరినాథర్ కీర్తనలు ప్రజల నాలుకల మీద నాట్యమాడటంతో… ఈర్ష్యా ద్వేషాలకు లోనై …..రాజుగారి సమక్షంలో ఒకసారి సభను ఏర్పాటు చేసి తమ ఇద్దరంలో ఎవరు నిజ భక్తులో ….తెలపమని చెప్పడం జరిగింది. సభ మొదలైంది . ఆ నాటి రాత్రి ఈ సంబంధర్ …. కాస్త అమ్మవారి బంధనములో కుమారస్వామి ప్రత్యక్షం కాకుండా చేయమని కోరుకొని…… మర్నాడు సభకి చేరుకొని…. అక్కడ ఉన్న అరుణగిరి నాథర్ తో “నేనైతే నా భక్తితో కాళీమాతను ప్రత్యక్షంగా చూపిస్తాను. అలాగే నీ భక్తితో కుమారస్వామిని చూపించగలవా?” అని సవాలు విసరడం జరిగింది.
అప్పుడు అరుణగిరి నాథర్ ఎంతో వినయంగా…. నా స్వామి ఎప్పుడూ కూడా ఆయన నన్ను చూడాలి అనుకుంటే కనిపించేవాడు. నేను చూడాలి అనుకుంటే కనిపించేవాడు కాదు. అయినా నా ప్రార్ధన నేను చేస్తాను…. ఆయన మిమ్మల్ని చూడాలి అనుకుంటే….మీతో పాటుగా నాకు కూడా ఆయన దర్శన భాగ్యం కలుగుతుంది . కాకపోతే అంతటి దివ్య తేజస్సును తట్టుకోవటం మామూలు నేత్రాలకి సరిపోవు… అని చెప్పడంతో ….ఈ మాట విన్న ఆ రాజు మాత్రం…. “స్వామి! మీ భక్తికి ఇది పరీక్ష. మీ స్తుతిని స్వామి వారు వింటే ….ఆయన సంతృప్తి చెంది ప్రత్యక్షం అవ్వాలి కదా! ఆయన దివ్య తేజస్సు మేమంతా తట్టుకుంటామో లేదా అనేది పక్కన పెట్టండి…. మీ స్తోత్రానికి స్వామి వారు సజీవ మూర్తిగా మాకు దర్శనమిస్తేనే మీరు ఈ పరీక్షలో….. భక్తి పరీక్షలో నెగ్గుతారు…. అనగానే ఇక చేసేది ఏమీ లేక అరుణగిరి నాధర్ కాస్త కుమారస్వామిని ఉద్దేశించి స్వామి! ఈ పరీక్ష నాకు కాదు….. అది నీకేనని నీకు తెలుసు. ఓడతావో నెగ్గుతావో… నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు ఏదైనా ఒకటే…. అంటూ కుమారస్వామి మీద అశువుగా ఎన్ని స్తోత్రాలు చేసినా కూడా….. స్వామి నిజరూప దర్శనం కాలేదు. ఎందుకంటే స్వామివారు అప్పటికే కాళీమాత దిగ్బంధనంలో ఉన్నారు. జ్ఞాన సంబంధర్ భక్తుడి కోరిక మేర కాళీమాత ఈయనని తన బంధనంలో బంధించింది. ఈ విషయం గ్రహించిన అరుణగిరినాధర్ వెంటనే….. ఆ తల సదా నారద అనే గీతాన్ని తన స్తోత్రముతో కాళీమాత బంధ విముక్తి కోసం స్తుతి చేయడం ఆరంభించాడు. దానితో కాళీమాత కాస్త ఈయన చేసిన స్తుతికి అమితానంద పడి కుమారస్వామిని తన బంధనం నుంచి విముక్తి చేయడంతో ……కుమారస్వామి కాస్త క్షణకాలం పాటు దివ్య తేజస్సుతో ఉజ్వల కాంతిలో ఒక స్తంభంలో నిజరూప దర్శనం అందరికీ ఇవ్వడం జరిగింది. దానితో అరుణగిరి నాధర్ భక్తి పరీక్షలో నెగ్గటం……అలాగే కుమారస్వామి దివ్య తేజస్సు ధాటికి తట్టుకోలేక ఆ రాజు గారికి కళ్ళు పోవడం జరిగింది. ఇప్పటికీ స్తంభ కుమారస్వామి ఆలయంలో ఇందుకు…. ఈ సంఘటనకి నిదర్శనముగా అరుణాచలేశ్వర ఆలయ ప్రాంగణంలో చూడటానికి ఉంది.
ఆస్థాన వైద్యులు కాస్త ….కళ్ళు పోయిన తమ రాజు దగ్గరికి వచ్చి ….పరీక్షలు చేసి హిమాలయాలలో ఉండే దేవతా పుష్పమైన పారిజాత పుష్ప రేణువులతో పొడిచేసి… వైద్యం చేస్తే ….కనుచూపు వస్తుందని అనటంతో….దీనిని తీసుకొని రావటానికి ఎవరూ కూడా సాహసించకపోవడంతో…. కుమారస్వామి ఆజ్ఞ మేర అరుణగిరి నాధర్ కాస్త, పరకాయ ప్రవేశ విద్యలో తన స్థూల శరీరమును ఇంటిలో భద్రపరచి…. చచ్చిన ఒక రామచిలక దేహంలోనికి ఆత్మ దేహంతో ప్రవేశించి…… ఆ చిలుక శరీరంతో హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడికి వెళ్లి తన చిలుక నోటితో పారిజాత పుష్పము తీసుకొని వస్తూ ఉండగా….. ఈ విషయం గ్రహించిన కాళీమాత భక్తుడైన భక్తకవి జ్ఞాన సంబంధర్ కాస్త అసూయ ద్వేషముతో…. అరుణగిరి నాధర్ భౌతిక స్థూల దేహమును దహనం చేస్తూ ఉండగా….

చిలక రూపంలో ఉన్న అరుణగిరి నాథర్ అక్కడికి వచ్చేసరికి …..తన స్థూల శరీరం దహనం అయ్యే దృశ్యం చూడటం జరిగింది. చాలా బాధపడ్డాడు…. రాజుకి తను తెచ్చిన పారిజాత పుష్పములు ఇచ్చి….. వైద్యం చేయించుకోమని చెప్పి…. మాట్లాడే చిలుకగా కిలిగోపురం మీద ఆవాసం చేస్తూ…. కుమారస్వామి మీద తన చిలుక పలుకులతో…. సంకీర్తనలు చేయడం ఆరంభించాడు. ఇలా ఈ కిలిగోపురం మీద మనకి ఆకుపచ్చని రంగుతో ఉన్న ఒక పెద్ద రామచిలక బొమ్మ కనపడుతుంది.
అలాగే ఈ గోపురం లోపల తన కామమోహమాయకు మూల కారణం….మోహిని యక్షిణి అని ఈయన తెలుసుకొని…. నాట్యం చేస్తుండగా ఈమెని తన మంత్రములతో మోహిని బంధనం చేయడంతో….. నాట్య భంగిమలోనే సజీవ మూర్తిగా మోహిని యక్షిని బందీ అయ్యింది. ఈ విగ్రహ మూర్తిని మనం ఒక నియమంతోనే చూడాలి. అది ఏమిటంటే అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి వెళ్లేటప్పుడు ఈమెను దర్శించుకోవచ్చును…. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితిలో దర్శించుకోరాదు… చూడరాదు…. ఎందుకంటే ఒకవేళ తిరిగి దర్శించుకుంటే ఈ మోహిని యక్షిని కాస్త మోహిని పిశాచిగా మారి మనల్ని పట్టుకోవడం ఖాయమని తెలుసుకోండి. కావాలని కొంతమంది తెలియక….కొంతమంది తిరిగి ఈమెను చూడటం…. ఎంతోమంది ఈమె మోహిని పిశాచి బారిన పడి పురుషులైతే పర స్త్రీల యందు….అదే స్త్రీలైతే పరపురుషుల యందు…. అమిత కామమాయలో పడి జీవితాలు నాశనం చేసుకున్న ఎన్నో సంఘటనలు…. ఇక్కడ జరగడం విశేషం కాబట్టి….ఈ విషయం అందరూ తెలుసుకొని పాటిస్తే మంచిది.
ఇలా అరుణగిరి నాధర్ తన జీవితకాలంలో సుమారుగా 16,000 కీర్తనలు కుమారస్వామి మీద రచించడం జరిగింది. కానీ ప్రస్తుతానికి మనకి 1,367 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా తిరుప్పగళ్, కంఠర్ అంతటి,కంఠర్ అలంకారం , కంతర్ అనువుత్తి, తిరువాక్కుప్పు వేలు విరుత్తం , మయిల్ విరుత్తం అను రచనలు బాగా ప్రసిద్ధి చెందాయి. దానితో ఈయనను తమిళ సాహిత్యంలో “సందచ్చం” కవిత్వానికి పితామహుడిగా పరిగణించబడ్డాడు. ఇలా మురుగన్ స్వామి అనగా కుమారస్వామి అనుగ్రహం పొందిన భక్త జ్ఞానిగా…. భక్తులకి మార్గదర్శకునిగా…. ఈయన చరిత్ర తమిళనాట చిరస్మరణీయం అయింది. ఎలా అంటే పాండిత్యం లేని కాళిదాసు కాస్త కాళీమాత అనుగ్రహం పొంది మహాకవి కాళిదాసుగా ఎలా అయితే మారాడో…… అలా పాండిత్యమే లేని డిండిమభట్టు కాస్త కుమారస్వామి అనుగ్రహం పొంది పాండిత్యంలో తనదైన ముద్ర వేసుకొని…. ఆ భగవంతుని భక్తకవిగా పేరుపొంది… అరుణగిరి నాధర్ గా మారి ఎన్నోవేల కీర్తనలు అందించి తమిళనాట గొప్ప భక్తుడు మరియు సాహితీ కారుడు అయ్యాడని తెలుసుకోండి.
అలాగే ఇప్పుడు కూడా అరుణగిరి అంతర్ గుహ యందు…. కుమారస్వామి వారి మృతదేహము 18 సిద్ధ గురువులు కాస్త 9 రకాల విష పదార్థాలతో మమ్మీగా మార్చి భద్రపరచడం జరిగింది. ఈ దేహంతో ఇప్పటికీ కుమారస్వామి కాస్త సజీవ మూర్తిగా అందరికీ కనిపిస్తూ అనుగ్రహిస్తున్నారు. ఈ మమ్మీ దేహము నమూనాను ఈ 18 సిద్ధ గురువు ఒకరైన కాలంగినాధర్ యొక్క శిష్యుడైన భోగర్ అనే సిద్ధుడికి విష పదార్థ మూలికలతో వైద్యం నేర్పించి…. నవపాషాణ పదార్థాలతో శిలమూర్తిని ఎలా తయారు చేశారో భోధించడంతో…. ఈయన కాస్త తన గురువు ఆజ్ఞ మేర పళని క్షేత్రానికి చేరుకొని…. ఎలా అయితే సజీవ మూర్తి కుమారస్వామి దేహమును… నవ విష మూలికలతో భద్రపరిచారో ….అలాగే 64 విషమూలికలలో అత్యంత ప్రమాదకరమైన తొమ్మిది రకాల విషమూలికలు కొన్ని రకాల శిలలు సేకరించి వీటితో అరుణాచల అంతర్గత గుహ యందు భద్రపరచబడిన మమ్మీ రూప కుమారస్వామి విగ్రహ మూర్తిలాగా ఈ పళని క్షేత్రంలో తయారుచేసి ప్రతిష్టించడం జరిగింది. ప్రతిరోజు ఈ విగ్రహ మూర్తికి చేసే పంచామృత అభిషేకం సేవించినా లేదా రాత్రి వేళ యందు ప్రతిరోజు ఈయననకి గంధం పట్టించడం వలన ఇది కరిగి గుండంలో కారే నీటి చుక్కలను ఒక పాత్రలలో పట్టడం జరుగుతుంది . ఈ తీర్థమునే కౌపీన తీర్థం అంటారు. ఇలా ఈ రెండు తీర్థాలు స్వీకరిస్తే ….నయం కాని రోగాలు నయం అవడం….. సంతానం లేని వారికి సంతాన దోషాలు తొలగి సంతాన ప్రాప్తిగలగటం….. ఈ స్థల పురాణంలో చెప్పడమే కాదు…. ఇక్కడి స్థానిక భక్తుల అనుభవాలు అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇంతటి మహత్తరమైన నవపాషాణ విగ్రహం మూర్తిని ఆధునిక శాస్త్రవేత్తలు తయారు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ….. ప్రయోజనం లేకపోయింది. ఆనాటి సిద్ధ వైద్యము విషమూలికలతో నయంకాని రోగాలు తగ్గించవచ్చునని….. అరుణాచల క్షేత్ర 18 సిద్దగురువుల అపార జ్ఞానం యందు ఈనాటి ఆధునిక సైన్సు జ్ఞానం ఎందుకు పనికిరాకుండా పోతుంది.
అలాగే కుమారస్వామి సజీవమూర్తిగా మనకి అరుణాచల క్షేత్రంలో తిరుగుతూ ఉన్నారని… ఎన్నో అనుభవాలు ఉన్నాయి . అందుకు ఒకటి విష్ణుశర్మ భక్తుడి అనుభవం ప్రకారం చూస్తే, ఈయన వయోవృద్ధుడు అయ్యేదాకా అరుణగిరి చుట్టు ప్రతిరోజు క్రమం తప్పకుండా…. గిరి ప్రదక్షిణం చేసేవారు. ఒక రోజు 8 సంవత్సరాల బాలుడి రూపంలో కుమారస్వామి వచ్చి ఈయన చేత ఆఖరి గిరి ప్రదక్షిణం చేయించి…. గిరి ఉత్తర దిక్కులో ఉన్న అంతర్గత గుహలోనికి తీసుకుని వెళ్ళటం….ఇక్కడున్న స్థానికులు చూడటం జరిగింది. ఆనాటి నుండి విష్ణుశర్మ జాడ లేకుండా పోయింది. ఆ బాలుడు ఎవరో కాదని సాక్షాత్తు కుమారస్వామి అని అందరూ గ్రహించి… విష్ణుశర్మ యొక్క భక్తి ప్రపత్తులను కొనియాడారు. అంతెందుకు…. రమణ స్వామి కాలంలో కూడా…. 12 సంవత్సరాల బాలుడు రూపంలో ఒక పిల్లవాడు వచ్చి…. ఈయనను తదేకంగా చూస్తూ ఉండటం జరిగింది. మహర్షికి యొక్క కంటి నుంచి కన్నీరు రావడం జరిగింది. ఇదంతా ఈ ఆశ్రమ వాసులు గ్రహించి…మిన్నుకుండి పోయారు. ఆ తర్వాత ఈ పిల్లవాడు కాస్త స్వామి ! నువ్వు నాతో పాటు వస్తావా? నా సన్నిధిలో చేర్చుకుంటాను…. అనగానే వచ్చింది బాలుడు కాదని బాల కుమారస్వామి అని మహర్షి గ్రహించిన కూడా…. ఈ పిల్లవాడితో నేను వస్తే నన్ను నమ్ముకుని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది…..నన్ను నమ్ముకొని ఆశ్రమం ఉంది…. దీని బాధ్యత నా మీద ఉంది. నేను రాలేను. నన్ను నమ్ముకున్న వారికి నమ్మకద్రోహం చేసి నా స్వార్థం నేను చూసుకుని నీ దగ్గరికి రాలేను. రాకూడదు కదా అనగానే ….ఆ పిల్లవాడు కాస్త సరే నీ ఇష్టం ….అవకాశం ఇచ్చాను….ఉపయోగించుకోలేదు… ఒత్తిడి చేయను… ఇక నేను వెళ్లి వస్తాను… ఇంక ఎప్పుడు ఇక్కడికి రాను…. అనగానే మహర్షి మౌనంగా ఉండిపోయారు. ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు.. ఆ తర్వాత ఈ పిల్లవాడు ఎవరని ఆశ్రమ వాసులు అడిగితే… నా అంశ రూపమైన బాల కుమారస్వామి అని చెప్పి తమ కోసం దైవం వచ్చినా కూడా ఈ దైవం వెళ్ళకుండా ఉన్నారని గ్రహించి….ఆనాటి నుంచి అమిత శ్రద్ధ భక్తితో ఈయనని కొలవటం జరిగింది. ఇలా ఈ ఆధునిక కాలంలో కూడా సజీవ మూర్తిగా బాల కుమారస్వామి ఉన్నారు అని గ్రహించండి తెలుసుకోండి… తరించండి..
సప్తమ అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్
సర్వం అరుణాచల శివార్పణమస్తు




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి